కొబ్బరికాయను కొట్టడంలో పాటించవలసిన నియమాలు

కొబ్బరికాయను కొట్టడంలో  పాటించవలసిన నియమాలు

 

పూజ చేసాక, దేవుడికి కొబ్బరికాయ కొట్టడం అనేది మనకు ఉన్న  ఒక పద్దతి / ఆచారం. పూజ పూర్తి అయ్యాక, టెంకాయ కొట్టేసాం, నైవేద్యం పెట్టెసాం తంతు పూర్తి అయింది అని అనుకుంటాము.కాని  అంతా బాగనే ఉంది గాని, టెంకాయ కొట్టడంలో కూడా ఒక పద్దతి ఉంది.  దాని  గురించి తెలుసుకుందాం.

టెంకాయ కొట్టడం  ఒక శాంతి కారకం మరియు  అరిష్టనాశకం.

శాస్త్ర ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలు ఉన్నాయి.

అవి:-

భగవంతునికి వేదనకు కొబ్బరికాయను కొట్టబోయే ముందు దానిని స్వచ్చమైన నీటితో కడిగి, ఆ తరువాత టెంకాయ పీచు ఉన్న ప్రదేశాన్ని చేతబట్టుకుని, దేవుడిని స్మరించుకోవాలి. ఆతరువాత  రాతిపై కొట్టేటప్పుడు, ఆ రాయిని  ఆగ్నేయ దిశలో ఉండటం  చాలా మంచిది.

కాయ కొట్టేటప్పుడు  తొమ్మిది అంగుళాల ఎత్తునుండి కొట్టడం చాలా  మంచిది

కాయ  సరిగ్గా రెండు భాగాలుగా పగలాలి అని అంటారు. కొంచెం అటు, ఇటు ఐనా పర్లేదు. కొన్నిసార్లు టెంకాయ లోపల నల్లగా  కూడా ఉంటుంది. అదేదో అశుభం అని దిగులుపడఖర్లేదు. దానివల్ల ఎలాంటి అశుభాలు జరగవు. ఆ సమయంలో “శివాయనమః” అని 108 సార్లు జపిస్తే పరిహారం  కూడా అవుతుంది

Read More  నువ్వెంత అదృష్టవంతుడివో నీకు తెలుసా...??

టెంకాయ కొట్టి దానిని విడదీయకుండా చేతబుచ్చుకుని అభిషేకం చేస్తారు చాలామంది. ఆ పద్దతి తప్పు. అలా చేస్తే ఆ కాయ నైవేద్యానికి కూడా  పనికిరాదు

కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని ఒక పాత్రలోనికి తీసుకుని, కాయను వేరు చేసి వేరే ఉంచాలి. పాత్రలోని కొబ్బరినీటిని మాత్రమే అభిషేకించాలి. వేరుగా ఉంచిన కొబ్బరికాయ రెండు ముక్కలుగా చేసి  నైవేద్యంగా సమర్పించాలి.

Originally posted 2022-08-09 08:57:09.

Sharing Is Caring:

Leave a Comment