యక్ష ప్రశ్నలకు ధర్మరాజు సమాధానాలు చెప్పిన ప్రదేశం

యక్ష ప్రశ్నలకు ధర్మరాజు సమాధానాలు చెప్పిన ప్రదేశం

బరద్వాన్లోని ధర్మరాజు ఆలయం. ధర్మరాజు ధర్మ నిరతిని పరీక్షించదలచాడు యమధర్మరాజు. నీటికోసం కొలను వద్దకు వచ్చిన ధర్మరాజు నలుగురు తమ్ముళ్ళనీ హతమార్చగా ధర్మరాజే అక్కడికి వచ్చినపుడు యక్షుని రూపంలో యముడు వేసిన యక్షప్రశ్నలకి ధర్మరాజు సమాధానమిచ్చి ఆయనని సంతృప్తి పరిచాడు. అప్పుడు యమధర్మరాజు ‘నీ సమాధానాలు నన్ను తృప్తి పరిచాయి గనుక నీ తమ్ములలో ఒకరిని బ్రతికిస్తాను… ఎవరు కావాలో కోరకో’మనగా ధర్మరాజు నకులుడిని
బ్రతికించమన్నాడు. నకులుడే ఎందుకు అని అడగగా కుంతీపుత్రులలో జ్యేష్ఠుడను నేను బ్రతికి ఉన్నాను.
మాద్రి పుత్రులలో జ్యేష్ఠుడు నకులుడు కనుక అతనిని బ్రతికించమన్నానని’ యమధర్మరాజుతో చెప్పగా ఆయన ధర్మరాజు ధర్మనిరతికి సంతసించి నలుగురు తమ్ముళ్ళనీ బ్రతికించాడు. వారు ధర్మానికే మారుపేరైన ధర్మరాజుకి ఇక్కడ ఆలయం నిర్మింప చేశారు. అదే ఈ ఆలయం. ఈ ఆలయంలో ధర్మరాజు తాబేలు రూపంలో దర్శనమిస్తాడు.
Read More  శివలింగములు-వాటిలోని రకములు మరియు వివిధ ఫలితములు
Sharing Is Caring:

Leave a Comment