Mixed Vegetable Idli: కూరగాయలతో రుచికరమైన ఇడ్లీలను ఇలా తయారు చేసుకోండి

Mixed Vegetable Idli :కూరగాయలతో రుచికరమైన ఇడ్లీలను ఇలా తయారు చేసుకోండి

 

Mixed Vegetable Idli: ఉదయం అల్పాహారంలో భాగంగా ఇడ్లీల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వాటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. త్వరగా జీర్ణమవుతుంది. బరువు తగ్గడానికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఈ ఇడ్లీల‌ను మ‌రింత ఆరోగ్య‌వంతంగా, రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చును . కూరగాయల ముక్కలను ఉపయోగించి కూడా ఇడ్లీలను తయారు చేయవచ్చు. కూరగాయలను జోడించడం ద్వారా ఆరోగ్యకరమైన ఇడ్లీలను ఎలా తయారు చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాము .

 

Mixed Vegetable Idli: కూరగాయలతో రుచికరమైన ఇడ్లీలను ఇలా తయారు చేసుకోండి

మిక్స్‌డ్ వెజిటబుల్ ఇడ్లీల తయారీకి కావాల్సిన పదార్థాలు:-

ఇడ్లీ పిండి – 2 కప్పులు.
తురిమిన క్యారెట్- ఒక కప్పు
సన్నగా తరిగిన- క్యాప్సికమ్ ముక్కలు
ఉప్పు-తగినంత

Mixed Vegetable Idli : కూరగాయలతో రుచికరమైన ఇడ్లీలను ఇలా తయారు చేసుకోండి

మిక్స్‌డ్ వెజిటబుల్ ఇడ్లీ తయారీ విధానం:-

ముందుగా ఇడ్లీ పిండిని తీసుకుని అందులో తురిమిన క్యారెట్ క్యాప్సికమ్ ముక్కలను వేసి, పిండిని ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇడ్లీల‌ను త‌యారు చేసే ప్లేట్ ల‌ను తీసుకుని వాటికి నూనెను లేదా నెయ్యి కానీ రాసుకోవాలి. ఇప్పుడు వాటిలో క్యారెట్, క్యాప్సికం వేసి క‌లిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిని వేసి ఇడ్లీ పాత్ర‌లో ఉంచి 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి . ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మిక్స్ డ్ వెజిటెబుల్ ఇడ్లీ త‌యార‌వుతుంది. మ‌రో విధంగా కూడా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చును .

Read More  Ragi Soup:అత్యంత రుచికరమైన రాగి సూప్ ను ఇలా తయారు చేసుకొండి

ఇడ్లీ ప్లేట్ ల‌కు నూనె లేదా , నెయ్యి కానీ రాసి వాటిల్లో క్యారెట్ తురుమును, క్యాప్సికం ముక్క‌ల‌ను కొద్ది కొద్దిగా ఉంచి వాటిపై ఇడ్లీ పిండి పోసి ఉడికించాలి . ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా మిక్స్ డ్ వెజిటేబుల్ ఇడ్లీ త‌యారవుతుంది.

వీటి త‌యారీలో మ‌నం బీట్ రూట్ తురుమును కూడా ఉప‌యోగించ‌వ‌చ్చును . ఇలా త‌యారు చేసుకున్న ఇడ్లీల‌పై కొద్దిగా నెయ్యిని వేసి పిల్ల‌ల‌కు నేరుగా పెట్ట‌వ‌చ్చును .ఇడ్లీలను కొబ్బరి చట్నీ మరియు పల్లీ చట్నీతో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరం కూడా

Sharing Is Caring: