Sweet Corn:పోష‌కాలు పోకుండా స్వీట్ కార్న్ ఇలా ఉడ‌క‌బెట్టి తినండి

Sweet Corn:పోష‌కాలు పోకుండా స్వీట్ కార్న్ ఇలా ఉడ‌క‌బెట్టి తినండి

Sweet Corn: మొక్కజొన్న కంకుల‌తోపాటు స్వీట్ కార్న్ కూడా మార్కెట్‌లో దొరుకుతుంది. దీన్ని మనం ఆహారంగా కూడా తీసుకుంటాం. సాధారణ మొక్కజొన్న కంకి వలె స్వీట్ కార్న్ మీ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్వీట్ కార్న్‌లో మన శరీరానికి అవసరమైన అనేక రకాల ఖనిజాలు మరియు విటమిన్లు ఉంటాయి. వాటిలో నియాసిన్, థయామిన్ మరియు విటమిన్ ఎ, రిబోఫ్లావిన్ విటమిన్ సి విటమిన్ ఇ విటమిన్ కె అలాగే పొటాషియం, సోడియం అలాగే కాపర్, కాల్షియం మెగ్నీషియం, ఐరన్ మరియు జింక్ వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇది ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలలో ఒకటి.

తీపి మొక్కజొన్నను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. స్వీట్ కార్న్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరచడంలో మరియు ఆరోగ్యకరమైన చర్మాన్ని కాపాడుకోవడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్వీట్ కార్న్ బిపి మరియు షుగర్ లెవల్స్ తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా సహాయపడుతుంది. స్వీట్ కార్న్‌ని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల అనేక రకాల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెపుతారు .

Read More  Jowar Upma:ఆరోగ్యకరమైన జొన్నరవ్వ ఉప్మా ఎలా తయారు చేయాలి

 

Sweet Corn:పోష‌కాలు పోకుండా స్వీట్ కార్న్ ఇలా ఉడ‌క‌బెట్టి తినండి

స్వీట్ కార్న్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో మరియు రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఉడికిన, ఉడకబెట్టిన మొక్కజొన్నలను మనం ఎక్కువగా తీసుకుంటాం.
అయితే వీటిని చాలా మంది నేరుగా నీటిలో వేసి ఉడికిస్తారు. ఇలా చేయ‌డం వ‌ల్ల వీటిలో ఉండే పోష‌కాలు మాయమవుతాయి. ఇలా నేరుగా నీటిలో వేసి ఉడికించిన వాటిని తిన్నా కూడా పెద్ద‌గా ఉపయోగము ఉండ‌దు.

Sweet Corn:పోష‌కాలు పోకుండా స్వీట్ కార్న్ ఇలా ఉడ‌క‌బెట్టి తినండి

 

వీటిలో ఉండే పోష‌కాలు పోకుండా స్వీట్ కార్న్ ను ఎలా ఉడికించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వీట్ కార్న్ కంకుల‌ నుంచి వ‌లిచి గింజ‌ల‌ను తీసుకోవాలి. ఒక గిన్నెలో లేదా కుక్క‌ర్ లో రెండు గ్లాసుల నీటిని పోసుకోవాలి . ఇప్పుడు కుక్క‌ర్ లో లేదా గిన్నెలో చిల్లుల గిన్నెను ఉంచి అందులో స్వీట్ కార్న్ గింజ‌ల‌ను వేసి మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో తిప్పుతూ చిన్న మంట‌పై 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉడికించ‌డం వ‌ల్ల స్వీట్ కార్న్ లో ఉండే పోష‌కాలు పోకుండా ఉంటాయి.

Read More  Cabbage Green Peas Curry : రుచికరమైన క్యాబేజీ పచ్చిబఠాణీల కూర ఇలా వండండి

మొక్కజొన్న కంకుల‌ బ‌దులుగా స్వీట్ కార్న్ ను ఉంచి కూడా ఇలా ఉడికించ‌వ‌చ్చును . ఇలా ఉడికించిన స్వీట్ కార్న్ గింజ‌ల‌ను నిల్వ చేసుకుని మ‌నం వివిధ ర‌కాల వంట‌ల త‌యారీలో వాడచ్చును . నేరుగా కూడా తిన‌వ‌చ్చును . వీటితో మ‌సాలా కార్న్ మరియు క్రిస్పీ కార్న్ వంటి స్నాక్స్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చును . స్వీట్ కార్న్ ను ఈ విధంగా ఉడికించి తిన‌డం వ‌ల్ల వీటిలో ఉండే పోష‌కాలు శ‌రీరానికి బాగా అందుతాయి. త‌ద్వారా మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Sharing Is Caring: