సుబ్రహ్మణస్వామిని ఆరాధిస్తే కలిగే లాభాలు

సుబ్రహ్మణస్వామిని ఆరాధిస్తే కలిగే లాభాలు

 

దక్షిణభారతదేశంలోని ప్రజలు కుమారస్వామి పట్ల చూపే అభిమానం చాలా ఎక్కువగా  ఉంటుంది .తమిళనాడురాష్ట్రం లోకుమారస్వామిని  మురుగన్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు.  తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటూ భక్తితో తలుచుకున్నా కూడా  ఆ షణ్ముఖునికే  చెళుతుంది .

విజయాలకు

కుమారస్వామి రెల్లుపొదలలో జన్మించాడన్న  విషయం మనకు  తెలుసు .  రెల్లుగడ్డిని ‘శరం’ అని కూడా  పిలుస్తారు కాబట్టి ఆయనకు శరవణ అనే పేరు వచ్చింది  . ‘శరం’ అన్న పదానికి బాణం అని  అర్థం కూడా  వస్తుంది . శివుని సేనలకు నాయకునిగా మరియు  ప్రతి యుద్ధంలోనూ ఆయనకు విజయాన్ని సాధించిపెట్టే యోధునిగా కూడా  కుమారస్వామిని పేర్కొంటారు. అందుకే శత్రుభయం ఉన్నవారు, కోర్టులావాదేవీలతో సతమతం అవుతున్నవారు, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నవారు ఆ స్వామిని కొలిస్తే వారికీ  ఎలాంటి పీడ నుంచైనా తప్పక విముక్తులవుతారు

సుబ్రహ్మణస్వామిని ఆరాధిస్తే కలిగే లాభాలు

 

 

సంతానానికి

పార్వతీపరమేశ్వరులని ఈ సృష్టిలో ఆదిదంపతులకి చిహ్నంగా పేర్కొంటారు. వారి యొక్క  తనయుడు కాబట్టి సుబ్రహ్మణ్యుని ‘కుమార’ స్వామిగా పేర్కొంటూ ఉంటారు. ఆ స్వామి అనుగ్రహం లభిస్తే సంతానం కలుగుతుందనే నమ్మకము  కూడా  ఉంది .

జ్ఞానానికి – 

సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానాన్ని ఇష్టపడేవాడు అన్న అర్థం కూడా వస్తుంది.   పరమేశ్వరుని యొక్క  దయతో, ఆ బ్రహ్మని సైతం ఓడించగల మేథస్సు కుమారస్వామికి  ఉన్నదని  చెబుతారు. ఇక ఆయన చేతిలో శూలం ఉంటుంది కాబట్టి ఆయనను వేలాయుధన్ అని కూడా పిలవడం  జరుగుతుంది . ఆ  శూలం పదునైనా ఆయుధానికే కాదు, సునిశితమైన బుద్ధికి కూడా ప్రతీక. కాబట్టి పిల్లలకు చక్కగా చదువు  రావాలి అన్నా , తెలివితేటలతో మెలగాలన్నా ఆ స్వామిని కొలవమని చెపుతారు .

 

సుబ్రహ్మణస్వామిని ఆరాధిస్తే కలిగే లాభాలు

ఆధ్మాత్మిక ఉన్నతికి – 

శివుని తేజం రేతస్సుగా మారి గంగానదిలో పడింది , అది ఆరుభాగాలుగా మారి కుమారస్వామి జననం జరిగింది  అని  చెబుతారు . ఆ ఆరు భాగాలనూ ఆరుగురు కృత్తికలనే అక్కచెళ్లెళ్లు పెంచారు.   అందుకనే కుమారస్వామిని ‘షణ్ముఖుడు’ అని  కూడా అంటారు . అయితే ఈ కథ వెనుక ఒక ఆధ్యాత్మిక తత్వం కూడా ఉందని చెబుతారు . ఆరు అనే సంఖ్య ఆరు దిక్కులకు (తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, ఊర్థ్వం, పాతాళం) సూచిస్తుంది . పురుష శక్తికి, స్త్రీ శక్తికి చిహ్నంగా నిలిచే రెండు త్రికోణాల కలయికలో కూడా ఆరు కోణాలు  మంకు కనిపిస్తాయి. ఇలా రెండు త్రికోణాలు కలిసిన షట్కోణం గుర్తుని హిందువులతో పాటుగా క్రైస్తవులు, బౌద్ధులు, యూదులు కూడా పవిత్ర చిహ్నంగా భావిస్తుంటారు. ఆ పవిత్ర సంఖ్యకు, పవిత్ర చిహ్నానికి ప్రతీకగా షణ్ముఖుని  చూడవచ్చును.

Read More  నమస్కారం మూడు విధాలు

యోగసాధనకు – 

కుమారస్వామిని సర్పరూపంలో ఆరాధించడం వెనుక కూడా ఒక ఆంతర్యం కూడా  కనిపిస్తుంది. మనలో నిద్రాణంగా ఉన్న కుండలినిని సర్పంతో పోలుస్తూ ఉంటారు. ఆ కుండలి జాగృతం అయిన రోజున, మనిషి ఈ విశ్వమే తానన్న సత్యాన్ని గ్రహించగలుగుతాడు. అందకే కుండలిని మేల్కొల్పడం అన్నది మన యోగశాస్త్రపు అంతిమలక్ష్యంగా  కూడా కనిపిస్తుంది. ఆ లక్ష్యానికి తోడ్పాటుని అందించేలా నిత్యం సర్పం రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి  ని కొలిచే ఆచారం మొదలై ఉండవచ్చును.

జాతక దోషనివారణకు –

 వివాహం, సంసారం మరియు  సంతానం వంటి యోగాలకు కుజగ్రహం అనుకూలంగా ఉండాలన్నది జ్యోతిషుల మాట! ఆ కుజగ్రహంలో కనుక దోషాలు ఉంటే వివాహజీవితంలో ఒడిదొడుకులు వచ్చే అవకాశం ఉందని  కూడా చెబుతూ ఉంటారు. సుబ్రమ్మణ్యేశ్వర స్వామి  ని కనుక పూజిస్తే ఎటువంటి కుజదోషానికైనా పరిష్కారం లభిస్తుందన్నది తరతరాల నుంచి ఒక  నమ్మకము .

Scroll to Top