మంగళసూత్రం యొక్క మహిమ,The glory of the Mangalasutra

మంగళసూత్రం యొక్క మహిమ,The glory of the Mangalasutra 

 

దౌర్భాగ్య పరిస్థితి ఏమిటంటే మన హిందూ సోదరీమణుల నవీనత పరాకాష్టకి వెళ్లి మంగళసూత్రాన్ని త్యజించడం / లేదా పక్కనపెట్టడం పరిపాటిగా కూడా మారింది. అంతేకాక ఈ  సినిమాలు టీవీల పుణ్యమా అని అది ఒక ఆట వస్తువుగా కూడా  మారిపోయింది.

మన ఖర్మ కొద్దీ మన బంధు మిత్రగణాల నుండి వచ్చే వాట్సాప్ లు ఫేస్బుక్ లలో వచ్చే ఫోటోలు కూడా,  ఎక్కువ శాతం మంగళసూత్రాలు, బొట్టు, గాజులు లేకుండా ఉన్నవే. ఇది చాలా అరిష్టం.

 క్షీరసాగరమధన సందర్భంలో మాంగళ్యవివరణ

“మ్రింగెడివాడు విభుండని మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మ్రింగుమనే సర్వమంగళ మంగళసూత్రంబు నెంత మదినమ్మినదో!*

పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవి గా ఉన్నడంటే అది ఆయన గొప్ప కాదట, అమ్మ పార్వతీ దేవి కంఠాన్న ఉన్న మాంగల్యాభరణం యొక్క గొప్పదనమట.

“మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా!

కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాంశతం”

ఓ సుభగా! నా జీవనానికి ఆధారమైన ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి  నేను కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్ళు జీవించు, అంటే పుణ్యస్త్రీగా మరియు ముత్తయిదువుగా సకల సౌభాగ్యాలతో జీవించు అని స్పష్టముగా తెలుస్తున్నది.

Read More  శ్రీదేవీ స్థానాలు

పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు ఎటువంటి ఆచారాలు మరియు , కట్టుబాట్లు ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి.

భారతావనిలో పిండారీలు, థగ్గులు వంటి కిరాత జాతులవారు కూడా  వలస వచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొనిపోయేవారు.

మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా వారిని  విడిచిపెట్టేవారు. కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని గౌరవించారు. అలా కోట్లాది మగువల మాన ప్రాణాలను కాపాడిందీ మంగళసూత్రం. అప్పటినుండీ ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్ళి చేసి మాంగల్యం వేసేవారు.

ఆదిశంకరాచార్యుల వారు వ్రాసిన సౌందర్యలహరి పుస్తకములో కూడా మంగళ సూత్రానికి విశేష విశిష్టతను  కల్పించారు.

మంగళసూత్రంలో ముత్యం మరియు  పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది.  ఎందుకంటే, ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, సౌందర్యం మరియు  మనస్సు, శాంతి, ఆనందములకు, అన్యోన్యదాంపత్యములకు కారకుడు. శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంథులు, సిరలు, ధమనులు మరియు స్తనములు, స్త్రీల గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భధారణ, ప్రసవములకు కారకుడు.

Read More  వినాయకుడి ఇష్టమైన పూలు వాటి యొక్క విశిష్టత

పగడం కుజగ్రహనికి ప్రతీక. కుజగ్రహ దోషాల వలన అతికోపం, కలహాలు మరియు  మూర్ఖత్వం, సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని, విద్యుత్భయములు, పరదూషణ, కామవాంఛలు, దీర్ఘసౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు మరియు శారీకంగా ఉదరము, రక్తస్రావము, గర్భస్రావము, ఋతుదోషములు మొదలగునవి.

మంగళసూత్రం యొక్క మహిమ,The glory of the Mangalasutra

 

ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27. ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు ఒకటి  27 రోజులు సంచారంగావించి 28వ రోజున కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతుసమయం వస్తుంది .  ఆరోగ్యమైన స్త్రీకి 28వ రోజులకు ఋతుదర్శనమవాలి.

భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యం మించిన విలువైనది లేనేలేదు, దానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేషమైన గూడార్ధమున్నది.

ముత్యం పగడం ధరించిన పాత తరం స్త్రీలలో ఆపరేషన్ అనేది చాలా అరుదైన విషయం. కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్తోనే జరగటం  చాలా సర్వ సాధారణమైపోయింది.

ముత్యం మరియు  పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీకేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగా,  మరియు భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను మరియు  దోషాలను తొలగిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు .

Read More  అర్జునుడికి గీతోపదేశం చేసిన ప్రదేశంలోని కురుక్షేత్రం

చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యంమరియు  పగడం రెండూ కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభఫలితాలు ఇస్తుంది  .

Tags: mangalsutra,mangalsutra design,mangalsutra designs,gold mangalsutra,gold mangalsutra design,sone ka mangalsutra,gold mangalsutra with price,tutorial of making gold manalsutra,gold mangalsutra designs,latest mangalsutra designs,gold mangalsutra design with price,latest gold mangalsutra designs,v mangalsutra,mangalsutra ban,tiktok mangalsutra,bridal mangalsutra,long mangalsutra designs,22k gold mangalsutra,diamond mangalsutra,bulgari mangalsutra

Sharing Is Caring:

Leave a Comment