...

గణేశుని నోము పూర్తి కథ

గణేశుని  నోము  పూర్తి కథ

            పూర్వం ఒకానొక ఊరిలో ఒక పుణ్యవతి గత జన్మలో గణేశు నోము నోచి వ్రతమును నియమాను సారము సమాప్తి చేయక వుల్లంఘించింది.    అందుచేత ఆమెకు ఈ జన్మలో దు:ఖము సంభవించినది.  అనుదినం కడుపారా తిన్నా ఎంతటి వేడుకలో పాల్గొన్నా ఆమెకు ఏమి తోచేదికాడు.  స్థిమితం కలిగేది కాదు.  దు:ఖం మున్చుకొస్తుండేది.    ఒక్కత్తే కూర్చుని ఎడుస్తుండేది.  తోటి మగువలందరూ ఆమెను దూషిస్తూ వుండేవారు.

           కారణం తెలియకుండా దు:ఖిస్తున్న ఆమెను చూసి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ఆమెతో నీవు ఒక పామును నీ కొడుకు పడుకున్న పక్కమీద ఉంచు, అది కరాచి నీ కొడుకు చనిపోయినచో నువ్వు ఎడువవలసినది.  నిన్నెవ్వరు నిందించారు అని చెప్పిరి.  వారి ఆదేశానుసారము ఆమె ఒక పామును కొడుకు పక్క వేయగా అది ఆ కొడుకునకు బంగారు మొలత్రాడు అయ్యింది.

గణేశుని నోము పూర్తి కథ

 

             నా ఏడుపు కారణం దొరకలేదని అడవికి పోయి ఏడవసాగింది.  పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమై ఏమి జరిగినది అని ప్రశ్నించారు.  మీరు చెప్పిన ప్రకారము చేసినందున ఆ పాము నా బిడ్డ కి బంగారు మొలత్రాడై పోయినది.  అందువల్లనా ఏడుపుకు కారణం దొరకలేదని చెప్పింది.  పార్వతి పరమేశ్వరులు ఆమెకు ఒక తేలును ఇచ్చి దానిని నీ మనుమరాను బొట్టు పెట్టెలో పెట్టు, పెట్టె తెరవగానే  నీ మనుమరాలిని  తేలు  కుట్టి  ఏడ్చినప్పుడు  నువ్వు కూడా  ఆ కారణంగా  ఏడువ  వచ్చు  అన్నారు .  ఆ ప్రకారం  ఆమె ఆ తేలును బొట్టు పెట్టెలో పెట్టింది .  మనుమరాలు  ఆ పెట్టెని  తెరవగానే  ఆ తేలు  బంగారు బొట్టు చుక్కగా  మారిపోయింది .  ఈ పర్యాయం  కూడా  తన  ఏడుపుకు కారణం దొరకలేదని అడవికి వెళ్లి రోదించసాగింది.  పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమై సంగతి తెలుసుకున్నారు.  పిల్లిని ఇచ్చి దానిని ఇంటికి తీసుకువెళ్ళి చంపి దాని కారణంగా ఏడువ వచ్చు అని చెప్పినారు.  ఆ ప్రకారం ఆ పిల్లిని ఇంటికి తీసుకుని పోయి చంపి తాను ఎడువడానికి ఇరుగు పొరుగు వారిని పిలిచింది.  తీరా ఆ ఇరుగు పొరుగు వారు ఇంటికి రాగా ఆ పిల్లి కాస్తా బంగారు పిల్లిగా మారి పోయింది.

              ఇరుగు పొరుగు వారంతా నవ్వుకుని పెల్లిపోగా ఏమి చెయ్యాలో తోచక వున్న ఆమె చెంతకు పార్వతీ పరమేశ్వరులు వచ్చి నువ్వు నీ గత జన్మలో గణేషుని నోమును ఉల్లంఘించి నందువల్లె నీకీ అకారణ దు:ఖం.  ఇది తోలగాలంటే నువ్వు గణేషుని నోమును నోచుకోవడమే నీకు మార్గం అని చెప్పారు.  ఆమాటలు మదికేక్కిన మగువ గణేషుని నోమును నోచుకున్నది.  దాని ప్రభావం వలన ఆమెకు దు:ఖం తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవించింది.

ఉద్యాపన: 

కొత్త మూకుడులో అయిదు గిద్దేల నూనె పోసి వత్తిని వేసి వెలిగించాలి.  స్వయం పాకంను దక్షిణ తామ్బూలాడులతో శివాలయంలో నంది దగ్గర పెట్టాలి.

Sharing Is Caring:

Leave a Comment