శబరిమల ఆలయం ఆలయం పుట్టుక గురించి సoక్షిప్తoగా

శబరిమల ఆలయం ఆలయం పుట్టుక గురించి సoక్షిప్తoగా

*శబరిమల ఆలయం* :– ఆలయం పుట్టుక గురించి, సoక్షిప్తoగా తెలుపుతాను.  పరశురాముడు తన అవతార కార్యం ముగిసి పోయినది అని తెలుసుకున్న తరువాత, తపస్సు చేసుకోవటానికై ఒక అణువైన ప్రదేశం కొరకు చూడగా, తన తల్లికి ఇచ్చిన మాట మేరకు 21 మార్లు రాజులపై దండయాత్ర చేసి, ఎధురు తిరిగిన వారిని దునిమి, లొంగి పోయిన వారిని క్షమించి, తాను జయించిన, ఈ భారత ఖండం యావత్తు ధానం ఇచ్చి వేసి వుంటారు.  దానం చేసిన భూమి తనది కాధు కావున భూమికై వెతుకుతూ పోగా సముద్ర తీరం చేరతారు. సముద్రుడిని స్థలం అడుగగా పలకని ఆ సముద్రుడి పై అలిగి తన పరశు అనగా గోడ్డలిచే సముద్రుని దండిoప పూనగా సముద్రుడి విన్నపం మేరకు ఆ గొడ్డలిని  సముద్రుడి పై వేస్తాడు. సముద్రుడు ఆ పరశు ని నీటిపై తేలి యాడునట్లు చేసి, ఆమేరకు భూమిని ఏర్పరస్తాడు.  అదియే పరశురామ క్షేత్రం, నేటి కేరళ.   కాలక్రమమున ఆ భూమిపై ప్రజలు, చెట్లు చేమలు, మృగములు, చేరి, ధూర్మార్గత్వo ప్రబలం కాగా ధర్మాన్ని నెలకొల్ప,  కైలాసమునుండి ధర్మ రక్షకుడైన శ్రీ ధర్మశాశ్తా ను వేడుకొని,, పరశురామ క్షేత్రానికి పిలుచుకొని వచ్చి “ *పొన్నంబలమేడు* ” లో భూమిని తాకక, విశ్వకర్మచే, స్వర్ణ మందిరo ఒకటి  ఏర్పాటు చేసి, అటు పిదప ఆ పరశురామ క్షేత్రం అంతటా 108 ధర్మ శాస్తా ఆలయాలను నెల కొల్పుతారు. అందు అతిముఖ్యమైన శబరి క్షేత్రం తోపాటు, ఆర్యoకావు, అచ్చన్ కోవిల్, కులుత్తపుళ, ఎరిమేలి ఆలయాలు, శ్రీధర్మశాస్థా కు పేరు గాంచిన ఆలయాలు. అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా నెల కొల్పుతారు. ఈ ఆలయాల పూజల నిమిత్తం, మన ఆంధ్రా కృష్ణానధీ తీరం నుండి పవిత్ర శాస్త్రకోవిదులు ఇరువురు అన్నదమ్ములను పిలిచి ఆలయాల పూజా  భాధ్యత ఒప్ప చెబుతారు. అప్పటి నుండి శబరిమల ఆలయం శ్రీ ధర్మ శాస్తా ఆలయాలలో అతి ముఖ్యమైనధిగా చలామణి కాబడి ప్రసిద్ధిమైన, అతి శక్తివంతమైన శ్రీ ధర్మ శాస్తా ఆలయంగా ప్రసిద్ధి గాంచినది.
 *పరశురాముడు త్రేతాయుగమున,   శ్రీరామచంద్రుని వివాహసమయమున కలసినపుడు, తన వద్ధ ఉన్న శివప్రసాధిత ధనుస్సును ఇచ్చినపుడు, పరశురాముడికి తనకు బదులుగా శ్రీరామచంద్రుడు యుగ ధర్మమును పాలింప వచ్చినట్లుగా తెలిసి పోయినట్లుగా పురాణాలలో లిఖింపబడినధి. పరశురాముడి వద్ధ ఒక్క గొడ్డలి మాత్రమే వుంటుంధి. అప్పుడే ఆయన తనకు కావలసిన భూమికై అణ్వేషణ ప్రారంభం అయినట్లుగా తెలుస్తున్నధి. ఇదoతయు త్రేతా యుగమున జరిగినధి. అటు పిదప ద్వాపర యుగము, జరిగి పోయి భూమిపై కలిపురుషుడి ప్రవేశంతో కలికాలం ప్రారంభమైనధి. అదియే భారత యుద్ధ కాలము.  మన పురాణాలన్నీ అప్పటికే  లిఖించ బడినవి.  అందువలన  అయ్యప్ప గురించి ఎక్కడను వ్రాయబడలేధు. శ్రీ ధర్మ శాస్తా గురించి మాత్రమే ప్రస్తావించబడి వున్నధి. ఆయనే కైలాశ వాసి, ధర్మ రక్షణా భారాన్ని నిర్వర్థిస్తూ వుండిన ధర్మ రక్షకుడు. శ్రీ ధర్మ శాస్తా అను పేరు విష్ణు సహస్ర నామావళిలో ప్రస్తుతించ బడి వున్నధి. ధర్మశాస్తా అనగా ధర్మాన్ని శాసిoచువాడు, సంరక్షించువాడు అని అర్థం. అoదులకై ఆయన బ్రహ్మ ఈశ్వరులను కూడా శాసించ గలడు.

శబరిమల ఆలయం ఆలయం పుట్టుక గురించి, సoక్షిప్తoగా

     తరువాత జరిగినవి అన్నియు,  జనులలో ప్రచారము లోనివి,  జానపద గేయాలలోనివి, తమిళ, మళయాళ పాటలను బట్టి వున్నవి మాత్రమే మనకు లభ్యమవుతున్నవి. కాలక్రమములో కలికాలమున, కేరళ రాజ్యంలో తిరిగి దుర్మార్గత్వము, దోపిడి దారులు, త్రాగు బోతులు ప్రబలినారు. శబరిమలలో కృష్ణా తీర పండిత వంశీయులు పూర్తిగా మళయాళమునకే ప్రాధాన్యతనిచ్చి, నంబూధ్రీలుగా పిలువ బడ్డారు. ఆవిధముగా వున్న ఒక పూజారి, శబరిమలకే, స్వామి పూజలకే స్వార్థ రహితముగా తన జీవితాన్ని అంకితం చేసుకొని భార్యను కోల్పోయి ఒంటరి వాడై తనకున్న ఒక్క కుమారుడితో దేవాలయములోనే వుంటూ పూజలు చేసుకుంటూ వుండే వాడు.

 

       ఆ సమయమున ఉధయనుడు అను గజ దొంగ, దోపిడి దారుడి కన్ను శబరిమల కోవెలపై పడినధి. పరశురామ నిర్మిత దేవాలయం కాన, తప్పక అక్కడ విలువైన మణులు, మానిక్యాలు, వజ్ర వైఢూర్యాలు,బంగారం వుంటుందని, ఆలయాన్ని కొల్ల  కొట్ట వస్తాడు. వాడు మంత్ర, తంత్ర, సకల యుద్ధ విధ్యలలో ప్రవీణుడు, కర్కోటకుడు.  ఒంటరి వాడైన పూజారి అడ్డు పడగా ఆ పూజారిని నిర్ధయగా సంహరిస్తాడు. దేవాలయం ద్వంశము చేస్తాడు. తండ్రి (పూజారి) మరణాన్ని కనులారా చూచిన ఆ పూజారి పుత్రుడు, 12 సంవత్సరాల బాలుడు, పేరు జయంతన్ నoబూద్రి.  భయబ్రాంతుడై, దిక్కు తోచక అడవిలో పరిగెత్తి పోతాడు. ధైవ కృప వశాత్తు జయంతన్ పొన్నంబలమేడు చేరుతాడు. అచట జయంతన్ కు ఆత్మానoద అను మహర్షి తటస్థ పడుతాడు. జయంతన్ వృత్తాంతమంతయు విన్న ఆత్మానందుడు, జయంతన్ ను చేరదీసి, శిష్యుడిగా చేసుకొని వేదాలు, పురాణాలు, సకల విధ్యలు నేర్పుతాడు. జయంతన్ జీవితాశయము, ఉదయునుడి పై పగ తీర్చుకోవడం, శబరిమల ఆలయ పునరుద్ధరణ. తన ఆశయ సాధనకై జయంతన్ శ్రీ ధర్మ శాస్తాను తన కోర్కె సిద్ధింప చేయమని తపస్సు చేస్తాడు.
             ఇంతలో ఉద్ధయునుడు ఎన్నో రాజ్యములు కొల్లగొట్టి అతి క్రూరుడిగా మారి పోయి వుoటాడు.  అతని సహాయకులు, పుదుచ్చేరి ముండన్, చందన్ అను ఇరువురు సైనికులు మిక్కిలి బలశాలురు. దొంగతనాలు చేసి గర్వమదాందులై వున్నారు. ఒక మారు వారు పందళ రాజ్యముపై దండెత్తి బలహీనుడైన రాజును ఓడించి, అక్కడ నదిలో స్నానమాచరిస్తుండిన రాజకుమార్తెను అపహరించి, తీసుకొని పోయి ఉదయనుడి  స్థావరమైన ఇచ్చిపార కోటలో బంధీగా వుంచుతారు.
           ఉదయనుడి పై పగతో తపమొనరించు చున్న జయంతన్ కు ధర్మశాస్తా  స్వప్న ధర్శనమై, ఉదయునుడు పందళ రాజకుమార్తెను భందీగా తెచ్చి  ఇచ్చిపారకోటలో వుంచిన విషయ మంతయును చెప్పి, వెంటనే వెళ్ళి ఆమెను విడిపించమని, ఆమె నీకు భార్య కాగలదని, నీ భక్తికి, పట్టుదలకు  మెచ్చి, కాలక్రమంలో నీకు పుత్రుడుగా జన్మించి దుష్టులను శిక్షిoచి, నీ కోర్కె నెరవేర్చుతానని చెప్పి అంతర్ధానమయ్యేను.

శబరిమల ఆలయం ఆలయం పుట్టుక గురించి, సoక్షిప్తoగా

       జయంతన్ కు ఎనలేని ఉత్చాహము, ద్విగుణీకృతమైన  శక్తి,  ధైవ బలం, స్వామి కరుణతో ఎనలేని శక్తి కలిగినది. వెంటనే పొన్నంబలమేడు నుండి బయలుధేరి ఇచ్చిపార కోట చేరేను. అచట రాకుమార్తెను గాంచెను. అపుడు ఉధయనుడు కొల్లకొట్టుటకై తన సహచరులతో ఎక్కడికో పోయి వున్నాడు. తన పగ తీర్చుకోను, ఉధయనుడు వచ్చు దాకా ఆగి, వాడిని సంహరించి, రాకుమారిని విడుదల చేయిస్తాను అని చెబుతాడు. అపుడామె, అది నీవల్ల కాదు. వాడు బలవంతుడు, మాయావి, వాడి సహచరులు యమ కింకరులు లాంటి వారు, నీవొక్కడివి వాడిని ఏమి చేయలేవు, ముంధు నన్ను భంధ విముక్తురాలిని చేసిన, తాను తన తండ్రికి చెప్పి సైన్యమును ఇప్పించి సహాయ పడగలను అని అంటూండగానే, దూరంగా ఉదయునుడు కోలాహలంగా వచ్చే శబ్దములు వినిపిస్తుంది. రాకుమారి జయంతన్ ను సమయం లేదు, తొందరగా తనను భంధ విముక్తిరాలిని చేయమని బ్రతిమ లాడుతుంది. వెంటనే జయంతన్, ఆమెను విడిపించి, తాను, వెళ్ళిన గురం పై ఎక్కిచి కూర్చోంటాడు.  అంత ఆ గుర్రం దూరంగా ఉదయనుడి కోలాహల శబ్ధములకు, డప్పులు, బూరలు వూడుతున్న శబ్ధములు విని బెదిరి పోయి తనకిష్టమొచ్చినట్లు అడవిలో పరిగడ సాగిoది. రాకుమారికి, జయంతన్ దిక్కు తోచలేదు. క్రింద పడి పోగలమెమో నని భయ  బ్రాంతులై ఒకరినొకరు గట్టిగా పట్టుకొని కూర్చోన్నారు. గుర్రం ఏ దిశలో పోతున్నదో  ఏమో వారికి అంతుబట్ట లేధు. మొత్తానికి ఉదయణుడి కళ్ళు కప్పి అపాయము నుండి తప్పించుకొన్నారు. మెల మెల్లగా చీకటి పడ సాగినది.  గుర్రము, వీరిరువురు బాగా అలసి పోయారు. చూడంగా వారు ధట్టమైన అరణ్యంలో నున్నారు. అదృష్ట వశాత్తు అక్కడ ఒక నీటి కొలను, ఫల వృక్షాలు మసక చీకటిలో కనిపించాయి. అక్కడ ఆగారు.  వెన్నెల వచ్చుదాకా, నీటిని త్రాగి కూర్చోన్నారు. గుర్రాన్ని కట్టివేసి అక్కడున్న గడ్డిని పీకి దానికి మేత వేసారు. వెన్నెల వెలుతురులో తినదగ్గ ఫలాలను తెంపుకొని, క్షుద్బాధను తీర్చుకొన్నారు. బడలికతో నిద్ధుర పోయారు.
        ఆ విధముగా ఆ కీ కారణ్యలో చిక్కుబడి పోయి నిధురలోనికి జారుకొన్న ఆ ఇరువురు ఆ రాత్రి చెట్లపై జాగ్రత్తగా నిదురోబోయి, తెల
తెలవారు ఝామున నిదుర మేలుకొని కాలకృత్యాలు ముగించుకొని, తదుపరి కార్యక్రమమునకై ఆలోచించగా, వారి ఆలోచనలు, ప్రణాళికలు ఒక కొలిక్కి రాలేక పోయినందువలన, వారి జాగ్రత్తలు, వారు తీసుకొని, అక్కడే ఒక కుటీరం నిర్మించుకొని ఉండుటకు నిశ్చయించుకొన్నారు. శ్రీ ధర్మశాస్తా నిర్ణయం రాకుమారి తెలిపి, ఆమెను జయంతన్ వివాహం చేసుకున్నాడు. కాలం గడచి పోతుంది. ఆ ధర్మశాస్తాకు పూజలు చేసుకొంటూ కాలం వెళ్ల బుచ్చ సాగారు.
        కాలక్రమంలో శ్రీధర్మ శాస్తా, జయంతన్ నంబూద్రి కి, స్వప్నం లో చెప్పినట్లుగానే వారికి ఒక పుత్రుడు జన్మిస్తాడు. జయంతన్ తాను గతంలో తన తండ్రి వద్దను, ఆత్మానంద మహర్షి వద్దను,  నేర్చుకున్న అన్ని శాస్త్రాలు, వేదాలు, విద్యలన్నియు తన పుత్రుడికి నేర్పించు తాడు. విలువిద్య తదితర యుద్ధ రహస్యాలు కూడా నేర్పించుతాడు. ఆ ధర్మశాస్తా కరుణతో, బాలుడు 12 సంవత్సరాల ప్రాయం లోనే మంచి దృఢకాయుడై, పాతికేళ్ల యువకుడిలాగా తయారవుతాడు.

శబరిమల ఆలయం ఆలయం పుట్టుక గురించి, సoక్షిప్తoగా

 

Read More  అయ్యప్పస్వామి మాలాధారనరోజు గుడికి తీసుకువెళ్ళవలసిన వస్తువులు
     ఒకనాడు జయంతన్ నంబూద్రి, తన పుత్రుని పిలిచి, తన పగను, శబరిమల ఆలయం పునఃప్రతిష్ఠ యొక్క అవశ్యకతను వివరించుతాడు.
          ఒక రహస్య సమాచారంతో రాకుమారి, తన తండ్రి తనకు ఎంతో ఇష్టపూర్వకముగా వేసిన మణిహారమును, శ్రీ ధర్మశాస్తాను ప్రార్థించి, పుత్రునికి మెడలో వేసి, దంపతులిరువురు, పందళ రాజ్యమునకు పంపుతారు. మణికంఠ హారమును ధరించిన బాలుడు, ఆనాటి నుండి *మణికంఠ* నామధేయముతో బలసూర్యుడి వోలె ప్రకాశింప సాగెను.
           మణికంఠుడు పందల రాజ్యము చేరి, తన వృత్తాoతమంతయు తన తాతగారైన పందలరాజుకు వివరించి, ఆయనకు  ప్రేమ పాత్రుడవుతాడు.
        అంతవరకు ఆరాజ్యం లో కత్తియుద్ధంలో పేరు గాంచిన ఒక వీరుడు           ” *కొచ్చికుడత్తన్* “-ను  మణి కంఠుడు చిత్తుగా ఓడించుతాడు. అతను మణికంఠుడి శరణు కోరతాడు. అదే విధంగా విలువిద్య, గదా యుద్ధంలో ప్రవీణులైన *రాముడు, కృష్ణుడు* అను ఇరువురు మణికoఠుడి  శక్తి, మహిమను చూచి, శరణు కోరతారు.
      ముస్లిం మతస్థుడైన *వావర్* అను వర్తకుడు, కేరళ చేరి తన మంత్రం విద్యలతో ఏరిమెలి ప్రాంతములో ఒక గజదొంగ గా ఉంటూ ప్రజలను భయ బ్రాoతుల చేయుచుండెను.మన దేశమునకు ముస్లింలు వచ్చి దాదాపు 1500 సంవత్సరములు అయినది. అంతకు మునుపు ముస్లింలు లేరు. మణికంఠుడు ఏరిమెలి చేరి వావర్ ను అణచెను. అతని మంత్ర,  క్షుద్ర విద్యలను, ప్రజల శ్రేయస్సుకోరకు ఉపయోగించుమని కోరినా. వాడు మాట వినక, పోరుకు తలపడగా అతని క్షుద్ర విద్యలన్నింటిని, మణికంఠుడు నిర్వీర్య పరుస్తాడు. ఓటమి పాలైన వావర్, మణికంఠుని  శక్తిని గ్రహియించి,  శరుణు చొచ్చుతాడు. చివరకు మణి కంఠుడికి అత్యంత సన్నిహితుడై, పరమ భక్తుడాయెను.
         పిదప మణి కంఠుడు *కాలరి* అనుయుద్ధవిద్యా శిక్షణాలయంలో చేరి యుద్ధనైపుణ్యములను నేర్చుకొని, రాజ్యంలోని యువకులనందరిని ఒకేచోట సమకూర్చి, వీరులుగా తయారు చేసి, ఒక పెద్ద సైన్యంనే తయారు చేసెను.
        ఈ విధముగా మణికంఠుడు  పందళము న ఎన్నియో మహిమలు పదర్శించెను. మణికంఠుడు తన యొక్క ధ్యేయము, తన తండ్రి కోర్కెను మహారాజుకు తెలిపి, గజదొంగ ఉదయణుడి పై పగను సాధింప, శబరిమల ఆలయ పునరుద్ధరణ సలుప, అనుజ్ఞ  గైకొనెను. తన అనూయులు, పందళ రాజ్య వీరులచే గూడి బయలుదేరెను.
         తొలుత *ఆలంగాడు* చేరి, అచటి యుద్ధ వీరులను సమీకరించుకొని, పిదప *అంబలపుళ* చేరి అచటి వీరులను సమీకరించుకొని, ఒక గొప్ప అతి పెద్ద,  సైన్యము ను ఏర్పరచెను. ఉదయనుడి అంతమునకు కావలసినవన్నియు సమకూరినది. మిగిలినది శబరిమల ఆలయ పునఃప్రతిష్టా కార్యక్రమం.
*శబరిమల కు తొట్టు తొలుత  వ్రత దీక్ష ఇరుముడి, ప్రయాణం.*
 ఒక శుభదినమున మణికంఠుడు తన సైన్యమునంతయును సమావేశ పరచి, వారికి ఈ విధముగా భోధించెను.
       ఈ యుద్ధ యాత్రకై వచ్చు యువకులు, వీరులు ఏ కులము, ఏ వర్ణము, ఏ ప్రాంతము వారైనను కావచ్చును. శివభక్తులు, విష్ణు భక్తులు, వివిధ మతాలు వారు కావచ్చును, అందరూ ఈ యుద్ధయాత్ర, ఆలయ పునఃప్రతిష్ఠ యాత్రకు అర్హులే అని సెలవిచ్చెను.
        ఈ యాత్రకు కొన్ని నియమములు కలవని చెప్పారు. ఇది యుద్ధ యాత్ర మాత్రమే కాదు, ఆలయ పునఃప్రతిష్ఠ పవిత్ర కార్యము కాన, ఇందు పాల్గొను వారు, కనీసం ఒక మండలకాలము పాటు బ్రహ్మచర్యమును పాటించవలెను. అసత్యం ఆడరాదు. సకల దురభ్యాసములు పూర్తిగా వీడవలెను. ఆశాశ్వితమైన ఈ శరీరం పై బ్రాoతి ఉండరాదు.  ఇరు సంధ్యావేళలా చన్నీటి స్నానము, ఇరువేళ దైవనామ స్మరణ, దైవ పూజ, భజనలు చేయాలి.సాత్విక ఆహారంతీసుకొనాలి, అన్న నియమాలను విధించినాడు. ఈ ద్వివిధ కారణ కార్యము చేయడానికి వలయు దేహదారుడ్యము, ఈ పై నియమములచే మాత్రం సాధించగలము.. అని బోధించి అందరిచే తొలి దీక్షను ప్రారంభింప చేసెను.అందరిచే దేవాలయం లో వ్రత దీక్షా ప్రమాణం చేయించి, మాలలు ధరింప చేసెను.
 *ఇరుముడి కార్యక్రమం:*
            పై విధముగా మండలకాలం గడచిన పిదప  సైనికులందరిని, *ఎరిమేలి* వద్ద సమావేశ పరచెను. అందరిని వారి వారి ఇళ్లకు వెళ్లి, ఇంట్లో వారికి చెప్పి, యాత్ర రోజులకు సరిపడు ఆహార పదార్థములు, ధైవ ప్రతిష్టకు కావలయు పూజా సామగ్రి, అభిషేకానికి నెయ్యి, తీసుకొని రమ్మన్నాడు., బయలు దేరునపుడు, ఏమీ చెప్పక, అందరిని త్యజించి, అదే  ఆఖరు చూపుగా,  కేవలం వారినే చూస్తూ వెనుకకు నడుస్తూ ఆలయమునకు రమ్మని పంపారు. ఎందుకంటే, వెళ్లునది యుద్ధము, అరణ్య మార్గం, ఆ శబరీనాథుడి కృపతో ఎందరు తిరిగి వస్తారో తెలియదు కాన, వారి ఇంటి బాధ్యత, ఇంటిలో వారి బాధ్యత ఆ సర్వేశ్వరుడికి అంకితం చేసి రమ్మని అంటాడు..
      అలా తెచ్చిన సామగ్రిని, రెండు వేరు వేరు ముడులలో బిగించ ప్రారంభించి, అలనాడు నేతికై మట్టి పాత్రలు నిలువదు కనుక నేతిని కొబ్బరి కాయలో నింపింపచేసి,  పూజ సామగ్రిని ముందు ముడిలో బిగింప చేసి, దారి బత్యమంతా రెండవ ముడిలో బిగింప చేసి, ఇరుముడులను, ఒకే మూటగా, బిగింప చేసినారు. అదే *ఇరుముడి.*  మకర సంక్రాంతికి శబరిమల చేరినట్లు, సంసిద్ధులను చేస్తారు.
         ఇరుముడి కార్యక్రమము ముగిసింది. మణికoఠ స్వామి తన సైన్యాన్ని మూడు భాగములుగా విభజించెను. అందు ఆలంగాడు, అంబలపుళ వారు ఎక్కువ. వారికి నాయకుడు కుడుత్తన్, వావర్ లు. పందలం వారికి రాముడు, కృష్ణుడు.(వీరన్, మల్లన్).
       అందరు ఏరిమెలి నందు సమావేశమై యాత్ర ప్రారంభించారు. ఏరిమెలి వీధులలో భక్తి మీర సంతోషముతో, నాట్యాలు చేశారు. నేడు మనం ఆచరించు ” *పెట్టైతుళ్ళి* “. ఇప్పటికిని,  ముందుగా ఆలంగాడు, అంబలపుళ వారు ఈ పేట్టయితుళ్లి ప్రారంభించడం ఆనవాయితీ గా ఉన్నది. అపుడు ధర్మశాస్తా ఆలయమునకు ఒక గరుడపక్షి, అంబలపుళ నుండి వచ్చి, దేవాలయము పై మూడు మార్లు ప్రదిక్షణం చేయును. నేటికిని జరుగుతున్నది. చివరి పెట్టైతుళ్ళి ఆలంగాడు వారు చేస్తారు. అటుపిమ్మట నాట్యం ఎవరు ఆడరు.
      సైనికులందరు వాయిద్యములు, జండాలు, చేతిలో పట్టుకొని ఆయుధాలతో బయలు దేరి, కాళైకట్టి, దాటి, అళుదానది చేరి, నదిలో దారికై అగడ్తను రాళ్లు, చెట్లతో పూడ్చి,(నేడు మనమాచరించు.  ” *కళ్లిడుకుండ్రు* ) ఇచ్చిపార కోటచేరి, మూడు వైపులనుండి కోటను ముట్టడించగా, యుద్ధoలో ఉదయనుడు మరణిస్తాడు. పిమ్మట సైన్యం పంబ చేరి, యుద్ధమందు మరణించినవారికి శ్రాద్ధ తర్పణాలు, విడిచి, దుర్మార్గుడి మరణాన్ని, దీపాలు వెలిగించి పంపాలో వదిలి, వేడుక చేస్తారు. అదియే *పంబవిళక్కు* . ముందు ముడిలోని సరకులతో విందు చేసుకుంటారు.అదియే నేడు ” *పంబసద్ధి* “.
      వేకువఝామున బయలుదేరి, సన్నిధానం ఒక కి.మీ. దూరమున తమ ఆయుధాలన్నింటిని, అక్కడున్న అశ్వర్ధ వృక్షం క్రింద పెడతారు. ఆయుధాలతో సన్నిధానం వెళ్లకూడదను పవిత్రభావం. అదియే నేడు భక్తులం మనమాచరించు ” *శరoగుత్తి* ” కార్యక్రమము.
       సన్నిధానం చేరగా, అప్పటికే మణికంఠుడి వార్తతో రాజు తన పరివారం, మునులు, పండితులు, పూజారులతో వచ్చి వుంటారు. పునఃప్రతిష్ట కార్యం ఘనంగా జరుగుతుంది.
       అవతార పురుషుడు, తాను వచ్చి, పుట్టిన కార్యము ముగిసిన దనియు రాజు, రాణి ల వద్ద వీడ్కోలు తీసుకొని,తాను యుద్ధంలో ఉపయోగించిన అస్త్రములను ఒక్కొక్క మెట్టుగా పెట్టి,  ఆ మెట్లపై నడచి మణి కంఠుడు, పునఃప్రతిష్ఠ ధర్మశాస్త్ర విగ్రహములోనికి లీనమవుతారు. అ దృశ్యము చూచి, మనసు ద్రవించి రాజు, రాణి *”అయ్యా, అప్పా”* అని అక్రందన చేయగా, రెండు పదాలు ఒక్కటిగా కలిపి, అందరూ *’అయ్యా అప్పా’* అని ఎలుగెత్తి పిలువడంలో ఒక్క పదoగా మారి *అయ్యప్ప* నామధేయం, ఏర్పడి, *అయ్యప్ప అలయముగా* పిలువబడినది.
****************************
 *శ్రీ ధర్మశాస్తావే శరణం. అయ్యప్పా శరణం. చరణం…శరణం.*
*శరణం శరణం అయ్యా! శరణం.   స్వామియే శరణం*
Sharing Is Caring:

Leave a Comment