అనాసపండు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

అనాసపండు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

కొన్ని ఫలాలు సీజన్ బట్టే వస్తుంటాయి. అందులో ఒకటి పైనాపిల్. అనాసపండుని ఇష్టపడనివాళ్లు కూడా కొందరు ఉంటారు.  ఇది తినటం వల్ల అనేక  ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి . పైనాపిల్చూడ్డానికే మంచి లుక్ ఉంటుంది .

ఈ పండు  తినటానికి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇందులో పొటాషియం మరియు  సోడియం నిల్వలు   ఎక్కువ గా ఉంటాయి. ఈరోజుల్లో కామన్ గా వచ్చే ఒత్తిడి మరియు  ఆందోళన సమస్యను ఇది తగ్గిస్తుంది . అనాసపండు డయాబెటీస్, హృదయసంబంధ వ్యాదులు, క్యాన్సర్ కారకాలైనా ఫ్రీ రాడికల్స్ తో   పోరాడుతుంది. జీర్ణక్రియకి కూడా ఇది  అద్భుతంగా పనిచేస్తుంది. ఆరోగ్యమేకాదు అందానికి కూడా పైనాపిల్ ఉపయోగపడుతుందని మీకు తెలుసా.

చర్మనిగారింపును పెంచే ఎంజైమ్ లు ఇందులో ఉన్నాయి . ఆరోగ్యపరంగా పైనాపిల్ ఎంత మంచి ఫలమో ఇప్పుడు తెలుసుకుందాము .

అనాసపండులో ఆరోగ్యప్రయోజనాలు:

 జుట్టు రాలడం తగ్గించడంలో  అనాసపండు సహాయపడుతుంది.

 విపరీతమైన వాంతులతో బాధపడేవారు పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల త్వరగా వాటి నుంచి తొందరగా   విముక్తి పొందవచ్చును .

Read More  సొరకాయతో ఎలాంటి వ్యాధికి చికిత్స చేయాలో తెలుసా?

అనాసపండులో అధిక మొత్తంలో విటమిన్ సి ఉండటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి     చాలా     ఉపయోగపడుతుంది.

అధిక రక్తపోటును అనాసపండు నియంత్రిస్తుంది.

 ఈ పండు  ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు  తోడ్పడుతుంది.

 మధుమేహం, గుండె పోటు సమస్యలు మరియు  దంతాల సమస్యలతో బాధపడేవారు అనాస మంచి ఔషధంగా కూడా  పనిచేస్తుంది.

 పైనాపిల్ వికారాన్ని  కూడా తగ్గిస్తుంది

 జ్వరం, కామెర్ల వంటి అనారోగ్యాలలో ఉన్న వారికి అనాస రసం ఒక  దివ్య ఔషధం.

 పైనాపిల్ జీర్ణక్రియ ప్రచారంలో బాగా  సహాయపడుతుంది.

 అనాసలో ఉండే బ్రొమిలైన్‌ అనే ఎంజైమ్‌ క్యాన్సర్ పేషెంట్లలో కలిగే దుష్ప్రభావాలను దూరం కూడా చేస్తుంది. ఇటీవల పరిశోధనలలో భాగంగా పైనాపిల్ లోని బీటా-కెరోటిన్‌.. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ నుంచి రక్షిస్తుందని కూడా  వెల్లడయింది.

 పూర్తిగా పండని అనాస రసం తీసు కుంటే కడుపులోని  పురుగులు చచ్చిపోతాయి.

 పండిన అనాస పండును తింటుంటే పళ్ళ నుండి రక్తంకారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది.

Read More  స్ట్రాబెర్రీస్ వలన లాభాలు నష్టాలు

బాగా పండిన పైనాపిల్ ను రోజూ తినడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని సంప్రదాయ వైద్యులు కూడా  బెబుతున్నారు.

గర్భవతులు అనాస పండుకి దూరంగా ఉండడం చాలా మంచిది. ప్రెగ్నెంట్ సమయంలో ఫైనాపిల్ తింటే గర్భం పోయే ఛాన్స్ కూడా  ఉంది. అయితే డెలివరి సమయంలో తింటే నొప్పులు తక్కువగా వస్తాయని వైద్యులు అంటుంటారు.

Sharing Is Caring:

Leave a Comment