తెలుగు పొడుపు కథలు -2
తెలుగు పొడుపు కథలు -2 ఒకరు పొడుస్తారు, ఒకరు విడుస్తారు? సమాధానం :పొడుపు కథ నల్ల స్తంభం పైన నలుగురు దొంగలు? సమాధానం :లవంగం మొగ్గ కాయలు కాని కాయలు, ఏమి కాయలు? సమాధానం :మొట్టి కాయలు అమ్మంటే దగ్గరకొచ్చి నాన్నంటే దూరంగా పోతాయి? సమాధానం :పెదవులు ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి?సమాధానం :తక్కెడ అడుగులున్నా, కాళ్ళులేనిది?సమాధానం :గజము బద్ద, మీటర్ స్కేలు అందని వస్త్రం పై అన్నీ వడియాలే?సమాధానం :నక్షత్రాలు అందరికి చెప్పి వొచ్చేది, …