Jonna Guggillu:ఆరోగ్యకరమైన జొన్న గుగ్గిళ్ల‌ను ఇలా తయారు చేయండి

Jonna Guggillu:ఆరోగ్యకరమైన జొన్న గుగ్గిళ్ల‌ను ఇలా తయారు చేయండి

Jonna Guggillu:చిరు ధాన్యాలలో జొన్నల వాడకం ఇటీవలి సంవత్సరాలలో బాగా పెరిగింది. జొన్న‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా రొట్టెల‌ను, ఉప్మాను, గ‌ట‌క‌ను త‌యారు చేస్తూ ఉంటాం. జొన్నలలో మినరల్స్ మరియు విటమిన్లు అధికంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఆహార పదార్థాలలో జొన్నలు ఒకటి. అధిక రక్త పోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో జొన్నలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. జొన్నలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది మలబద్ధకం మరియు అజీర్ణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

మన శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే జొన్నలను మీ ఆహారంలో భాగంగా పరిగణించాలని నిపుణులు సూచిస్తున్నారు. రొట్టె మరియు గట్టకాతో పాటు, జొన్నలను ఉపయోగించి గుగ్గిళ్లను కూడా తయారు చేయవచ్చును . జొన్న గుగ్గిళ్లు రుచికరంగా ఉంటాయి. వీటిని త్వరగా తయారు చేయవచ్చు. జొన్న గుగ్గిళ్ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి..వాటిని తయారు చేయడానికి అవసరమైన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read More  Menthi Kura Tomato Curry :రుచికరమైన మెంతి టమాటో కూర ఎలా వండుకోవాలి

 

 

Jonna Guggillu:ఆరోగ్యకరమైన జొన్న గుగ్గిళ్ల‌ను ఇలా తయారు చేయండి

 

జొన్నగుగ్గిళ్ల‌ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-

జొన్న‌లు – ఒక పెద్ద కప్పు
నూనె – రెండు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి -3
ఎండు మిర్చి- 2
ఉల్లిపాయ – ఒకటి
జీలకర్ర – ఒక టీస్పూ
కరివేపాకు – ఒక రెమ్మ
ఉప్పు – రుచికి తగినంత
పసుపు- అర టీస్పూన్కా
కారం- ఒక టీ స్పూన్
నీరు, తగినంత.

Jonna Guggillu:ఆరోగ్యకరమైన జొన్న గుగ్గిళ్ల‌ను ఇలా తయారు చేయండి

జొన్నగుగ్గిళ్ల‌ను తయారు చేసే విధానము:-

ముందుగా జొన్న‌ల‌ను శుభ్రంగా క‌డిగి రెండు గంట‌ల పాటు నాన‌బెట్టుకోవాలి. త‌రువాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి దానిలో నాన‌బెట్టిన జొన్న‌ల‌ను త‌గిన‌న్ని నీళ్ల‌ను పోసి మూత పెట్టి 5 విజిల్స్ వ‌చ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన జొన్నల‌లో ఉండే నీరంతా పోయేలా వరకు వ‌డ‌క‌ట్టుకోవాలి.

తరువాత ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి . వేడి అయిన కడాయిలో నూనె వేసి కాగిన తరువాత తరిగి పెట్టిన ప‌చ్చి మిర్చి, ఉల్లిపాయ‌, ఎండు మిర‌ప‌కాయ‌లు,జీల‌క‌ర్ర ,క‌రివేపాకు వేసి తాళింపు పెట్టుకోవాలి. ఈ తాళింపు బాగా వేగిన తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న జొన్న‌ల‌ను వేసి బాగా క‌లుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమానికి ఉప్పు, ప‌సుపు, కారం వేసి కలిపి మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తరువాత స్టవ్ఆఫ్ చేసుకోవాలి.ఈ విధముగా రుచిగా ఉండే జొన్న గుగ్గిళ్లు త‌యార‌వుతాయి.

Read More  Cashew Nuts Laddu:రోజూ ఒక్కసారైనా జీడిపప్పు లడ్డూ తినండి

వీటికి గ‌రం మ‌సాలాను, ఎండు కొబ్బ‌రి పొడిని కూడా ఉప‌యోగించ‌వ‌చ్చును . సాయంత్రం వేళ్లలో ఇలా ఆరోగ్యానికి మేలు చేసే జొన్నల‌తో చేసిన గుగ్గిళ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అన్నీ అందుతాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జొన్న‌లు జీర్ణ‌మ‌వ్వ‌డానికి ఎక్కువ స‌మ‌యం తీసుకుంటాయి. క‌నుక వీటిని తిన్న చాలా స‌మ‌యం వ‌రకు మ‌న‌కు ఆక‌లిగా అనిపించ‌దు. త‌ద్వారా మ‌నం త‌క్కువ‌గా ఆహారాన్ని తీసుకుంటాం. ఈ విధంగా జొన్నలు మన బరువు తగ్గడానికి సహాయపడతాయి.

Sharing Is Caring: