దృష్టి లోపాలను సవరించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు

దృష్టి లోపాలను సవరించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు

“సర్వేద్రియాణాం నయనం ప్రదానం” అని  కూడా అంటారు. మన ఇంద్రియాలలో కళ్ళు అన్నింటికంటే ముఖ్యమైన  అవయం . సాధారణంగా వయస్సు పెరుగుతున్న కొద్దీ దృష్టి లోపాలు అనేవి సహజం. కానీ ఇప్పుడు చిన్న వయసు నుండి  కంటి సమస్యలు  కూడా ఎదురవుతున్నాయి. అందుకే దృష్టి లోపాలను సవరించడానికి, కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని ఆహారపదార్థాలు మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.
కంటి ఆరోగ్యాన్ని కాపాడే పోషకాలు: విటమిన్ A, B6, C, E లతో పాటు పొటాషియం, జింక్, బీటాకెరోటిన్, మరియు  ఒమేగా3ఫ్యాటీయాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలు కలిగి ఉన్న ఆహారపదార్థాలు అన్ని కంటి ఆరోగ్యాన్ని బాగా  మెరుగుపరుస్తాయి.
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు :

క్యారెట్: వీటిలో విటమిన్ A ఎక్కువగా ఉంటుంది. పొటాషియం, బీటాకెరోటిన్ ఉంటాయి. ఇవి కంటి చూపుని బాగా మెరుగుపరిచి, రేచీకటి సమస్యలను కూడా అరికడుతుంది. అతినీలలోహిత కిరణాల నుండి కంటిని కాపాడుతుంది.

పాలకూర: విటమిన్ A చాల ఎక్కువ మోతాదులో ఉంటుంది. కంటిలోని కార్నియాను కాపాడుతుంది. అతినీలలోహిత కిరణాల నుండి కంటిని కాపాడుతుంది. కంటి చూపుని బాగా మెరుగుపరుస్తుంది.

బ్రోకలీ: విటమిన్ B6 ఉంటుంది.  యాంటీ ఆక్సిడెంట్స్ ని కలిగి ఉంటుంది. చూపు మసకబారే సమస్యను బాగా  తగ్గిస్తుంది.

సాల్మన్ ఫిష్: చాల ఎక్కువ మోతాదులో ఒమెగా3ఫ్యాటీయాసిడ్స్ ని కలిగి ఉంటుంది. రెటీనా డామేజ్ ని కూడా తగ్గిస్తుంది.

వాల్ నట్స్: జింక్ మరియు  ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్స్యాం టీ ఆక్సిడెంట్స్ ని కలిగి ఉంటుంది. కంటి ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలనందిస్తుంది.

స్ట్రాబెర్రీస్: విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్స్ ని కలిగి ఉంటుంది. కంటి ని పొడిబారనివ్వదు, తేమ ఉండేలా చేస్తుంది.  వయసు పైబడటం వల్ల వచ్చే కంటి సమస్యలని  కూడా తగ్గిస్తుంది.

అవకాడో: విటమిన్ C, E, B6, బీటాకెరోటిన్ పోషకాలుంటాయి. కంటిలోని మచ్చలను, దృష్టి లోపాలను  కూడా సవరిస్తాయి.

బ్లూ బెర్రీస్: యాంటీ ఆక్సిడెంట్స్  మరియు  యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలని కలిగిఉంటుంది. స్పష్టమైన కంటిచూపుని అందిస్తుంది.

చిలగడదుంప: విటమిన్ A కలిగి ఉంటుంది. కనుపాపకి బలాన్నిస్తుంది. శుక్లాలు రాకుండా, మచ్చలు రాకుండా కాపాడుతుంది.

మిరియాలు: విటమిన్ A, C, బీటాకెరోటిన్ ఉంటాయి. శుక్లాలు రాకుండా కాపాడుతాయి.గుడ్డులోని పచ్చసొన, నారింజ పళ్ళు, పాలు, మొక్కజొన్న, అవిసెగింజలు, గుమ్మడి గింజలు, పూల్ ముఖాన, బొబ్బర్లు, పొన్నగంటి కూర ఇవన్నీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

 

Read More  మలబద్దకాన్ని తరిమికొట్టె సులువైన చిట్కాలు

 

Sharing Is Caring:

Leave a Comment