Sprouts Salad:రుచికరమైన మొలకల సలాడ్ ను ఇలా చేసి తినండి

Sprouts Salad:రుచికరమైన మొలకల సలాడ్ ను ఇలా చేసి తినండి

Sprouts Salad – మన ప్రస్తుత ఆహారపు అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మొలకెత్తిన గింజలను తినడం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించవచ్చు, అని చాలా మంది వైద్య నిపుణులు అంటున్నారు. మొలకెత్తిన గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. అవి మరింత ప్రాచుర్యం పొందుతున్నాయి. మొలకెత్తిన గింజల్లో పీచు కారణంగా జీర్ణక్రియ మెరుగవుతుంది. ఈ విత్తనాలు ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

మొలకెత్తిన విత్తనాలను తింటే రక్తహీనత తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కండరాల నిర్మాణానికి వ్యాయామం చేసే వారికి ఇవి చాలా మంచివి. ఆరోగ్యకరమైన చర్మం ముఖ్యం. మొలకెత్తిన విత్తనాలను తీసుకోవడం వల్ల లైంగిక శక్తిని పెంచుకోవచ్చును .ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. షుగర్, బీపీ అదుపులో ఉంటాయి. శ‌న‌గ‌లు, పెస‌లు, ప‌ల్లీలు, అల‌సంద‌లు, బొబ్బ‌ర్ల వంటి వాటిని మ‌నం మొల‌కెత్తిన విత్త‌నాలుగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ విత్తనాలు అందరికీ సరిపోవు. అలాంటి వారు వీటిని స‌లాడ్ లా చేసుకుని తిన‌వ‌చ్చును . ఇక మొల‌కెత్తిన విత్త‌నాల‌తో స‌లాడ్ ను ఏవిధంగా చేసుకోవాలి.దానికి తయారు చేయడానికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read More  Green Moong Dal Laddu:పెసలను ఉపయోగించి లడ్డూలును ఇలా తయారు చేసుకొండి

Sprouts Salad:రుచికరమైన మొలకల సలాడ్ ను ఇలా చేసి తినండి

స్ప్రౌట్స్ సలాడ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-

పెసలు- రెండు కప్పులు
అలసంద- ఒక కప్పు
శ‌న‌గ‌లు -అరకప్పు
ప‌ల్లీలు- అరకప్పు
క్యారెట్‌ తరిగినవి – అరకప్పు
క్యాప్సికమ్‌ తరిగినవి – అరకప్పు
టొమాటో తరిగినవి-ఒకటి
ఉల్లిపాయ ముక్కలు- పావు టీస్పూన్‌
చాట్ మసాలా – చిటికెడు
జీలకర్ర పొడి- పావు టీస్పూన్
. ఉప్పు – రుచికి తగినంత
నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్
కొత్తిమీర తరుగు – కొద్దిగా

Sprouts Salad:రుచికరమైన మొలక

సలాడ్ ను ఇలా చేసి తినండి

స్ప్రౌట్ సలాడ్ తయారీ చేసే విధానం:-

పెసలు మరియు అలసంద, పల్లి, శనగలను విడివిడిగా శుభ్రంగా కడగాలి. తరువాత, వాటిని 5 నుండి 7 గంటలు పాటు నానబెట్టడానికి తగినంత నీరు పోయాలి . వాటిని ఒక శుభ్రమైన వ‌స్త్రంలో చుట్టి 7 నుండి 8 గంటలు క‌దిలించ‌కుండా ఉంచాలి.దీని వల్ల ఎక్కువ మొలకలను వస్తాయి . వ‌స్త్రం నుండి మొలకలను తీసి ఒక గిన్నెలో ఉంచాలి . వీటిలో పైన చెప్పిన ప‌దార్థాల‌న్నింటినీ వేసి బాగా క‌లుపుకోవాలి. ఈ విధముగా మొల‌క‌ల స‌లాడ్ త‌యార‌వుతుంది.

Read More  Vamu Annam:జీర్ణ సమస్యలకు వాము అన్నంతో చెక్ పెట్టవచ్చును

ప్రతి ఉదయం, మొలకెత్తిన విత్తనాలు శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తాయి. మొలకెత్తిన విత్తనాలను నేరుగా తీసుకోవడం ఉత్తమ మార్గం. మొలకెత్తిన విత్తనాలను నేరుగా తినడం మంచిది. అయితే వీటిని నేరుగా తినలేకపోతే సలాడ్ లాగా తినడం మంచిది.

Sharing Is Caring: