బియ్యం కడిగిన నీటితో ఉపయోగాలు
వరి బియ్యం కొన్ని దేశాలలో ప్రధాన ఆహారంగా అత్యంత సాధారణంగా కనిపించే పదార్ధం. ఈ బియ్యం ఆరోగ్య ప్రయోజనాలనే కాకుండా, మీ శారీరక సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుందంటే మీరు ఆశ్చర్యపోతారు? బియ్యం నీటిలో ఉండే అమైనో ఆమ్లాలు మరియు విటమిన్లు B, C & E వంటివి, మీ జుట్టుకు మరియు చర్మానికి బాగా పనిచేస్తాయి. బియ్యాన్ని కడిగినప్పుడు (లేదా) ఉడకబెట్టినప్పుడు ఈ తెల్లటి ద్రావణాన్ని (గంజిని) పొందవచ్చు, మీరు ఈ ద్రావణాన్ని అనేక సౌందర్య సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించవచ్చును .
బియ్యం కడిగిన నీటిలో అనగా గంజిలో ఉండే పిండి పదార్థం మీ జుట్టును మృదువుగా, ఆరోగ్యకరమైనదిగా చేయడంలో బాగా సహాయపడుతుంది. ఈ గంజి ప్రోటీన్లను మరియు కార్బోహైడ్రేట్లను కూడా కలిగి ఉంటుంది. అది మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చెయ్యడమే కాకుండా, వృద్ధాప్యం దశలో ప్రారంభమయ్యే కొన్ని సంకేతాలను కూడా నిరోధిస్తుంది. కాబట్టి, ఇది మీ జుట్టుకు చర్మానికి నిజంగా ఎలాంటి ప్రయోజనాన్ని చేకూరుస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ! రైస్ వాటర్ను (గంజిని) ఎలా సిద్ధం చేయాలి ? నీళ్ళతో బియ్యాన్ని కడగడం / ఉడకబెట్టడం ద్వారా వచ్చే తెల్లటి ద్రావణాన్నే గంజి అని అంటారు.
జుట్టు కోసం :- పొడి జుట్టు కోసం : గంజి, అనారోగ్యంగా ఉన్న మీ జుట్టును దృఢపరచి, మీ జుట్టు యొక్క స్థితిస్థాపకతను బాగా మెరుగుపరుస్తుంది. గంజిలో ఉన్న ప్రోటీన్లు మీ జుట్టుకు లోతైన కండీషనర్గా కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది మీ జుట్టు చిక్కుబడటాన్ని కూడా నిరోధిస్తుంది. ఇందుకోసం మీరు 3 వంతుల సాధారణ నీటికి, 1 వంతు గంజిని కలిపి ఉపయోగించండి. మీరు షాంపూతో తలస్నానం చేసిన తరువాత, ఈ గంజి ద్రావణాన్ని అప్లై కూడా చేయండి. మరిన్ని మెరుగైన ఫలితాల కోసం ఈ పద్ధతినే వారానికి 2-3 సార్లు చెప్పున ఆచరించండి.
ఆరోగ్యకరమైన జుట్టు కోసం : గంజి ద్రావణంలో మీ జుట్టుకు మేలు చేసే ప్రోటీన్ను కలిగి ఉంది. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా, మృదువుగా చేయడంలో బాగా సహాయపడుతుంది. ఈ గంజి ద్రావణంలో ఉన్న కార్బోహైడ్రేట్స్, దెబ్బతిన్న జుట్టును మృదువుగా చేసి, దానిని మరింత సులభంగా నిర్వహించుకునెలా చెయ్యడంలో మీకు బాగా సహాయపడుతుంది. సాధారణమైన నీటికి, గంజి ద్రావణాన్ని కలపండి. షాంపూతో మీ జుట్టును శుభ్రపరచుకున్న తరువాత, గంజి నీళ్లతో ఒక 10 నిమిషాల పాటు మీ జుట్టును మరియు మాడునూ నెమ్మదిగా మర్దన చేయండి. ఆ తర్వాత సాధారణ నీటితో మీ జుట్టును శుభ్రపరచుకోండి. కావాలనుకుంటే మీరు లావెండర్ ఆయిల్, రోజ్మేరీ ఆయిల్ వంటి కొన్ని ముఖ్యమైన ఆయిల్స్ను యొక్క కొన్ని చుక్కలను చేర్చవచ్చును . మీరు ఒక వారంలో కనీసం 2-3 సార్లు ఈ చిట్కాను రిపీట్ చేయవచ్చును .
చర్మం కోసం :- బిగుతైన చర్మరంద్రాల కోసం : సాధారణంగా, ఆయిల్ స్కిన్ తో బాధపడే వారు బయటకు పెద్దగా తెరచుకొన్న చర్మ రంధ్రాల సమస్యను బాగా ఎదుర్కొంటారు. చర్మ రంధ్రాలు బయట వైపుకు తెరుచుకోవడం వల్ల మోటిమలు ఏర్పడటమే కాకుండా, చర్మం పగులుటకు కూడా బాగా దారితీస్తుంది. బయటవైపుకు పెద్దగా తెరుచుకున్న చర్మ రంధ్రాలను తగ్గించడంతో పాటు, చర్మపు pH బ్యాలెన్స్ను నిర్వహించడంలో గంజి బాగా సహాయపడుతుంది. గంజిలో ఉండే రక్తస్రావ నివారిణి లక్షణాలు మీ చర్మాన్ని మరింత బిగుతుగా చేయడంలో కూడా సహాయపడుతుంది. 1 కప్పు బియ్యాన్ని తీసుకొని, ఒక 1 కప్పు నీటిలో వేసి నానబెట్టండి. ఆ నీటిని వడకట్టి, ఒక స్ప్రే బాటిల్లో నిల్వ చేయండి. ఆ నీటిని మీ ముఖం మీద స్ప్రే చేస్తూ, ఒక దూది పింజ సహాయంతో మీ ముఖమంతటా అప్లై చేసి 15-20 నిముషాల పాటు వదిలివేయాలి. ఆ తరువాత, సాధారణ నీటితో మీ ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేయాలి. మెరుగైన ఫలితాల కోసం ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ చిట్కాను అనుసరించండి.
చర్మపు మంటలను నివారించడం కోసం : గజ్జి ద్రావణం, పిండి పదార్ధాలను కలిగి ఉంటుంది, ఇది ఎలాంటి చర్మ వాపునైనా మరియు చికాకునైనా నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఇలాంటి చర్మం సమస్యను నివారించడానికి, వెచ్చని నీటిని కలిగి ఉన్న బాత్ టబ్లో కొద్దిగా గంజి ద్రావణాన్ని జోడించండి. ఆ బాత్ టబ్లో మీరు సుమారు 15-20 నిమిషాలు పాటు మునిగి ఉండండి. మీరు చర్మం చికాకు కలిగి ఉన్న నిర్దిష్ట ప్రాంతాల్లో చల్లని గంజిని కూడా అప్లై చేసుకోవచ్చును . మీరు ఆశించదగ్గ ఫలితాలను పొందే వరకు ఈ చిట్కాను రిపీట్ చేయండి.
కాంతివంతమైన చర్మం కోసం : చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో గంజి బాగా సహాయపడుతుంది, అలా ఇది మీ చర్మపు ఛాయను కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాక మీ చర్మం నుండి ఇతర విష వ్యర్ధాలను తీసివేసి, మీ చర్మం తాలూకా స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. మొదటగా, సాధారణమైన నీటిలో తగినంత గంజిని కలపండి. అందులోకి దూది పింజను ముంచి, మీ ముఖం మీద అప్లై చేసుకోండి. అలా 10-15 నిముషాలు వేచి ఉన్న తర్వాత, మీ చర్మాన్ని వృత్తాకారంలో మృదువుగా కదిలిస్తూ, గోరువెచ్చని నీటితో మీ చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. వేగవంతమైన, మెరుగైన ఫలితాల కోసం ప్రతిరోజూ దీనిని పునరావృతం చేయండి