దంపతుల తాంబూల నోము పూర్తి కథ,Full Story of Dampatula Tambulam Nomu

దంపతుల తాంబూల నోము పూర్తి కథ ,Full Story of Dampatula Tambulam Nomu

 

             పూర్వం గంగానదీ తీరమున విప్రవతి అనబడే బ్రాహ్మణ అగ్రహారం వుండేది.  ఆ గ్రామంలోని బ్రాహ్మణ కుటుంబాలలో గోపాల శర్మ అనబడే విప్రిత్తముని కుటుంబము చాలా  పెద్ద కుటుంబము.  ఆయనకు ముగ్గురు కుమారులు ఉండేవారు .  పెద్ద వారిద్దరికీ వివాహాలు అయి చక్కగా జీవిస్తున్నారు.  మూడవవానికి కూడా వివాహం చేశాడు.  అదేమీ ప్రార్బ్ధమోగాని ఆ కోడలు కాపురానికి రాగానే అందరితోను చీటికి మాటికి గొడవలు జరుగుతుండేవి.  అయినవారు కానివారు ఆమె మీద నిందలు మోపి అనరాని మాటలతో దుర్భాశలాడుతుండేవారు.  వారందరితో ఎంతో మంచిగా మసలుకోవాలన్న ఆమెకు సాధ్యమయ్యేది  కాదు.

దంపతుల తాంబూల నోము పూర్తి కథ

 

           కాలం గడచి పోతున్నదే కాని పరిస్థితులలో ఎటువంటి మార్పు రాకపోగా నిందలు నిష్టూరాలు  కూడా ఎక్కువై పోయాయి.  అందుకు తమవల్ల దోషమేమితో తెలియని ఆ చిన్న కోడలు వారందరి మధ్య మసలుకోలేక ఒకనాటి రాత్రి ఊరూ పోలిపెరలోని శివాలయానికి వెళ్లి గోడుగోడున విలపించాసాగింది.  తనతప్పేమిటి ఈ ముప్పు తీరాలంటే ఏమి చెయ్యాలి, చావే నాకు శరణ్యమా!  అని అమాయకంగా ప్రశ్నించింది.  ఆమె ఆవేదనకు జాలిపడ్డ శివుడు సాక్షాత్కరించి బిడ్డా నీ వలన దోషమేమిలేదు.  నేవెంత సౌమ్యంగా వినయ విధేయతలతో మసలుకున్నా చులకనగా హేళనగా నీ జీవితమూ సాగుతుంది.  ఇందుకు గల కారణము గత జన్మలో దంపతతాంబూలాల నోము నోచి మధ్యలో ఆపివేశావు.  ఆ కారణం చేత స్త్రీలకు పురుషులకు నీపట్ల ద్వేశాభావాలు కలుగుతున్నది.  ఇది తోలగాలంటే నీవు నీ ఇంటికి పోయి దంపతతాంబూలాల నోము నోచుకో ఈ నోముకారనముగా నీ చుట్తో గల ఇరుగు పొరుగు వారు నీ ఇంటివారు మేట్టినిన్తివారు నీమీద ప్రేమానురాగాలు కలిగి నిన్ను ఆదరిస్తారు.  అని ప్రభోదించాడు.

Read More  పదహారు ఫలాల నోము పూర్తి కథ

              ఆమె ఆ ప్రకారం ఇంటికి వెళ్లి దంపతతాంబూలాల నోము నోచుకోని అయినవారందరిలో గౌరవమర్యాదలు మన్ననలతో హాయిగా జీవిస్తారు.

దంపతుల తాంబూల నోము పూర్తి కథ,Full Story of Dampatula Tambulam Nomu

 

ఉద్యాపన: 

పార్వతీ పరమేశ్వరులకు పీటం ఏర్పాటు చేసి శతనామావలితో ఆ ఆదిదంపతులను ఆరాధించాలి.  గుణవంతులైన దంపతులను ఆహ్వానించి వాళ్లకు తలంటి నీళ్ళు పోసి నూతన వస్త్రాలు కట్టబెట్టి పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనాలు ఆరగిమ్పజేసి దక్షిణ తాంబూలాలతో గౌరవించి వారికి పాదాభివందనం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి.  ఇలా పదిహేను వారాలు చేసి ఆఖరున అన్న సంతర్పణ చేయాలి.  ఇలా చేయడము వలన సాతివారిలో తోటివారిలో మేటిగా గుర్తిమ్పబడి గౌరవ మర్యాదలు గల జీవితాన్ని గడపగలుగుతారు.

Tags:dampatula tambulamu nomu katha,significane of kanne tulasi nomu,kanne tulasi nomu story,list of fruits for padaharu phalala nomu story of goddess mangala gowri devi,#nomu,noomu,padaharu phalala noomu for goddess mangala gowri durgadevi,kanne tulasi nomu rules,kanne tulasi nomu katha,16 palala nomu,suryachandrula nomu katha,kanne tulasi nomu for girls,kanne tulasi nomu,kanne tulasi nomu for girl child,somavaramu pachagam,16 phalala nomu katha

Read More  మంగళగౌరి వ్రతం లో విధిగా పాటించాల్సిన నియమాలు
Sharing Is Caring:

Leave a Comment