Ragi Laddu: ఆరోగ్యానికి రాగిపిండి లడ్డు చాలా మంచిది

Ragi Laddu: ఆరోగ్యానికి రాగిపిండి లడ్డు చాలా మంచిది

 

Ragi Laddu: చిరు ధాన్యాలతో రాగులను వాడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రాగుల ను మన ఆహారంలో అంతర్భాగంగా చేసుకున్నప్పుడు మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాము. రాగులలో శరీరానికి అవసరమైన అమినో యాసిడ్స్ అధికంగా ఉంటాయి. మానసిక స్థితిని మెరుగుపరచడంలో ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. రాగులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. రక్తంలోని చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. రక్తహీనతను తగ్గించడంలో ఇవి చాలా సహాయపడతాయి.

 

నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో రాగులు కూడా ఉపయోగించబడతాయి. రాగులు బరువు తగ్గడంలో బాగా సహాయపడుతుంది. రాగి పిండిని రొట్టెలు మరియు జావాతో సహా వివిధ రకాల ఆహారాలకు ఉపయోగిస్తారు. రాగి పిండితో రుచికరమైన లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చును . రాగి పిండితో లడ్డూలను తయారు చేయటానికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము .

Read More  Vamu Annam:జీర్ణ సమస్యలకు వాము అన్నంతో చెక్ పెట్టవచ్చును

 

Ragi Laddu: ఆరోగ్యానికి రాగిపిండి లడ్డు చాలా మంచిది

రాగిపిండి లడ్డూ తయారీకి కావలసిన పదార్థాలు:-

రాగి పిండి – 1 కప్పు
తరిగిన జీడిపప్పు- ఒక టేబుల్ స్పూన్
తరిగిన బాదం పప్పు- ఒక టేబుల్ స్పూన్
నెయ్యి -2 టేబుల్ స్పూన్లు
తురిమిన బెల్లం – ఒక కప్పు
పల్లిలు -అరకప్పు
మరిగించి చల్లార్చిన పాలు – అర లీటరు
యాలకుల పొడి – పావు టీ స్పూను

Ragi Laddu: ఆరోగ్యానికి రాగిపిండి లడ్డు చాలా మంచిది

రాగి పిండి లడ్డు తయారు చేసే విధానము:-

ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి.ఇప్పుడు దాని మీద ఒక కడాయి పెట్టి వేడి చేయాలి. కడాయి వేడి అయిన తరువాత జీడిపప్పు, బాదంపప్పులను వేసి బాగా వేయించుకోవాలి. అలా వేయించిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చ‌ల్లార్చుకోవాలి. అలా చ‌ల్లార్చిన వాటిని ఒక మిక్సీ జార్ లో వేసుకొని క‌చ్చా ప‌చ్చాగా పట్టుకోవాలి.అదే కడాయిలో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తరువాత రాగి పిండిని వేసి చిన్న మంట‌పై 10 నిమిషాల అటు ఇటు క‌లుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించిన రాగి పిండిలో తురిమిన బెల్లం వేసి స్ట‌వ్‌ ఆఫ్ చేసుకోవాలి.

Read More  Korra Idli : ఆరోగ్యకరమైన కొర్ర ఇడ్లీని ఇలా తయారు చేయండి

తర్వాత యాలకుల పొడిని మిక్సీ ప‌ట్టుకున్న ప‌ల్లీ మిశ్ర‌మాన్ని వేసి బాగా క‌లుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి సరిపడా పాలు పోస్తూ క‌లుపుకుంటూ అవసరమైన మొత్తంలో ల‌డ్డూల‌లా త‌యారు చేసుకోవాలి. ఈ విధముగా రుచికరమైన రాగి పిండి లడ్డూలు తయారవుతాయి. ప్రతిరోజూ రెండు లడ్డూలు తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. అలాగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి.

Originally posted 2022-10-25 11:17:47.

Sharing Is Caring: