మష్రూమ్‌ చిల్లీ ఫ్రై వండటం తెలుగులో

మష్రూమ్‌ చిల్లీ ఫ్రై

కావలసినవి

నూనె – రెండు టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి – ఒకటి, జీలకర్ర – అర టీస్పూన్‌, కరివేపాకు – కొద్దిగా, పచ్చిమిర్చి – నాలుగు, ఉల్లిపాయ – ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్టు – ఒక టీస్పూన్‌, పుట్టగొడుగులు – పది, జీలకర్ర పొడి – అర టీస్పూన్‌, ధనియాల పొడి – అర టీస్పూన్‌, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, కొబ్బరి వెనిగర్‌ – మూడు టీస్పూన్లు, మిరియాల పొడి – కొద్దిగా, కొత్తిమీర – ఒకకట్ట.

తయారీవిధానం

ఒక పాన్‌ తీసుకొని నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి వేగించాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మరికాసేపు వేగనివ్వాలి. తరువాత అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, కట్‌ చేసి పెట్టుకున్న పుట్టుగొడుగులు వేసి కలుపుకోవాలి.
జీలకర్రపొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి మరికాసేపు వేగించాలి. చివరగా వెనిగర్‌ వేసి మరికాసేపు వేగించుకుని దింపి, కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే మష్రూమ్‌ చిల్లీ ఫ్రై రెడీ.

Read More  ఆలూ గోబీ మసాలా కర్రీ వండటం తెలుగులో
Sharing Is Caring:

Leave a Comment