పడుకోవాలంటే పాటించే పదహారు సూత్రాలు

పడుకోవాలంటే పాటించే పదహారు సూత్రాలు

 

శయన నియమాలు:-

1.నిర్మానుష్యంగా లేదా నిర్జన గృహంలో ఒంటరిగా పడుకోరాదు .దేవాలయం మరియు స్మశానవాటికలో కూడా పడుకోకూడదు.

2 పడుకోని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపరా దు.

3. విద్యార్థి,నౌకరు,మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో,వీరిని మేల్కొలపవచ్చును

4. ఆరోగ్యవంతులు  ఆయురక్ష కోసం బ్రహ్మా ముహూర్తం లో నిద్ర లేవాలి. పూర్తిగా చీకటి  ఉన్న గదిలో నిద్రించవద్దు.

5. తడి పాదము లతో నిద్రించరాదు . పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి దేవి కటాక్షము  (ధనం)కలుగుతుంది . విరిగిన మంచము పై,ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం.

6.నగ్నంగా మరియు వివస్త్రలులై పడుకోరాదు .

పడుకోవాలంటే పాటించే పదహారు సూత్రాలు

7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన  విద్య,పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత మరియు ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన హాని లేదా మృత్యువు,ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించిన చో ధనము మరియు ఆయువు కూడా  ప్రాప్తిస్తుంది.

Read More  కన్నుఅదిరితే ఏర్పడే శకునాలు 

8. పగటిపూట ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠ మాసంలో 1 ముహూర్తంన (48నిమిషాలు) పాటు నిద్రిస్తారు.(పగటిపూట నిద్ర రోగహేతువు,మరియు ఆయుక్షీణత కూడా   కలుగచేస్తుంది)

9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు కూడా  అవుతారు.

10.సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు3 గంటల) తరువాత నే పడుకోవాలి.

పడుకోవాలంటే పాటించే పదహారు సూత్రాలు

11.ఎడమవైపు పడుకోవడం వలన  స్వస్థత లభిస్తుంది.

12.దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎపుడు నిద్రించరా దు. యముడు మరియు దుష్ట గ్రహములు   నివాసము వుంటారు.దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. మెదడుకు రక్త సరఫరా కూడా  మందగిస్తుంది. మతిమరుపు,మృత్యువు లేదా అనేకమైన రోగాలు వస్తాయి .

13.గుండెపై చేయి వేసుకుని, చెత్తు యొక్క బీము కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించకూడదు.

14.పడక మీద త్రాగడం మరియు తినడం చేయరాదు.

15. పడుకొని పుస్తక పఠనం చేయడానికి వీల్లేదు.

Read More  కాళహస్తి రాహు కేతువు కాల సర్ప దోష పూజా విధానం మరియు ప్రయోజనాలు,Kalahasti Rahu Ketu Kala Sarpa Dosha Pooja Method and Benefits

ఈ పదహారునియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి,మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు.

Originally posted 2023-01-18 10:36:36.

Sharing Is Caring:

Leave a Comment