నవగ్రహా పూజ మరియు ఫలితాలు,Navagraha Puja and Results

నవగ్రహా పూజ మరియు ఫలితాలు 

 

నవగ్రహాలకు  హిందువుల జీవిత ఆచారాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్నది.  మానవుల యొక్క స్థితిగతులు మరియు భవిష్యత్తు వ్యవహారాలపై నవగ్రహాల ప్రభావం ఉంటుంది. ఈభూప్రపంచంలో దేవతలతో సమానంగా నవగ్రహాలకి కూడా ప్రాధాన్యం ఉంది. నవగ్రహాలు మానవులు చేసిన కర్మలను అనుసరించే వారికి శుభ  మరియు అశుభ ఫలితాలు  అందిస్తుంటాయి.

 

Navagraha Puja and Results

 

నవగ్రహా పూజ మరియు ఫలితాలు

 

అధిపతి 

బుధ  గ్రహాణికి  అధిపతి విష్ణువు,గురు గ్రహాణికి  అధిపతి ఇంద్రుడు,సూర్య గ్రహాణికి  అధిపతి అగ్ని, చంద్ర గ్రహాణికి  అధిపతి వరుణుడు,  కుజ  గ్రహాణికి  అధిపతి కుమారస్వామి,శుక్ర గ్రహాణికి  అధిపతి శచీదేవి,శని గ్రహాణికి  అధిపతి బ్రహ్మ.

రుచులు 

సూర్యుడు కారానికి,చంద్రుడు లవణానికి , కుజుడు చేదుకు, బుధుడు షడ్రుచులకు, గురువు తీపికి, శుక్రుడు పులుపుకు, వగరు రుచులకు అధిపతులు.

సూర్యుడు ఆయనముకు, చంద్రుడు క్షణానికి, కుజుడు ఋతువుకు, బుధుడు మాసానికి, గురువు పక్షానికి మరియు  శుక్రుడు సంవత్సరాలకు అధిపతులు.

భూమండలం మొత్తం నవగ్రహాల ద్వారానే నడుస్తుంది. ఈ గ్రహాల వల్లే స్తావర జంగమములు ఏర్పడినవి .ఈ గ్రహల్లోనే  త్రిమూర్తులు మరియు  త్రిదేవినులు కొలువైనది . గ్రహరూపి జనార్దన , గ్రహరూపి మహేశ్వర అనే వచనం ప్రకారం హరిహరులు గ్రహ రూపంలోనే  కొలువై ఉన్నారు.

Read More  గాయత్రీమంత్రం అసలు ఎలా జపించాలో తెలుసా

నవగ్రహా పూజ మరియు ఫలితాలు,Navagraha Puja and Results

 

గ్రహాలనురెండు వర్గములుగా సృష్టి ఆదిలోనే విభజించారు. అవి

గురుపాలితములు: రవి, చంద్ర, కుజ, గురు, కేతు

శనిపాలితములు: శని, బుధ, శుక్ర, రాహు

పాపపుణ్యములు  కూడా వీరిలోనే ఉన్నవి. గ్రహశాంతి అంటే జాతకునికి ఏ గ్రహం పాపగ్రహమో , ఏది ఎక్కువ బాధిస్తుందో తెలుసుకొని ఆయా గ్రహాలకు వారి ప్రీతికరమైన ధాన్యం మరియు  వస్త్రాలను సంకల్పయుతంగా దానమిచ్చిన ఆ గ్రహ పీడా యొక్క నివారణ జరిగి కొంత ఉపశమనం కూడా  కలుగుతుంది.

నవ గ్రహాల్లో ప్రతీ గ్రహమూ శుభాన్ని – అశుభాన్ని రెండింటినీ కూడా  కలిగిస్తుంది. ఈ శుభాశుభాలనేవి ఆ జాతకుడి  యొక్క గ్రహస్థితిని బట్టి ఉంటుంది. మరి నవగ్రహాల ద్వారా కలిగే అశుభాల్ని నివారించుకోవటానికి మార్గం లేదా అంటే ఉంది. అది నవగ్రహాలని నిత్యం స్తుతిస్తూ, పూజిస్తూ వుండడం ద్వారా  ఆయా గ్రహ మంత్రాల్ని జపం చేయటం లేదా చేయించుకోవటం వలన  నవగ్రహ శాంతిని పొందచ్చును . ఈ నవగ్రహ పూజ, జప దానాల వల్ల పూర్తిగా దోషం నుంచి తప్పించుకోలేకపోయినా, ఆ దోషం ద్వారా కలుగబోయే పెద్ద ప్రమాదం నుంచి సులభంగా కూడా  బయటపడవచ్చును .

Read More  వినాయకుడి ఇష్టమైన పూలు వాటి యొక్క విశిష్టత

నవగ్రహ శాంతికి సంబంధించి పూజాది కార్యక్రమాలు చేసేవారు ఆయా ప్రత్యేక వస్తువులతో పూజని కూడా నిర్వహించాలి. పూజలో గ్రహ శాంతికి దోష నివారణకు దానాలు  చాలా చేయాలి. ఇలా చేసిన వారికి దోష నివారణ జరిగి శుభాలు  కూడా కలుగుతాయి. కోరిన కోర్కెలు కూడా నెరవేరతాయి.

 సూర్య గ్రహ పూజ చేసేవారు గోధుమలను దానం చేయాలి. చేతికి కెంపు ఉంగరాన్ని ధరించటం వల్ల రోగాలు  మరియు  మానసిక బాధలు తొలగి మనశ్శాంతి కూడా  కలుగుతుంది.

గురు గ్రహ పూజను నిర్వహించేవారు శనగలను దానం చేయాలి. అదే విధంగా కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించటం వల్ల అధికారం మరియు ధనయోగంతో పాటు కీర్తివంతులు  కూడా  అవుతారు .

చంద్రుని పూజకు బియ్యాన్ని దానం చేస్తే సరిపోతుంది. చేతికి ముత్యాన్ని ధరించటం వల్ల నేత్రాలకు సంబంధించిన బాధలు  కూడా  తగ్గుతాయి .

కుజ గ్రహ పూజలో కందులను దానం చేయాలి. చేతికి పగడపు ఉంగరాన్ని ధరించటం వల్ల రుణ విముక్తి కలిగి శతృ బాధ కూడా  తొలగుతుంది.

బుధ గ్రహ పూజలో పెసలను దానం చేయాలి. చేతికి పచ్చల ఉంగరాన్ని ధరించటం వల్ల ధనలాభం కలగటమే కాక వృత్తి వ్యాపారాల్లో బాగా అభివృద్ధి కలుగుతుంది.

Read More  ఆవులో ఏముంది? ఆవు ఎందుకు అంత గొప్పది? ఆవు / గోమాత మహిమ

శుక్రుని పూజలో అలచందలను  దానం చేయాలి. చేతికి వజ్రం, పగడము ధరించడం వల్ల కార్యసిద్ధి కూడా  కలుగుతుంది. వివాహాది శుభకార్యములకు ఉన్న అడ్డంకులు కూడా  తొలగిపోతాయి.

నవగ్రహా పూజ మరియు ఫలితాలు,Navagraha Puja and Results

 

రాహు పూజకు మినుములను దానం చేయాలి.  చేతికి గోమేధిక ఉంగరాన్ని ధరించటం వల్ల భయాందోళనలు తగ్గుతాయి. ధనప్రాప్తి కూడా  కలుగుతుంది.

కేతువు పూజలో ఉలవల దానం చేయాలి. చేతికి వైఢూర్యం ఉంగరాన్ని ధరించాలి. దీనివల్ల సర్పాది భయాలు తొలగటమే కాక, దైవశక్తి  కూడా పెరుగుతుంది.

శనిపూజలో నువ్వులను దానం చేయాలి. చేతికి నీలిరంగు రాయి కలిగిన ఉంగరాన్ని ధరించటం వల్ల ఆరోగ్యవంతులవటమే కాక ఇతర కష్టాలు కూడా తొలగిపోతాయి.

నవగ్రహాలు సంతృప్తి చెంది మానవులకు సుఖశాంతుల్ని ప్రసాదించాలంటే నవగ్రహాలుని దేవతల్లా భావించి పూజించాలి.

Tags: navagraha,navagraha mantra,navagraha stotram,navagraha puja,navagraha pooja,navagrahas,navagraha stotram telugu,navagraha puja samagri,navagraha mantra 108 times,navgraha mantra,navagraha stotra,navagraha mantra in tamil,navagraha dosha and its remedies,navagraha mantra in sanskrit,navagraha mantra with lyrics,navagraha puja vidhi,navagraha pooja mantra,navagraha pooja benefits,navagraha pooja vidhanam,navagraha stotram and meaning

Sharing Is Caring:

Leave a Comment