ఆముదంను జుట్టు పెరగడానికి ఎలా ఉపయోగించాలి

ఆముదంను జుట్టు పెరగడానికి ఎలా ఉపయోగించాలి?

ఆముదము నూనె పూర్వపు రోజుల్లో అందరికీ జుట్టు ఒత్తుగా ఉండేది . మీరు సరిగ్గా గమనిస్తే వాళ్ల జుట్టు అంత తొందరగా తెల్లబడేది కాదు దానికి ప్రధానమైన కారణం . ఆరోజుల్లో అందరూ తలకి ఆముదం నూనెగా  ఉపయోగించేవారు.  సహజంగా ఆముదానికి ఉండే ఘాటైన వాసన మరియు చిక్కదనం వలన క్రమక్రమంగా ఈ స్థానాన్ని కొబ్బరినూనె భర్తీ చేసింది . ఈ రోజుల్లో ఘాటైన వాసన,చిక్కదనం ఎక్కువగా ఉన్న ఆముదం నూనెను బాగా  ఉపయోగించాలి అన్నా మనకి కుదరదు.  అయితే వారంలో కనీసం ఒక్క సారైనా ఆముదాన్ని జుట్టుకు రాయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చును .
ఆముదం నూనెతో  ఒత్తుగా జుట్టుతో పాటు దీనిలో అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయి
long hair woman 3
ఆముదం నూనెను జుట్టు పెరగడానికి ఎలా ఉపయోగించాలి?
ఆముదము నూనెలో Ricinoleic Acid (రిసినోలెక్ ఆసిడ్) మరియు ఒమేగా -6 కలిగి ఉంటాయి.  కొబ్బరి నూనెలో విటమిన్ K, A మరియు E కలిగి ఉంటాయి.  ఇది జుట్టుకు రక్త ప్రసరణను వేగవంతం చేసి జుట్టు వేగంగా పెరిగేలా కూడా చేస్తుంది.  అలాగే మన జుట్టుకు అవసరమైన పోషకాలను కూడా  అందిస్తుంది. రోజ్మేరీ మీ జుట్టు ఒత్తుగా పెరగడంతో ఉపయోగపడే ప్రధానమైన నూనెలో ఒకటి ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలవల్ల ఇది ఫ్రీ రాడికల్లను నుంచి కాపాడుతుంది.  అలాగే చుండ్రు, దురద, చర్మపు చికాకు మరియు జిడ్డుగల చర్మ వంటి వాటి నుంచి కూడా రక్షిస్తుంది. చెప్పిన విధంగా తయారు చేసుకుని వారానికి రెండుమూడు సార్లు రాత్రి నిద్రించే ముందు రాసుకుంటే చక్కని ఒత్తైన జుట్టునీ  కూడా పొందవచ్చును
కావలసినవి
1 చెంచా ఆముదం నూనె
2 రోజ్మేరీ చుక్కలు {rosemary essential oil}
1 చెంచా కొబ్బరి నూనె
ఒక గిన్నెలో అన్ని పదార్ధాలను తీసుకొని కలపండి.  తరవాత మీ వెంట్రుకలకు రాసుకుని ఒక రాత్రంతా అలా ఉంచుకుని మర్నాడు తేలికపాటి షాంపుతో శుభ్రం చేసుకోండి.  మంచి ఫలితం పొందడానికి వారానికి 2-3సార్లు ఇలా చేయండి
చుండ్రుని శాశ్వతంగా తొలగిస్తుంది castor oil
చుండ్రు సాధారణంగా ఒక జిడ్డుగల చర్మం లేదా దురద వంటి సమస్య ద్వారా సంభవిస్తుంది. ఆముదము నూనెలో యాంటీ వైరల్, బాక్టీరియా, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండడంవల్ల చుండ్రును తగ్గించడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే రికోనోలెసిక్ {Ricinoleic} యాసిడ్ చర్మం యొక్క pH ను సమతుల్యం చేయడానికి బాగా పనిచేస్తుంది, ఇది జుట్టు పెరగడానికి ఆరోగ్యకరమైన మరియు చుండ్రు తగ్గించడానికి అననుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది.
కావలసినవి
 1 చెంచా ఆముదం నూనె
సోల్ ఫ్లవర్ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ 2చుక్కలు
1 చెంచా కలబంద గుజ్జు
ఒక గిన్నె లోకి 1 చెంచా కలబంద గుజ్జు తీసుకొని అందులో 2చుక్కలు సోల్ ఫ్లవర్ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ మరియు 1 చెంచా ఆముదం నూనె వేసి బాగా చిన్న మిశ్రమాన్ని మీ తలకి వెంట్రుకల కుదుళ్లకు బాగా రాసుకుని ఒక్క రాత్రంతా ఉంచుకోండి లేదా 1 గంట తర్వాత తేలికపాటి షాంపుతో శుభ్రం చేయవచ్చు. మంచి ఫలితాన్ని పొందడానికి వారానికి 2-3 సార్లు ఒక వారం ఈ పద్ధతిని పాటించండి ఇంకా చుండ్రు సమస్య అన్నది రాదు
జుట్టు చివర్ల విరిగిపోవటం
ఈ మధ్య కాలంలో చాలామందికి ఉన్న పెద్ద సమస్య జుట్టు చివర విరిగిపోతుంటాయి ఈ సమస్య ఉన్నవాళ్లు జుట్టు సమానంగా కనిపించడానికి తరుచూ హెయిర్ కట్ చేయించుకుంటూ అంటారు అది కొన్ని రోజులు జుట్టు సమానంగా బాగా కనిపిస్తుంది కానీ ఒక వారం రోజులు తర్వాత మళ్లీ సమస్య మొదలవుతుంది జుట్టు సమానంగా లేకుండా జుట్టు చివర్ల విరిగిపోతూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం మీ తలలో తేమ లేకుండా డ్రై ఉన్న చర్మం కారణంగా జుట్టుకి అందవలసిన పోషకాలు చివర వరకు అందకపోవడం ఈ సమస్యను అధిగమించడానికి ఆముదం నూనె మరియు కోడి గుడ్డు తో చక్కని పరిష్కారం ఉంది ఈ చిట్కాని వారానికి ఒకసారి కచ్చితంగా సక్రమంగా పాటిస్తే మృదువైన చక్కని ఒత్తైన జుట్టు ని పొందవచ్చు
కావలసినవి
1 చెంచా ఆముదం నూనె
1 గుడ్డు
2 చెంచా కొబ్బరి నూనె
గుడ్డు తీసుకొని అందులో 1 చెంచా కొబ్బరి నూనె మరియు 1 చెంచా ఆముదం నూనె వేసి బాగా కలపండి, వచ్చిన మిశ్రమాన్ని మీ జుట్టుకు బాగా పట్టించి కనీసం 30 నిమిషాలు ఉంచిన తర్వాత షాంపుతో తలస్నానం చేయండి వారానికి ఒకసారి ఈ పద్ధతిని పాటించవచ్చును .
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
జుట్టు బలంగా పెరగడానికి ముఖ్యంగా కావలసిన విటమిన్ e, ఇది జుట్టుకు రక్త ప్రసరణను బాగా వేగవంతం చేస్తుంది.  అందువల్ల జుట్టు త్వరగా పెరుగుతుంది. ఇది నెత్తిమీద చర్మం మీద పనిచేస్తుంది మరియు అవసరమైన పోషకాల సహాయంతో మూలాలను బలపరుస్తుంది.
కావలసినవి
1 చెంచా ఆలివ్ ఆయిల్
1 చెంచా బాదం ఆయిల్
1 చెంచా కొబ్బరి నూనే
2 విటమిన్ ఈ టాబ్లెట్లు
ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్, కొబ్బరి నూనే సమపాళ్లలో తీసుకొని ఇందులో విటమిన్ ఈ టాబ్లెట్ వేసి వేసి బాగా కలపండి.  వచ్చిన మిశ్రమాన్ని మీ జుట్టుకు ఒక రాత్రంతా బాగా పట్టించి మర్నాడు ఉదయమే షాంపుతో తలస్నానం చేయండి.  వారానికి కనీసం రెండు మూడు సార్లు ఈ పద్ధతిని పాటించండి.
ఆముదం ఆరోగ్య సూచనలు 
 
నులిపురుగులు, మలబద్దకం నివారణ కోసం ఆముదాన్ని విరివిగా బాగా వాడతారు. 4 టీస్పూన్ల కొబ్బరి నూనెలో 2 టీ స్పూన్ల అముదం కలిసి పొట్ట మీద పట్టు వేసి రాత్రంతా ఉంచాలి. ఇలా చేస్తే ఉదయానికి నులిపురుగులు  బాగా   చనిపోతాయి.
కీళ్ల నొప్పులు తగ్గడం కోసం ఈ నూనెతో మర్దనా చేస్తారు. ఆముదంలో ముంచిన క్లాత్ ను కీళ్ల మీద ఉంచి ప్లాస్టిక్ పేపర్తో కట్టేయాలి. దీని మీద వేడి నీళ్ల బాటిల్ ఉంచాలి. ఇలా గంట పాటు చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
ఎండ వల్ల కమిలిన చర్మం మామూలుగా తయారవ్వాలంటే ఆ ప్రాంతంలో ఆముదం పూసి గంట తర్వాత కడిగేయాలి.
ఆముదం చర్మం అడుగున ఉండే కొల్లాజెన్ ఉత్పత్తిని  బాగా పెంచుతుంది. ఆముదాన్ని చర్మం మీద అప్లై చేస్తే బిగుతుగా తయారై ముడతలు తగ్గుతాయి.
ఆముదం నూనెలో ఒమేగా 2ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. కాబట్టి చర్మంపై అప్లై చేస్తే ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెంది మచ్చలు మటుమాయం అవుతాయి.

విటమిన్ ఇ ఆయిల్ అప్లై చేయడం వల్ల కలిగే అద్భుతమైన చర్మం మరియు జుట్టు ప్రయోజనాలు

Read More  వేప దువ్వెనను జుట్టుకు ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు

నూనెలను మీ జుట్టుపై ఎప్పుడూ ఉపయోగించవద్దు

అందమైన కర్ల్స్‌ను పొందడానికి కొన్ని సులభమైన మార్గాలు

అత్తి పండ్ల యొక్క చర్మ మరియు జుట్టు సంరక్షణ ప్రయోజనాలు

అద్భుతమైన వర్షాకాలం జుట్టు సంరక్షణ చిట్కాలు

జుట్టు సంరక్షణ విషయంలో అపోహలు మరియు వాస్తవాలు

స్ప్లిట్ చివర్లకు చికిత్స చేయడానికి ఇంట్లో తయారుచేసుకొనే హెయిర్ మాస్క్‌లు

జుట్టు రాలిపోయే సమస్యలకు వెల్లుల్లి ఎలా ఉపయోగపడుతుంది

చర్మం మరియు జుట్టుకు పెరుగు యొక్క ప్రయోజనాలు

నేచురల్ గా స్కాల్ప్ ని దురద నివారించడానికి చిట్కాలు

జుట్టు కోసం వాల్‌నట్ యొక్క ఉపయోగాలు

Sharing Is Caring:

Leave a Comment