తిధులు వాటి యొక్క ఫలితాలు
మనం దేవతలను పలురకాలుగా, మనకు వీలైన రీతిలో పూజిస్తూ ఉంటాము. ఆ విధంగా చేసే పూజలు నియమ నిష్టలతో చేసినట్లైతే తగిన ఫలితం కూడా వస్తుంది. దీనికి సంబందించిన తిధులు, వాటి యొక్క ప్రత్యేకత, ఏ రోజు ఏ దేవతను ఆరాధిస్తే ఎంతటి పుణ్య ఫలం కలుగుతుందో అనే వివరణ మనకు వరాహ పురాణం లో వివరించ బడినది.వరాహ పురాణం లో శ్రీ మహా విష్ణువు స్వయంగా తిధులు వాడి విశేషాల గురించి భూదేవికి వివరించారు.
తిధులు వాటి విశిష్టత :
పాడ్యమి :దేవతలలో ముందు పుట్టిన వాడు అగ్ని. కాబట్టి తిధులలో మొదటిదైన పాడ్యమి నాడు అగ్ని ని పూజించి మరియు ఉపవాసం ఉండినట్లైతే మంచి ఫలితం కూడా ఉంటుంది.
విదియ : అశ్విని దేవతలను ఆరాధించాలి. వారు ఆ తిధి నాడు పుట్టినందు వల్ల, ఏడాదిపాటు అశ్విని దేవతలను ఉద్దేశించి విదియ వ్రతాన్ని నియమ నిష్టలతో చేస్తే శుభప్రదం కలుగుతుంది .
తదియ : గౌరీ దేవిని పూజించాలి. గౌరీ కళ్యాణం తదియ నాడు జరిగినందు వల్ల, గౌరీ దేవికి ఆ తిధి అంటే చాలా ఇష్టం. ఇది ప్రత్యేకంగా స్త్రీ ల కోసం ఏర్పాటు అయినది.
చవితి: వినాయకుడు పుట్టిన తిధి. వినాయక చవితి నాదే కాకుండా ప్రతీ చవితినాడు వినాయకుడిని పూజించవచ్చును .
పంచమి: పంచమి నాడు నాగులు జన్మించాయి. అందుకే నాగ దేవతలకు పంచమి తిధి / నాగుల చవితి అన్న చాల ఇష్టం. ప్రతీ పంచమినాడు పుట్టలో పాలు పోసి నాగ పూజ చేస్తే నాగుల వల్ల కలిగే భయం ఉండదు.
షష్టి : కుమారస్వామి /సుబ్రహ్మణ్య స్వామి జన్మతిధి. ఆ రోజున అర్చన చేసినట్లైతే సుబ్రహమణ్య అనుగ్రహం కూడా పొందగలరు.
సప్తమి:సూర్యుని జన్మ తిధి. రధసప్తమి నాడే కాకుండా ప్రతీ శుద్ధ సప్తమి నాడు సూర్యుడిని ఆరాదించి క్షీరానాన్ని నైవేద్యంగా పెడితే ఆయురారోగ్యాలు పొందుతారు .
అష్టమి: దుర్గాదేవి అష్టమాకృతులు ఆవిర్భవించిన తిధి. అష్టమాకృతులను మరియు దుర్గా దేవిని పూజిస్తే శుభం కలుగుతుంది.
నవమి: దుర్గాదేవి కి ప్రీతికరమైనది. ఆ తిధి నాడు దుర్గ ను పూజించి మరియు ఉపవాసం ఉంటే సంపదలు కలుగుతాయి.
దశమి: దశమి నాడు దిక్కుల సృష్టి జరిగింది. ఇంద్రాది దేవతలు ఈ దిక్కులకు పాలకులు. దిక్పాలకులను పూజిస్తే పాపాలు కూడా తొలగుతాయి.
ఏకాదశి: కుబేరుడు పుట్టిన తిధి. ఈ తిధిన కుబేర పూజ చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది
ద్వాదశి: విష్ణువు కి ఇష్టమైన తిధి. ఈ తిధి రోజే విష్ణు మూర్తి, వామన రూపం లో జన్మించారు. ద్వాదశి నాడు బ్రాహ్మణుడికి కూరగాయలు దానం చేస్తే తే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది.
త్రయోదశి: ధర్ముడు పుట్టిన తిధి. ఈ రోజున ఎవరికీ ఇష్టమైన దేవుడిని వారు తలచుకొని పూజిస్తే , మంచి ఫలం చేకూరుతుంది.
చతుర్దశి: రుద్రుని తిధి. ఆనాడు రుద్రార్చన చేసినట్లైతే చాలా శుభప్రదం. కృష్ణ చతుర్దశి నాడు మాస శివరాత్రి కూడా వస్తుంది. ఆ తిధి శివుడికి చాలా ప్రీతికరం.
అమావాస్య: పితృదేవతలకు ఇష్టమైన తిధి. దర్భలు మరియు నువ్వులు, నీళ్ళతో పితృదేవతలకు తర్పనమిస్తే వారు సంతోషించి సంతాన సౌక్యంను అనుగ్రహిస్తారు.
పౌర్ణమి: పౌర్ణమికి చంద్రుడు అధిపతి. పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి కి చంద్రుడిని పూజించినట్లితే ధనధాన్యాలు మరియు ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కూడా సిద్దిస్తాయి.