కుప్పింట చెట్టు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

కుప్పింట చెట్టు యొక్క ఆరోగ్య  ప్రయోజనాలు

కుప్పింట చెట్టు వర్షాకాలంలో  ఖాళీ ప్రదేశాలలో బాగా పెరిగే ఒక చెట్టు. దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఒక రకం జాతి యొక్క ఆకులు గుండ్రముగా ఉంటాయి. రెండోవది ఆకులు చివర కోణం కలిగి ఉండును.  ఈ  రెండూ  రకాల చెట్టులు  సమాన గుణాలు కలిగి ఉంటాయి .

 

కుప్పింట చెట్టు  యొక్కఉపయోగాలు

కుప్పింట చెట్టు ఆకుల పసరు పూసిన చర్మరోగాలు తొందరగా  నయం అగును.

ఈ చెట్టు ఆకుల పసరు చెవిలో పిండిన చెవిపోటు తొందరగా తగ్గుతుంది .

కుప్పింట చెట్టు యొక్క వేరుతో దంతాలు  తోమినచో  దంతరోగాలు తొందరగా నశించును. 

తేనెటీగ, జెర్రి , కందిరీగ, తేలు కుట్టిన  చోట  ఈ ఆకు పెట్టి కట్టు కట్టినచో  నొప్పి  తొందరగా తగ్గును.  
కుప్పింట చెట్టు ఆకులను నూరి  పుండ్లు ఉన్న చోట  కట్టితే  తొందరగా మానుతాయి . 
పుప్పిపంటి నొప్పికి   ఈ ఆకు నలిపి పుప్పిపంటిలో ఉంచిన బాధ తగ్గిపొవును.
కుప్పింట చెట్టు  యొక్క చూర్ణం నస్యం వలే లొపలికి పీల్చిన మెదడులో గడ్డకట్టిన రక్తంను తొందరగా కరిగించును . 
 
ఈ చెట్టు ఆకుల పసరు గేదెవెన్నలో కలిపి  మూర్ఛ రోగము  ఉన్న వారికి ఇస్తే  తొందరగా తగ్గును .
దీని యొక్క వేరు, ఆకులు కలిపి కషాయం లా చేసుకుని తాగినా మరియు చూర్ణంగా  తీసుకున్న 
మొలలను  తొందరగా  నివారించవచ్చును . 
 
ఈ చెట్టు ఆకుల  పసరు ముక్కులో లేదా  కండ్లలో పిండిన  పిల్లలకు వచ్చు బాలపాపచిన్నెలను 
నివారించవచ్చును . 
ఈ చెట్టు ఆకులు 9, మిరియాలు 9, కొంచం హారతికర్పూరం ( ముద్ద కర్పూరం ) కలిపి నూరి శనగ గింజ అంత మాత్రలు కట్టి ఉదయం , సాయంత్రం నీటితో తీసుకుంటూ పథ్యం చేస్తూ పాలు తీసుకుంటూ ఉంటే  కామెర్లును తొందరగా తగ్గుతుంది. 

దీని ఆకు , వెల్లుల్లిపాయ , తమలపాకు కలిపి నూరి గోరుచుట్టు ఉన్నచోట కట్టితే అది తొందరగా తగ్గుతుంది.

Read More  ఆల్కహాల్ త్రాగిన తర్వాత వాసన రాకుండా ... ఈ చిట్కా తో మీ వాసనను తొలగించుకోండి

ఈ చెట్టు ఆకుల  పసరు  తాగిన లొపల పేరుకున్న శ్లేష్మంను  వాంతులు  రూపంలో  బయటకు పంపును. బ్రాంకైటిస్ అనగా వగర్పు గల దగ్గు నివారణ  కూడా  తగ్గును .

Sharing Is Caring:

Leave a Comment