అర్జునుడికి గీతోపదేశం చేసిన ప్రదేశంలోని కురుక్షేత్రం

అర్జునుడికి గీతోపదేశం చేసిన ప్రదేశంలోని కురుక్షేత్రం

 ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని డిలీ నుండి 150 కి.మీ దూరంలో ఉంది. ఈ పేరు రావటానికి కారణం పూర్వం కురువంశ మూలపురుషుడు ‘కురువు’ యజ్ఞం చేయటానికి ఈ క్షేత్రమును ఎంచుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధం జరిగిన స్థలం. శ్రీ కృష్ణ భగవానుడు రథసారధియై అర్జునుడికి గీతోపదేశం చేసిన స్థలం జ్యోతీశ్వర్ గా ప్రసిద్ధిచెందింది. భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వరకు అంపశయ్య పై ఉన్న ప్రదేశం మరియు శ్రీవిష్ణుసహస్రనామాన్ని భగవానుడు శ్రీకృష్ణుడి సన్నిధానంలో చెప్పిన ప్రదేశం. ఈ ప్రదేశంలోని భూమి అంతా ఎరుపురంగులో ఉంటుంది. ఎన్నో ఆలయాలు, జలాశయాలు, సరస్సులు ఉన్న ఈ ప్రదేశం 2500చ.మైళ్ళు విస్తరించి ఉ ంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న వటవృక్షం కురువు యజ్ఞం చేసిన నాటి కాలం నుంచి ఇప్పటి వరకు అన్నింటికీ సాక్షీభూతంగా నిలిచి ఉంది.

అర్జునుడికి గీతోపదేశం చేసిన ప్రదేశంలోని కురుక్షేత్రం

ఎంతటి పాపాలు చేసిన వారైనా కురుక్షేత్ర యుద్ధ ప్రదేశంలో చనిపోతే వారికి స్వర్గలోక ప్రాప్తి కలగాలని ‘కురువు’ దేవేంద్రుడిని కోరగా .. అప్పుడు  దేవేంద్రుడు అనుగ్రహించాడని స్థలపురాణం చెపుతుంది . అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రాంతంలో మహాసంగ్రామాన్ని నిర్వహించినట్లు చెప్తారు.

Read More  గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసుకుందాము

మహా భారతంలో కురుక్షేత్ర యుద్ధం  ప్రముఖ ఘట్టం. మహా భారత యుద్ధం దాయాదులైన కౌరవులకు పాండవులకు హస్తినాపుర సింహాసనం కోసం యుద్ధం   జరిగింది. ఈ యుద్ధం కురుక్షేత్రం అను ప్రదేశములో జరిగింది. కురుక్షేత్రం మన భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉంది. అప్పటి రాజ్యాలన్నీ  కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాయి.

కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది. మహాభారతంలోని భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలలో కురుక్షేత్ర యుద్ధం గురించిన వర్ణన ఉంది. భగవద్గీత మహాభారత కురుక్షేత్ర యుద్ధ ప్రారంభంలో ఆవిర్భవించింది. పాండవవీరుడైన అర్జునుని కోరికపై అతడి రథసారథి శ్రీకృష్ణుడు రథాన్ని రణభూమి లో మోహరించిన రెండు సైన్యాల మధ్యకు తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూసి అతని కి  హృదయం కాకా  వికలమైంది. రాజ్యం కోసం బంధు మిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని “నా కర్తవ్యమేమి?” అని అడిగాడు. అలా అర్జునునికి  రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.

Read More  ఏ ప్రదేశాల్లో జపం చేస్తే | ఎంత ఫలితము ఉంటుంది?

 

Sharing Is Caring:

Leave a Comment