Sweet Potato:పోషకాలు పోకుండా చిలగడదుంపలను ఇలా ఉడికించాలి
Sweet Potato: మనం రకరకాల దుంపలను తీసుకుంటాం. వాటిలో చిలగడదుంపలు కూడా ఉన్నాయి. దీని గురించి మనమందరం విన్నాము. ఇతర వాటిలాగే ఇవి కూడా అనేక రకాల పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాము . స్వీట్ పొటాటోలో విటమిన్ B6, విటమిన్ D మరియు పొటాషియం, మెగ్నీషియం మరియు ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలోని చక్కెర స్థాయి అదుపులో ఉంఛుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది.
ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో చిలగడదుంపలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి కంటి చూపుతో పాటు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. చిలగడదుంపలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో వాపులు మరియు నొప్పి తగ్గుతాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతాయి. చిలగడదుంపలను చాలా మంది ఇష్టపడతారు. చిలగడదుంపలను నేరుగా నీటిలో వేసి ఉడకబెట్టేవారూ ఉన్నారు. ఫలితంగా చిలగడదుంపల రుచిలో మార్పు వస్తుంది.
చిలగడదుంప దుంపలను నేరుగా ఉడకబెట్టడం వల్ల అవి తక్కువ రుచిగా మరియు చప్పగా ఉంటాయి.ఈ దుంపలలో ఉండే పోషకాలు పోకుండా రుచి మరింత పెరిగేలా వీటిని ఎలా ఉడికించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Sweet Potato:పోషకాలు పోకుండా చిలగడదుంపలను ఇలా ఉడికించాలి
ఒక మందపాటి గిన్నెలో లేదా కుక్కర్ లో చిలగడ దుంపలను ఒకదాని పక్కన ఒకటి ఉంచాలి. ఉదాహరణకు కుక్కర్‌ను తీసుకుంటే అందులో ఏమీ వేయకుండా నేరుగా చిలగడ దుంపలను ఒక దాని పక్కన ఒకటి పెట్టుకోవాలి . తరువాత కుక్కర్ మీద ఒక లోతైన గిన్నెను పెట్టాలి. గిన్నె అడుగు భాగం కుక్కర్ లోపల కిందకు ఉండాలి. ఇక ఈ గిన్నెలో నీళ్లను పోయాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసి 15 నిమిషాల పాటు ఉడికించాలి.
ఇప్పుడు, గిన్నెని క్రిందికి తీసుకుని, చిలగడదుంపలు ఉడికాయో లేదో చూడాలి. ఉడికితే వాటిని తీసి పక్కన పెట్టి తరువాత పొట్టు తీసి నేరుగా తినవచ్చును .లేదంటే వాటిని ఇంకో వైపుకు తిప్పాలి. అనంతరం మళ్లీ నీళ్లతో ఉన్న గిన్నెను కుక్కర్ మీద పెట్టాలి. తరువాత మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. దీంతో చిలగడ దుంపలు సరిగ్గా ఉడుకుతాయి. ఇలా ఈ దుంపలను నేరుగా నీటిలో వేయకుండా ఆవిరిపై మాత్రమే ఉడికించాలి. దీంతో పోషకాలు కోల్పోకుండా ఉంటాయి. తద్వారా వాటిల్లోని పోషకాలు అన్నీ మనకు లభిస్తాయి. వి టిని తినడం వల్ల పోషకాలతోపాటు శక్తి కూడా లభిస్తుంది. దీంతో ఆరోగ్యంగా కూడా ఉండవచ్చును .