జనగాం జిల్లా తరిగొప్పుల మండలం గ్రామాల వివరాలు
తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా లోని తరిగొప్పుల మండలం . జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. అంతకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం జనగామ రెవిన్యూ డివిజనులో ఒక భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలం జనగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ మండలంలో 8 గ్రామాలున్నాయి.
వివరాలు
లోగడ తరిగొప్పుల గ్రామం వరంగల్ జిల్లా. వరంగల్ రెవిన్యూ డివిజను పరిధిలోని నెర్మెట్ట మండలానికి చెందినది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా తరిగొప్పుల మండలాన్ని (1+07) ఎనిమిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జనగామ జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.
1 అంకుశపురం
2 బొంతగట్టునగరం
3 తరిగొప్పుల
4 సోలిపురం
5 పోతారం
6 అక్కెరాజేపల్లె
7 నర్సాపూర్
8 అబ్దుల్‌నగరం