సోమవారం శివునికి పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు,The Results Of Worshiping Lord Shiva On Monday

సోమవారం శివునికి పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు ,The Results Of Worshiping Lord Shiva On Monday

శివునికి హిందూ పురాణాల ప్రకారం అనేక పేర్లు ఉన్నాయి. భక్తులు ఈశ్వరుడిని భోళా శంకరుడు, విశ్వేశ్వరుడు మరియు  పరమేశ్వరుడు, మల్లిఖార్జున స్వామి, మంజునాథ స్వామి అని  మరెన్నో పేర్లతో పూజిస్తారు . సోమవారం రోజున శివున్ని పూజించే భక్తులంతా  ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సోముడు అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుని ధరించినవాడు శివుడు. సోమ అనే శబ్దాన్ని విడగొడితే ఉమాసహితుడు అనే అర్థం కూడా  వస్తుంది.

ఉమాసహితుడు అంటే శివుడే కాబట్టి సోమవారం శివునికి ప్రత్యేక దినంగా భావించి భక్తులు పూజలు చేస్తారు. సోమవారం శివున్ని పూజించి దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల వల్ల కలిగే బాధలు ఉండవు. మూడు ఆకులు గల బిల్వ పత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. స్వామికి వెలగపండు సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది. శివున్ని పూజించేవారికి అష్టైశ్వర్యాలు కూడా  కలుగుతాయి.

Read More  గోవుకు పెట్టవలసినవి వాటి వలన ప్రయోజనం

The Results Of Worshiping Lord Shiva On Monday

సోమవారం రోజు ఇంట్లోనే చిన్న పరిమాణంలో గల శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని పూజాభిషేకాలు చేయడం చాలా  మంచిది. శివుడిని చిత్తశుద్ధి, అంకితభావంతో పూజించడం ద్వారా కార్యసిద్ధి  కూడా చేకూరుతుంది. సోమవారం శివున్ని పూజిస్తే సమస్త పాపాలు పటాపంచలై పోవడమే కాకుండా భోగభాగ్యాలు, సంపదలు  కూడా చేకూరుతాయి. ఆది దేవుడికి సంతోషాన్ని కలిగిస్తే ఆ ఇంట ఎప్పటికీ లేమి అనే మాట వినిపించదని పండితులు చెబుతున్నారు.

Tags:lord shiva,shiva,how to worship lord shiva,lord shiva songs,why to worship lord shiva,lord shiva puja on monday,sgnificant time for worshipping lord shiva,shiva abhishekam ? & it’s results,10 reasons why you should start worshiping lord shiva,how to please lord shiva,how to pray to lord shiva on mondays,worship of shiva pooja,how to worship lord shiva for love marriage,shiva linga,shiva pooja,lord shiva as layakara,shiva tandav

Read More  కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు
Sharing Is Caring:

Leave a Comment