బిళ్ళ గన్నేరు అనేక ఔషధ గుణాలకు నిలయం
బిళ్ళ గన్నేరు మొక్క ఆకుల రసాన్ని పరగడుపున 1స్పూన్ చొప్పున తీసుకుంటూ ఉంటె బీపీ ని కంట్రోల్ చేస్తుంది .చెడు కొలస్ట్రాల్ తగ్గించి రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా కూడా చేస్తుంది.
బిళ్ళ గన్నేరు మొక్క వేరుని ఎండబెట్టి పొడిచేసి రోజు 1/2స్పూన్ చొప్పున గోరువెచ్చటి నీటిలో కలిపి పరగడుపున రోజు తీసుకుంటూ ఉంటే- షుగర్ కూడా తగ్గుతుంది.
వీటి పువ్వుల్ని 7 లేదా 10 తీసుకుని కాషాయం ల తయారుచేసి తాగితే డిప్రెషన్ మరియు అందోళన కూడా తగ్గుతుంది
ఈ కాషాయం తీసుకోవడం వలన రుతు సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. అధిక రుతుస్రావం సమస్యకి ఇది మంచి మెడిసిన్.
బిళ్ళ గన్నేరులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాన్సర్ వచ్ఛే కారకాలను సమర్థవంతంగా కూడా ఎదుర్కుంటాయి. లంగ్ కాన్సర్ వైద్యంలో ఇదీ వాడటం వలన మంచి ఫలితాలనిస్తుంది అని అనేక పరిశోధనల్లో తేలింది.
గాయాలపైన, పుల్లపైన వీటి ఆకుల పేస్ట్ ని లేపనంలా(రోజుకి 2-3 సార్లు) రాయడం వల్ల తొందరగా కూడా మానిపోతాయి.
బిళ్ళ గన్నేరు ఆకుల కషాయంతో పుక్కిటపట్టడం వల్ల నోటి అల్సర్స్ మరియు చిగుళ్ల సమస్యలకు మంచి ఫలితం ఉంటుంది అని కూడా చెప్పుతారు .
బిళ్ళ గన్నేరు మొక్క ఆకుల పొడితో మరియు వేప ఆకుల పొడి ఇంకా పసుపు పొడిని కలిపి పేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు మరియు మచ్చలు తగ్గి ముఖం కాంతివంతంగా కూడా తయారవుతుంది.
బిళ్ళ గన్నేరు మొక్క ఆయాసాన్ని తగ్గిస్తుంది. మొలల సమస్యకు కూడా మంచి మెడిసిన్.
గర్భిణీ స్త్రీలు, బాలింతలు దీనిని తీసుకోకూడదు.
పైన చెప్పిన వాటిలో ఏ రకంగా దీనిని వాడిన కూడా 45 రోజులు వాడిన తరువాత మల్లి 45 రోజులు విరామం ఇచ్చి తిరిగి వాడటం మొదలుపెట్టాలి. సంవత్సరానికి 3-4 టైమ్స్ వాడవచ్చును .