Korrala Annam:సుల‌భంగా కొర్రలతో అన్నము వండుకోవచ్చు

Korrala Annam:సుల‌భంగా కొర్రలతో అన్నము వండుకోవచ్చు

Korrala Annam: మనం తరచుగా తినే మరో చిరుధాన్యం కొర్రలు . కొర్రలు తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని మనందరికీ తెలుసు. కొర్రలు ఎముకలను బలపరుస్తాయి. ఇది నాడీ వ్యవస్థ పనితీరును బాగా మెరుగుపరుస్తుంది. అజీర్ణం నుంచి ఉపశమనం పొందడంలో కొర్రలు చాలా మేలు చేస్తాయి. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఇది అజీర్ణం ప్రమాదాన్నికూడా తగ్గిస్తుంది. కొర్రలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను (LDL) తగ్గించవచ్చు మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

 

Korrala Annam: సుల‌భంగా కొర్రలతో అన్నము వండుకోవచ్చు
రక్తంలోని చక్కెరను నియంత్రించడానికి, బరువు తగ్గడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా కొర్రలు మంచిది. కొర్రలు వాడే వారు పెరుగుతున్నారు. చాలా మంది కొర్రలతో దోసెలు, ఇడ్లీ, ఉప్మా కూడా తయారు చేస్తారు. కొర్రలతో కూడా అన్నం వండుకోవచ్చును . కొర్రలతో వండిన అన్నం మాములు అన్నం కంటే ఆరోగ్యకరమైన ఎంపిక. బియ్యంతో చేసిన అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి మరియు పోషకాలు తక్కువగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం బాగా పెరుగుతుంది. అలాగే బరువు కూడా పెరుగుతుంది.

Read More  Nuvvula Karam Podi : ఆరోగ్యకరమైన నువ్వుల కారం పొడి ఇలా తయారు చేసుకొండి

మధుమేహ రోగులు బియ్యంతో వండిన అన్నానికి దూరంగా ఉండాలి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచుతుంది. బియ్యంతో వండిన అన్నానికి బ‌దులుగా కొర్ర‌ల‌తో వండిన అన్నాన్ని తినం వ‌ల్ల చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. కొర్రల అన్నం కూడా కొద్ది నిమిషాల్లోనే తయారవుతుంది.

Korrala Annam:సుల‌భంగా కొర్రలతో అన్నము వండుకోవచ్చు

కొర్ర‌ల‌ అన్నాన్ని తయారు చేసే విధానము:-

ఒక కప్పు కొర్రల ను కడిగి తగినన్ని నీటిలో ఆరు గంటల పాటు నానబెట్టాలి. నీటిని వంపేసి, ఒక కప్పు కొర్రలో రెండు కప్పుల నీరు వేసి, కొర్ర మెత్తబడే వరకు ఉడికించాలి. కొర్రలో ఉప్పు కూడా వేసుకోవచ్చును . కొర్ర‌ల‌తో అన్నాన్ని వండుకుంటే కాలేయ సమస్యలు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది మరియు మలబద్ధకం కూడా తగ్గుతుంది. కొర్ర‌ల‌తో అన్నం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

Sharing Is Caring: