జన్మ నక్షత్రాన్నిఅనుసరంచి మనం పూజించ వలసిన లేక పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలు

జన్మ నక్షత్రాన్నిఅనుసరంచి మనం పూజించ వలసిన లేక పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలు

జ్యోతిష్య శాస్త్రంలో 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు , అధిదేవతలు ఉన్నట్లుగానే , వాటికి సంబంధించిన వృక్షాలు/చెట్లు కూడా ఉన్నాయి

జన్మ నక్షత్రాన్నిఅనుసరంచి మనం పూజించ వలసిన లేక పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలు

అశ్వని నక్షత్రం – వారు విషముష్టి లేదా జీడిమామిడి చెట్టును   పెంచడం మరియు  పూజించడం వలన జననేంద్రియాల, మరియు చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చును . ఈ చెట్లను  పెంచి పూజించడం ద్వారా సంతాన అబివృద్ది కూడా  కలుగుతుంది. అలాగే, అన్ని విషయాలలోనూ సూటి గా వ్యవహరించడం మరియు  సమయాన్ని వృదా చేయకుండా అన్ని పనులను సమర్ధవంతంగా నిర్వహించడం కొరకు చక్కగా ఉపయోగపడుతుంది.

భరణి నక్షత్రం – వారు ఉసిరి చెట్టును పెంచడం మరియు  పూజించడం ద్వారా జీర్ణ వ్యవస్థ , ఉదర సంబంధిత, పైత్యము మరియు  పైల్స్ వంటి బాధల నుండి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి క్రియేటివిటి ఎక్కువ గా  ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించడానికి  కూడా ఉపకరిస్తుంది .

కృత్తిక నక్షత్రం – వారు అత్తి లేదా మేడి చెట్టును పెంచడం  మరియు పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుండి రక్షింపబడతారు.  అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది. అలాగే చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చేయాలనీ సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైన తట్టుకొని నిలబడే శక్తి కలుగుతాయి.

జన్మ నక్షత్రాన్నిఅనుసరంచి మనం పూజించ వలసిన లేక పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలు

రోహిణి నక్షత్రం – వారు నేరేడు చెట్టును  పెంచడం మరియు  పూజించడం ద్వారా చక్కెర వ్యాధి మరియు నేత్ర సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం  మరియు  సత్ప్రవర్తన ఎక్కువ గా కలుగుతాయి. వ్యవసాయం, వాటికి సంబందించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి కూడా  ఉపయోగపడుతుంది.

మృగశిర నక్షత్రం – వారు మారేడు లేదా చండ్ర చెట్టుని పెంచడం మరియు  పూజించడం ద్వారా గొంతు, స్వరపేటిక, థైరాయిడ్ మరియు అజీర్తి సమస్యల నుండి బయటపడతారు. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్దికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు.

ఆరుద్ర నక్షత్రం – వారు చింత చెట్టుని పెంచడం మరియు  పూజించడం ద్వారా గొంతు మరియు స్వరపేటిక సంబంధిత సమస్యల నుండి బయటపడతారు.  అంతే కాకుండా విషజంతువుల బాధ కుడా వీరికి కలగదు. వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి కూడా  ఉపయోగపడుతుంది

పునర్వసు నక్షత్రం – వారు వెదురు లేదా గన్నేరు చెట్టు ను పెంచడం మరియు పూజించడం ద్వారా ఊపిరితిత్తుల కి సంబందించిన వ్యాధులు క్షయ మరియు  ఉబ్బసం శ్వాసకోస బాధల నుండి, మరియు రొమ్ము క్యాన్సర్ నుండి ఉపశమనం పొందుతారు. బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యం గా పాల కి లోటు ఉండదని చెప్పవచ్చును . పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా , చక్కటి చాకచక్యం తో మెలిగి బయటపడడానికి కూడా  ఉపయోగపడుతుంది.

Read More  పడుకోవాలంటే పాటించే పదహారు సూత్రాలు

పుష్యమి నక్షత్రం – వారు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచడం మరియు  పూజించడం వలన నరాల సంబంధిత బాధలు నుండి విముక్తి పొందుతారు. అలాగే శత్రువుల బారి నుండి రక్షణ కూడా కలుగుతుంది. రోగ మరియు  రుణ భాధల నుండి విముక్తి లభిస్తుంది . స్త్రీలు సంతానవతులవుతారు.

ఆశ్లేష నక్షత్రం – వారు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచడం మరియు  పూజించడం వల్ల శ్వేతకుష్ఠు మరియు చర్మ సంబంధిత వ్యాదుల నుండి రక్షణ పొందగలరు.  అలాగే ముందు చూపు తో వ్యవహరించి జీవితం లో ముందుకు సాగడానికి ఎంతటి విషమ పరిస్థితుల్లోనైన తట్టుకోవడానికి చక్కగా  కూడా ఉపయోగపడుతుంది.

జన్మ నక్షత్రాన్నిఅనుసరంచి మనం పూజించ వలసిన లేక పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలు

మఖ నక్షత్రం – వారు మర్రి చెట్టును  పెంచడం మరియు పూజించడం ద్వారా ఎముకల సంబంధిత మరియు అనుకోని వ్యాదుల నుండి రక్షింపబడతారు. అలాగే భార్య భర్తలు ఎంతో అన్యోన్యం గా ఉండడానికి, తల్లితండ్రులకు మరియు సంతానానికి కూడా మేలు జరుగుతుంది. జీవితం లో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి.

పుబ్బ నక్షత్రం – వారు మోదుగ చెట్టును  పెంచడం మరియు  పూజించడం ద్వారా సంతానలేమి సమస్యల నుండి బయటపడతారు. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చును.ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడడానికి ఎటువంటి వ్యవహారాలలోనైన తొందరపడకుండా వ్యవహరించడానికి  కూడా ఉపయోగపడుతుంది.

ఉత్తర నక్షత్రం – వారు జువ్వి చెట్టును  పెంచడం మరియు  పూజించడం ద్వారా హృదయ సంబంధిత వ్యాధుల నుండి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలని వారి చేతనైనంతగా అందించడానికి, మరియు  మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది .

హస్త నక్షత్రం – వారు సన్నజాజి మరియు కుంకుడు చెట్లను పెంచడం, పూజించడం వలన ఉదర సంబంధిత బాధల నుండి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకొని అన్నిటికీ ఎదురీది విజయం సాధించడానికి మరియు  దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది.

చిత్త నక్షత్రం – వారు మారేడు లేదా తాళ చెట్టును  పెంచడం మరియు పూజించడం ద్వారా పేగులు, అల్సర్ మరియు జననాంగ సమస్యల నుండి బయటపడగలరు. ఎవరిని నొప్పించకుండా వారి తెలివి తేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన నైపుణ్యం కలగడానికి కూడా  ఉపయోగపడుతుంది.

స్వాతి నక్షత్రం – వారు మద్ది చెట్టును పెంచడం మరియు పూజించడం ద్వారా స్త్రీల  గర్భసంచి సమస్యల నుండి బయట పడగలరు.  అలాగే  వారికి ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు. అన్ని రకములైన విద్యలలోను కూడా  రాణిస్తారు.  ఆత్మవిశ్వాసం అధికం గా ఉంటుంది. భావోద్వేగాలు అధికం గా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి  కూడా ఉపయోగపడుతుంది.

Read More  పరబ్రహ్మ స్వరూపం

జన్మ నక్షత్రాన్నిఅనుసరంచి మనం పూజించ వలసిన లేక పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలు

విశాఖ నక్షత్రం – వారు వెలగ మరియు  మొగలి చెట్లను పెంచడం ద్వారా జీర్ణసంబంధిత సమస్యల నుండి బయటపడతారు. ఎటువంటి పరిస్థితులనైన తట్టుకొని నిలబడడానికి మరియు  ముందు చూపు తో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి  కూడా ఉపయోగపడుతుంది.

అనురాధ నక్షత్రం – వారు పొగడ చెట్టును  పెంచడం మరియు  పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు. పదిమంది లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చేయడానికి మరియు  విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి, ఆలోచనా శక్తి అబివృద్ది చెందడానికి  కూడా ఉపయోగపడుతుంది.

జ్యేష్ఠ నక్షత్రం – వారు విష్టి చెట్టును  పెంచడం మరియు  పూజించడం ద్వారా కాళ్ళు, చేతుల యొక్క సమస్యలు, మరియు  వాతపు నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు. చిన్నతనం నుండే బరువు భాద్యతలు సమర్దవంతం గా మొయగలరు . ఆత్మవిశ్వాసం తో ముందుకు సాగడానికి కూడా  ఉపయోగపడుతుంది.

మూల నక్షత్రం – వారు వేగి చెట్టును  పెంచడం మరియు  పూజించడం ద్వారా పళ్ళకి సంబంధించిన , మధుమేహం, కొలస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపు లో ఉంటాయి. అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణ లో ఉంటుంది. శాస్త్ర ప్రవీణం, మంచి వ్యక్తిత్వము మరియు  ఔన్నత్యం కలగడానికి, సంతానం వల్ల జీవితం లో ఆనందాన్ని  పొందడానికి ఉపయోగపడుతుంది.

పూర్వాషాడ నక్షత్రం – వారు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచడం మరియు  పూజించడం ద్వారా కీళ్ళు, సెగగడ్డలు  మరియు వాతపు నొప్పులు  జననేంద్రియ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. దాపరికం లేకుండా వ్యవహరించడానికి పరోపకార బుద్ది . వినయవిదేతలు కలగడానికి కూడా ఉపయోగపడుతుంది.

ఉత్తరాషాడ నక్షత్రం – వారు పనస చెట్టును  పెంచడం మరియు  పూజించడం ద్వారా చర్మ సంబంధిత వ్యాధులు దరి చేరవు. అలాగే ఆర్దికం గా కూడా ఎటువంటి సమస్యలు తలెత్తవు. భూముల కి సంబంధించిన వ్యవహారాలు బాగా కలసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్న వారికి అవి తొలగి వారు మంచి అబివృద్ది లోకి రావడానికి కూడా  ఉపయోగపడుతుంది.

శ్రవణం నక్షత్రం – వారు జిల్లేడు చెట్టును పెంచడం మరియు  పూజించడం ద్వారా మానసిక సమస్యలు దూరమవుతాయి. అలాగే ధనపరమైన సమస్యలు  కూడా తొలగుతాయి.  న్యాయం, ధర్మం పాటించేడానికి మరియు  కార్యజయం సిద్దించడానికి  కూడా ఉపయోగపడుతుంది.

Read More  108 రూపాలతో కూడిన శ్రీ మహా గణపతి శ్లోకాలు

ధనిష్ఠ నక్షత్రం – వారు జమ్మి చెట్టును పెంచడం మరియు పూజించడం ద్వారా మెదడు కి సంబంధించిన సమస్యలు రావు. అలాగే వీరికి తెలివి తేటలు మరియు  మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగుతాయి. కుటుంబ సభ్యుల అండదండల కొరకు, సంతానాబివృద్ధి కొరకు కూడా  ఉపయోగపడుతుంది.

జన్మ నక్షత్రాన్నిఅనుసరంచి మనం పూజించ వలసిన లేక పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలు

శతభిషం నక్షత్రం – వారు కడిమి చెట్టు లేదా అరటి చెట్టు ను పెంచడం ద్వారా శరీర పెరుగుదల కి సంబంధిచిన , మోకాళ్ళ సమస్యల నుండి బయటపడతారు. మంచి శరీర సౌష్టవం మరియు  చక్కటి ఉద్యోగం కొరకు, జీవితం లో చక్కగా స్థిరపడడానికి కూడా  ఉపయోగపడుతుంది.

పూర్వాభాద్ర నక్షత్రం – వారు మామిడి చెట్టును  పెంచడం ద్వారా కండరాలు మరియు  పిక్కలకి సంబంధించిన సమస్యలు రావు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితి ని పొందతారు  . కళలు, మరియు సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాల లో తిరిగే అవకాశం కొరకు, మరియు ఆర్ధిక స్థిరత్వం కొరకు, రాజకీయాల లో రాణించడానికి  కూడా ఉపయోగపడుతుంది.

ఉత్తరాభాద్ర నక్షత్రం – వారు వేప చెట్టును  పెంచడం ద్వారా శ్వాస కోశ బాధలు మరియు  కాలేయ సంబంధిత బాధల నుండి రక్షణ లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్నత విద్యల ను అభ్యసించడానికి, ఉన్నత పదవులు మరియు  సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ఠలు కొరకు, వైవాహిక జీవితం ఎంతో ఆనందం గా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది.

రేవతి నక్షత్రం – వారు విప్ప చెట్టును  పెంచడం మరియు పూజించడం ద్వారా థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపు లో ఉంటాయి. మంచి విజ్ఞానం, విన్నూతమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు, కీలక పదవులు, సంతాన ప్రేమ మరియు  గౌరవం అప్యాయతలు వృద్ది చెందుతాయి .  జీవితం లో అందరి సహాయ సహకారాలు లభించడానికి  కూడా ఉపయోగపడుతుంది.

 

Tags: the history of the ark of the covenant,my help comes from the lord,bible stories for children,short stories,pray the glorious mysteries of the holy rosary,sunday school stories in english,best worship songs,how to create a library management system in excel,apostle joshua selman worship songs,goddess lakshmi stories for children,the history of the bible,bible story for children,the ranveer show podcast,children’s bible stories,the real ten commandments

Sharing Is Caring:

Leave a Comment