...

కేశ సౌందర్యానికి భృంగరాజ్ (గుంటగలగర ఆకు)

కేశ సౌందర్యానికి భృంగరాజ్ (గుంటగలగర ఆకు)

భృంగరాజ్ ను కేశరాజ్ అనికూడా అంటారు. తెలుగులో ‘గుంటగలగర ఆకు” అంటారు. ఇవి ఇండియా, చైనా, బ్రెజిల్, థాయిలాండ్ లో లభిస్తుంది. పల్లెటూళ్లలో గుంతల దగ్గర, నీరు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో గుంటగలగర ఆకు ఎక్కువగా పెరుగుతుంది. తేలిగ్గా దొరకడం వళ్ళ అనుకుంట చాలామందికి దీనిలో ఉండే  ఔషధ గుణాలు తెలియవు. వంటల్లో కూడా ఈ ఆకుని వాడుతారు. గుంటగలగర ఆకులో ఉండే ఎక్లిప్టిక్ అనే పదార్థం లివర్ ఆరోగ్యానికి మంచి మందు.
కేశ సౌందర్యానికి భృంగరాజ్ (గుంటగలగర ఆకు)
ప్రయోజనాలు:

బట్టతల, పేనుకొరుకుడు కి  భృంగరాజ్ మొక్క ఆకుల నుండి వేరు వరకు తీసుకొని ముద్దగా చేసి ఇన్ఫెక్షన్ ఉన్నచోట రాయాలి.

 

తెల్ల వెంట్రుకలను తిరిగి నల్లగా మార్చడానికి భృంగరాజ్ థైలమ్ తయారుచేసి వాడాలి.

గుంటగలగర ఆకుల రసాన్ని తీసి జుత్తుకి పట్టించి  పదిహేను నిముషాల తరువాత తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్ళు దృడంగా తయారయి జుట్టు ఆరోగ్యాంగా తయారవుతుంది.

తేలు, చిన్న చిన్న పురుగులు కుట్టి మంటగా ఉన్నచోట ఈ రసం పూస్తే మంట తగ్గి ఉపశమనం కలుగుతుంది.

గజ్జి, తామర, ఫంగస్ లాంటి వాటికీ పై పూతగా ఈ రసం రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
వీర్య వృద్ధికి, శృంగార శక్తిని పెంచడానికి మంచి మందు.

నోటిపూత, నోటి అల్సర్లకు ఈ రసం తో పుల్లింగ్ చేస్తూ ఉంటె తగ్గుతుంది.

భృంగరాజ్ బోధకాల కు పైపూతగా రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

చాల కంపెనీలు హెయిర్ ఆయిల్స్ తయారీలో ఈ మూలికాని ఎక్కువగా వాడుతున్నారు. అందువల్ల ఈ ఆయిల్స్ కి డిమాండ్ ఎక్కువగా  ఉన్నది .

జుట్టు నల్లబడటానికి హెర్బల్ హెయిర్ డై లలో దీనిని వాడుతున్నారు.

గమనిక:

జుట్టు రాలటం, చిట్లిన జుట్టు, చుండ్రు, తెల్ల జుట్టు ఇంకా పేను కొరుకుడు వంటి అన్నిరకాల సమస్యలకు భృంగరాజ్ సరైన పరిష్కారం. అందువల్ల అందరు ఈ భృంగరాజ్ ఆయిల్, హెయిర్ డై, హెయిర్ ప్యాక్ ని వాడి దీని వళ్ళ కలిగే ప్రయోజనాలను పూర్తిగా పొందండి.

జుట్టు కోసం కొబ్బరి వల్ల కలిగే ప్రయోజనాలు

ఇంట్లోనే భృంగరాజ్ నూనెను ఎలా తయారు చేసుకోవాలి

కొబ్బరి నీరు చుండ్రు మరియు జుట్టు రాలడాన్ని నయం చేస్తుంది

జుట్టు కోసం కర్పూరం నూనె యొక్క ప్రయోజనాలు

నిమ్మరసంతో చుండ్రును పోగొట్టడానికి సులభమైన చిట్కాలు

శనగ పిండి యొక్క ప్రయోజనాలు

జుట్టు రాలడానికి కారణమయ్యే ఆహారపు అలవాట్లు

వివిధ రకాల ముఖాలపై హెయిర్ కాంటౌరింగ్ ఎలా పని చేస్తుంది

లావెండర్ ఆయిల్ చర్మం మరియు జుట్టు కోసం ప్రయోజనాలు మరియు ఉపయోగాలు

Sharing Is Caring:

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.