...

తెలుగు పొడుపు కథలు,Telugu Podupu Kathalu

తెలుగు పొడుపు కథలు,Telugu Podupu Kathalu

 

మొగ్గ కాని మొగ్గ, ఏమి మొగ్గ?   సమాధానం :  లవంగ మొగ్గ

ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం?   సమాధానం :  తేనె పట్టు

రసం కాని రసం, ఏమి రసం?  సమాధానం :  నీరసం

చిన్న పాపకు చాలా చీరలు. ఏమిటది?  సమాధానం :   ఉల్లిపాయ

జాన కాని జాన, ఏమి జాన?  సమాధానం :  ఖజాన

తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది? సమాధానం :  వేరుశెనగ కాయ

లాగి విడిస్తేనే బ్రతుకు? సమాధానం : ఊపిరి

పువ్వులో అందరికీ పనికి వొచ్చే పువ్వు? సమాధానం : పత్తి పువ్వు

పెద్ద ఇంటిలో పొట్టివాన్ని నిలబెడితే నిండా నేనే? సమాధానం : దీపం

పొద్దుటూరి చెట్లలో పొదిలింది చెళవాయి, చూసే వారే కాని పట్టే వారు లేరు? సమాధానం :సూర్యుడు

మూత తెరిస్తే, ముత్యాల పేరు? సమాధానం : దంతాలు

మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు? సమాధానం :తేనె పట్టు

తెలుగు పొడుపు కథలు,Telugu Podupu Kathalu

 

రెక్కలు లేని పిట్ట గూటికి సరిగా చేరింది?  సమాధానం : ఉత్తరం

కొక లేదు, సీత కాదు! రామ చిలుక కానేకాదు!! అదేమిటి?  సమాధానం : సీతాకోక చిలుక

రాజు నల్లన, ప్రధాని పచ్చన, పాలు పుల్లన?  సమాధానం : తాటి చెట్టు

మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన? సమాధానం : పాలు, పెరుగు, నెయ్యి

మోదం కాని మోదం? సమాధానం :  ఆమోదం

రాజాధి రాజులు కూడా ఒకరిముందు తల వంచుకుంటారు? సమాధానం : మంగలి

రెండు కొడతాయి, ఒకటి పెడుతుంది?  సమాధానం : ఎండ, వాన, చలి

రాళ్ల అడుగున విల్లు, విల్లు కోనలో ముళ్ళు? సమాధానం : తేలు

అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట తోకతో నీళ్లు త్రాగుతుంది. సమాధానం :దీపం వత్తి

కడుపు నిండా రాగాలు, వంటి నిండా గాయాలు? సమాధానం : మురళి

ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు?  సమాధానం :ఉల్లి

సముద్రంలో పుట్టిపెరిగి ఊరిలో అరుస్తుంది, ఏమిటది? సమాధానం :శంఖం

తెలుగు పొడుపు కథలు,Telugu Podupu Kathalu

చెట్టుకు కాయని కాయ కరకరలాడే కాయ? సమాధానం : కజ్జికాయ

వాలం ఉంది కాని కోతిని కాదు, నామముంటుంది కాని పూజారిని కాదు? సమాధానం : ఉడత

రాణాలనే మించిన రణం, ఏమి రణం? సమాధానం :మరణం

రంగం కాని రంగం, ఏమి రంగం? సమాధానం : వీరంగం

మత్తు కాని మత్తు, ఏమి మత్తు? సమాధానం :గమ్మత్తు

అందరినీ పైకి తీసుకుకెళ్తుంది, కాని తాను మాత్రం పైకి వెళ్ళదు? సమాధానం :నిచ్చెన

ముడ్డి పిసికి, మూతి నాకుతారు? సమాధానం : మామిడి పండు

టూరు కాని టూరు, ఏమి టూరు?  సమాధానం :గుంటూరు

డ్రస్ కాని డ్రస్, ఏమి డ్రస్? సమాధానం :అడ్రెస్

జాబు కాని జాబు, ఏమి జాబు?  సమాధానం :పంజాబు

టిక్కు టిక్కుల బండి, టిక్కులాడి బండి, అందరూ వాడే బండి, బ్రేకులు లేని బండి?సమాధానం :గడియారం

తొడిమె లేని పండు! చాలా కాలం ఉండు!!?సమాధానం :విభూతి

తోక లేని పిట్ట 90 ఆమడలు పోతుంది?సమాధానం :పోస్ట్ కార్డు

జారు కాని జారు, ఏమి జారు? సమాధానం : బజారు

తిరిగే దీపము, గాలి-వానకు ఆగని దీపము, చమురులేని దీపము, పిట్టల దీపము?సమాధానం :మిణుగురు పురుగు

తాళము కాని తాళము, ఏమి తాళము?సమాధానం :ఆది తాళము

తమ్ముడు కుంటుతూ కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరుగెత్తుతూ పన్నెండు మైళ్ళు నడుస్తాడు?సమాధానం : గడియారం ముళ్ళు

తెలుగు పొడుపు కథలు,Telugu Podupu Kathalu

తాళి గాని తాళి, ఏమి తాళి?సమాధానం :ఎగతాళి

తెలిసి కుడుతుంది, తెలియక చస్తుంది?సమాధానం :చీమ, దోమ

ఎర్రని ముక్కు, తెల్లని వొళ్ళు, పొడుగ్గా పుట్టి పొట్టిగా పెరుగుతుంది?సమాధానం :క్రొవ్వొత్తి

దానము కాని దానము, ఏమి దానము?సమాధానం :మైదానము

తోలు నలుపు! తింటే పులుపు!! ఏమిటది?సమాధానం :చింతపండు

ధనము కాని ధనము, ఏమి ధనము?సమాధానం :ఇంధనము

చెప్పిందే చెప్పినా చిన్న పాప కాదు, ఎక్కడి పండ్లను తిన్నా దొంగ కాదు?సమాధానం :రామ చిలుక

నాలుగు కాళ్ళున్నాయి కాని జంతువుని కాను, శరీరమంతా రంధ్రాలున్నాయి కాని వలను కాను?

సమాధానం :మంచము

పాలు కాని పాలు, ఏమి పాలు?సమాధానం : లోపాలు

నీరు తగిలితే గుప్పెడవుతుంది, ఎండ తగిలితే గంపెడవుతుంది?సమాధానం :దూది

పురము కాని పురము, ఏమి పురము?సమాధానం :గోపురము

నీతో దెబ్బలు తిన్నాను, నిలువునా ఎండిపోయాను, నిప్పుల గుండము తొక్కాను, గుప్పెడు బూడిదనయ్యాను?సమాధానం :పిడక

ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు?సమాధానం :నీడ

నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను?సమాధానం :గుడి గంట

నారి కాని నారి, ఏమి నారి?సమాధానం :పిసినారి

నిప్పు నన్ను కాల్చలేదు, నీరు నన్ను తడపలేదు, సూర్యుడితో వొస్తాను, సూర్యుడితో పోతాను?సమాధానం :నీడ

పేడ కాని పేడ, ఏమి పేడ?సమాధానం :దూద్ పేడ

నాది నాకు కనపడదు, నీది నీకు కనపడదు, ఏమిటది?సమాధానం :వీపు

సందు కాని సందు, ఏమి సందు?సమాధానం :పసందు

నీటి మీద తేలుతుంది కాని పడవ కాదు, చెప్పకుండా పోతుంది కాని జీవి కాదు, మెరుస్తుంది కాని మెరుపు కాదు?సమాధానం :నీటి బుడగ

తెలుగు పొడుపు కథలు,Telugu Podupu Kathalu

నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది, పీక మీదకు కత్తిని తెస్తే కాని మళ్ళీ నడవదు?సమాధానం :పెన్సిల్

పండ్లున్నా నోరు లేనిది, ఏమిటది?సమాధానం :రంపం

రాయి కాని రాయి, ఏమి రాయి?సమాధానం :పావురాయి

ప్రాణం లేని చిన్న పాప అరిచి అరిచి పిలుస్తుంది, ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెపుతుంది?

సమాధానం :టెలిఫోన్

పైన చుస్తే పండు, తెరిచి చూస్తే బొచ్చు, ఏమిటది?సమాధానం :పత్తికాయ

పుట్టినపుడు ఉండవు, పోయే టప్పుడు ఉండవు, ఏమిటవి?సమాధానం :బట్టలు

పుట్టినపుడు లేకుండా తరువాత వచ్చి ఆ తరువాత పోయేవి?సమాధానం :దంతములు

చక్కగా పెట్టడానికి వీలవుతుంది, తీయటానికి పోతే చెరిగి పోతుంది?సమాధానం :ముగ్గు

సాయి కాని సాయి, ఏమి సాయి?సమాధానం :కసాయి

మంచి సువాసన ఉన్నా, పూజకు పనికి రానిది, ఏమిటది?సమాధానం :మొగిలి పువ్వు

పేరు కాని పేరు, ఏమి పేరు?సమాధానం :కాసుల పేరు

కళ్ళు లేకపోయినా ఏడుస్తుంది, కాళ్ళు లేకపోయినా నడుస్తుంది?సమాధానం :మేఘం

తల నుండి పొగ చిమ్ముతుంది కానీ భూతం కాదు, గొంతులో నిప్పులు దాచుకుంటుంది కానీ రాకాసి కాదు, పాకుతుంది కానీ పాము కాదు?సమాధానం :రైలు

తెలియకుండా పూవు పూస్తుంది, తెలిసి కాయ కాస్తుంది?సమాధానం :అత్తి చెట్టు

జానెడు ఇంటిలో, మూరెడు బెత్తం?సమాధానం :కుండ, గరిట

గడ్డి తినదు, కుడితి తాగదు, కానీ పాలు మాత్రం ఇస్తుంది?సమాధానం :తాటి చెట్టు

కొప్పు ఉన్నా జుట్టు లేదు, కళ్ళు ఉన్నా చూడలేదు?సమాధానం :టెంకాయ

ఐదుగురిలో బుడ్డోడు! పెళ్ళికి మాత్రం పెద్దోడు!!?సమాధానం :చిటికెన వ్రేలు

ఒక ముండ ఎన్ని కోకోలైన విప్పుతుంది?సమాధానం :ఉల్లిపాయ

గారు కాని గారు, ఏమిగారు?సమాధానం :కంగారు

అది లేకపోతే ఎవ్వరూ ఏమీ తినరు?సమాధానం :ఆకలి

అందరూ నన్ను పట్టుకుంటారు కాని నేనే ఎవరిని పట్టుకొను, అందరూ నాతో మాట్లాడతారు కాని నేనే ఎవరితో మాట్లాడను?సమాధానం :టెలిఫోన్

గీత కాని గీత, ఏమి గీత?సమాధానం :భగవద్గీత

గోళము కాని గోళము, ఏమి గోళము?సమాధానం :గందర గోళము

అన్నం పెడితే ఎగురదు, పెట్టకపోతే ఎగురుతుంది?సమాధానం :విస్తరాకు

అడవిలో చిన్న గని, గనికి చాలా గదులు, గదికొక్క సిపాయి, సిపాయికొక్క తుపాకి?సమాధానం :తేనే పట్టు

అన్నదమ్ములు ముగ్గురు, తిరిగితే ముగ్గురూ తిరుగుతారు, మానితే ముగ్గురూ మానుతారు?సమాధానం :ఫ్యాన్

అబ్బాయి గారి దొడ్లో పెద్ద పండు పడితే, పరుగెత్తలేక పది మంది చచ్చారు.సమాధానం :పిడుగు

ఆడవారికి ఉండనిది, మగవారికి ఉండేది?సమాధానం :మీసము

ఆడదానికి పుట్టినింట ఒకటి, మెట్టినింట ఒకటి?సమాధానం :ఇంటి పేరు

ఆడవారు తక్కువగా మాట్లాడే నెల?సమాధానం :ఫిబ్రవరి

ఇల్లంతా తిరిగి మూలకు కూర్చుంటుంది?సమాధానం :చీపురు

ఇళ్ళు లేని పట్నాలు, నీళ్లు లేని సముద్రాలు ఎక్కడ ఉంటాయి?సమాధానం :మ్యాపులో

ఇంటిలో ఉంటే ప్రమోదము, ఒంటిలో ఉంటే ప్రమాదము?సమాధానం :పంచదార

ఇక్కడ వత్తు! అక్కడ వెలుగు!!?సమాధానం :స్విచ్, బల్బ్

అన్నదమ్ములు ఇద్దరు, ఒకరంటే మరొకరికి పడదు, ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. వారి మధ్యకు ఎవరైనా వొస్తే పచ్చడి పచ్చడే?సమాధానం :ఇసుర్రాయి

ఇద్దరు అక్క చెల్లెల్లు, ప్రపంచం మొత్తం తిరిగి చూసినా, ఒకరినొకరు చూసుకోరు?సమాధానం :కళ్ళు

ఇల్లు మొత్తం వెలుగు, బల్ల కింద చీకటి?సమాధానం :దీపం

ఇవ్వకుండా తీసుకో లేనిది! తీసుకోకుండా ఇవ్వ లేనిది!!?సమాధానం :ముద్దు

అన్నదమ్ములు ఇద్దరు, ఒకరు ఎంత దూరం పోతే రెండవ వారు అంతే దూరం పోతారు?సమాధానం :కాళ్ళు

ఈగ ముసరని పండు! ఇంటిలో నుండు!!? సమాధానం:నిప్పు

ఈత చెట్టుకు ఇద్దరు బిడ్డలు? సమాధానం :కల్లు కుండలు

ఊరంతా కదిలిన, ఊరగాయ కుండ కదలదు? సమాధానం : బావి

ఉరికంత ఒక్కటే దుప్పటి? సమాధానం : ఆకాశము

ఎర్రనిచెట్టు! నీళ్లు పోస్తే చస్తుంది!!? సమాధానం :అగ్ని

మాములు వేళలో మర్యాదగా ఉంటుంది, ఎండకు వానకు నెత్తినెక్కుతుంది? సమాధానం : గొడుగు

ఎర్రగా ఉంటాను కాని నేనెవరితో సరసాలాడను, నన్ను ముట్టుకుంటే ఊరుకోను. సమాధానం :నిప్పు

ఎగిరే పిట్ట, రెక్కలు లేని పిట్ట! ఆటలాడుకునే పిట్ట, పిల్లల పిట్ట!!? సమాధానం :గాలి పటము

ఎనమిది ఎముకలు! తట్టెడు ప్రేగులు!!? సమాధానం :మంచము

ఎముకలు లేని జీవము, ఏటికి పోయింది?  సమాధానం :జలగ

ఏది పెడితే అరిగి పోతుంది?, ఏది పెడితే కలకాలం ఉంటుంది? సమాధానం :అన్నము, వాత

Tags:podupu kathalu in telugu,telugu podupu kathalu,podupu kathalu telugulo,podupu kathalu,funny podupu kathalu in telugu with answers,funny podupu kathalu,most popular telugu podupu kadhalu,podupu kathalu telugu videos,popular podupu kathalu,chilipi podupu kathalu,podupu kathalu in english,podupu kadhalu,podupu kathalu telugu lo videos,telugu riddles,telugulo podupu kathalu,podupu vidupulu,podupu kathalu new,riddles in telugu,podupu kathalu videos

Sharing Is Caring:

Leave a Comment