...

రెడ్ రైస్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

రెడ్ రైస్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

బియ్యం అనగానే తెల్ల రంగు,  బ్రౌన్ రైస్ ముందుగా మనకు  గుర్తుకొస్తాయి. అయితే ఇటీవల మార్కెట్లో ఎర్రబియ్యం మరియు  నల్ల బియ్యం అనే పేర్లు కూడా  వినిపిస్తున్నాయి.ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగి వైట్ రైస్ తినడం మానేసి ముడి బియ్యం, కొర్రలు మరియు  అరికెలు వంటి వాటిని తింటున్నారు. అలాంటి వారు  ముడి బియ్యనికి బదులుగా రెడ్ రైస్ (Red Rice) తినడం చాలా  మంచిది.

తమిళనాడులో ఎర్రబియ్యాన్ని మాప్పిళ్లై సాంబ అని  కూడా అంటారు. మాప్పిళ్లై అంటే అల్లుడని అర్థం వస్తుంది . పోషకాలు నిండుగా ఉండే ఎర్రబియ్యాన్ని అల్లుడికోసం ప్రత్యేకంగా వండిపెడతారు. పీచు మరియు  ఇనుము అధికంగా ఉండే  అనేక పోషకాలు  ఈ బియ్యంలో  ఉన్నాయి. రెడ్ రైస్ బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం . ఈ రైస్ అన్నం నిదానంగా జీర్ణమవుతుంది. దీంతో త్వరగా ఆకలి వేయదు. ఈ బియ్యంలో పీచు శాతం ఎక్కువ. విటమిన్‌ బి1, బి2… వంటి విటమిన్లతోబాటు ఐరన్‌, జింక్‌ మరియు  పొటాషియం, సోడియం, కాల్షియం, మాంగనీస్‌… వంటి ఖనిజాలూ పుష్కలంగా ఉండటం వల్ల అనేక వ్యాధులకు మందులా కూడా పనిచేస్తాయి. చైనా సంప్రదాయ వైద్యంలో ఈ రైస్ ని  ఎప్పట్నుంచో వాడుతున్నారు. ఆ కారణంతోనే  అయితే ఖరీదు కాస్త ఎక్కువే. అందుకే బ్రౌన్‌ రైస్‌తో కలిపి ప్రయత్నించొచ్చును . అయితే ఎర్రబియ్యాన్ని మిగిలిన బియ్యంలా కాకుండా ఒకటికి మూడు కప్పుల నీళ్లు పోసి రెండు మూడు గంటలు నానబెట్టి, సిమ్‌లో మెత్తగా ఉడికించి తినాలి.

ఎర్ర బియ్యం ధర కేజీ దాదాపుగా 120 రూపాయిలు ఉంటుంది. ఎర్ర అన్నం ఒక కప్పు తింటే 216 కెలోరీలు లభిస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని బాగా  పెంచుతుంది. ఈ బియ్యంలోని పోషకాలు మరియు చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గిస్తాయి.

రెడ్ రైస్ను ఎక్కువ మంది తినే ఆహారంలో చేర్చుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఆంథోసయనిన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ కాంపౌండ్‌ పుష్కలంగా ఉండటం వల్లనే ఈ బియ్యం ఎరుపు రంగులో ఉంటుంది.  ఈ ఎర్రబియ్యం అధిక బరువు మరియు డయాబెటిస్ ఉన్నవారికి చాలా లాభాన్ని కలిగిస్తుంది.

ఎర్ర బియ్యంతో అన్నం వండుకొని తింటే అధికంగా గ్లూకోజ్ రక్తంలో విడుదల కాదు. ఎర్ర బియ్యం తినడం వల్ల రక్తంలో చక్కెర నిల్వలు ఎక్కువ కావని ఇటీవల జరిగిన పరిశోదనలో  కూడా  తేలింది. ఈ అన్నం తిన్నప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువసేపు  ఉంటుంది. ఆకలి  త్వరగా వేయదు. నీరసం రాకుండా మరియు చురుకుగా ఉండేలా చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ మాటిమాటికీ కలిగే చిరు ఆకలి సమస్యను బాగా  తగ్గిస్తుంది.

జంక్ ఫుడ్ పై మనసు వెళ్ళదు. ఎర్ర బియ్యానికి ఆ రంగు యాంతోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కారణంగా వస్తుంది. ఈ అన్నం తినటం వలన శరీరానికి అవసరమైన ఐరన్ సమృద్దిగా ఉంది. ఆక్సిజన్ సమస్థాయిలో శరీరానికి చేరి అలసట త్వరగా కలుగదు. ఇందులో ఉండే విటమిన్ బి6 ఎర్రరక్తకణాల సంఖ్య పెరగటానికి  కూడా సహాయపడుతుంది. దాంతో రక్తహీనత సమస్య  రాదు.

ఎర్ర బియ్యం లో మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే రక్తపోటు నియంత్రణలో కూడా  ఉంటుంది. వీటిలో యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ మరియు యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిలో లావు బియ్యం మరియు  సన్న బియ్యం రెండు రకాలు ఉన్నాయి .  కనుక బిర్యానీ కూడా వండుకోవచ్చును .

దేన్నైనా అతిగా తీసుకుంటే మీకు అందులోంచి లభించే బెనిఫిట్స్ అనేవి  చాలా మిస్సవుతాయి. పైగా, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. రెడ్ రైస్ ను కూడా మీరు మితంగానే తీసుకోవాలి. అతిగా తీసుకుంటే అరుగుదల సమస్య వస్తుంది.

రెడ్ రైస్ తో ఆరోగ్య ఫలితాలు: 

 ఇది  రక్తపోటు మరియు కొలెస్ట్రాల్‌ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

ఎర్ర బియ్యంలో ఉండే మొనాకొలిన్‌ గ్యాస్ట్రిక్‌ సమస్యల్నీ బాగా  తగ్గిస్తుంది. జీర్ణశక్తిని  కూడా పెంచుతుంది.

ఈ  రైస్‌లో క్యాల్షియం మరియు  మాంగనీస్ ఉంటాయి. ఇవి ఎముకల్ని పుష్టిగా, గట్టిగా మరియు  బలంగా, పటిష్టం చేస్తాయి. దీంతో  ఎముకలు బలాన్ని బాగా  సంతరించుకుంటాయి.

ఎర్రబియ్యం షుగర్ పేషేంట్స్ మరియు  గుండె వ్యాధి ఉన్నవారికి ఏంతో మేలు. ఈ బియ్యంలోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ ను బాగా  తగ్గిస్తాయి.

ఈ రైస్ లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వల్ల ఇవి రక్తంలో చక్కెర నిల్వలు ఎక్కువ పేరుకోనీయవు.

ఎర్ర అన్నాన్ని రోజూ తినడంవల్ల అందులోని ఐరన్‌ రక్తంలో ఆక్సిజన్‌ శాతాన్ని పెంచి కణాలకీ మరియు కణజాలాలకీ సరిగ్గా అందేలా చేస్తుంది. దీంతో శరీరం అలసట లేకుండా శక్తిమంతంగా ఉంటుంది. మానసిక ఉత్తేజాన్నీ కూడా  కలిగిస్తుంది.

ఎర్రబియ్యంలోని మాంగనీస్‌ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేయడంతోబాటు ఫ్రీ- రాడికల్స్‌నూ కూడా తగ్గిస్తుంది.

విటమిన్‌-బి6 సెరటోనిన్‌ శాతాన్ని పెంచి ఎర్రరక్త కణాల సంఖ్యను   బాగా  పెంచుంతుంది

ఈ బియ్యాన్ని  క్రమం తప్పకుండా తింటే ఆస్తమా సమస్యను  కూడా నివారిస్తుంది

ఎర్రబియ్యానికి రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించే శక్తి కూడా ఉంది. రెగ్యులర్గా  ఎర్రబియ్యం తిన్నవారికి బాన పొట్టకూడా తగ్గిపోతుంది.

ఎర్రబియ్యంలోని మెగ్నీషియం  బీపీని క్రమబద్ధీకరిస్తుంది. అందువల్ల బీపీ ఉన్న వారు  తరచూ వచ్చే హృద్రోగ వ్యాధులను ఈ రెడ్ రైస్ నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు  కూడా చెబుతున్నారు.

Sharing Is Caring:

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.