...

సీతాఫలం వలన కలిగే ఉపయోగాలు దుష్ప్రభావాలు,Side Effects Of Custard Apple

సీతాఫలం వలన కలిగే ఉపయోగాలు దుష్ప్రభావాలు,Side Effects Of Custard Apple

 

 

వర్షాకాలంలో విరివిగా దొరికే సీతాఫలం రుచిని ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. పోషక విలువలు అధికంగా ఉండే సీతాఫలం పళ్ళు వర్షాకాలం ప్రారంభమవగానే మార్కెట్లో   బాగా కనబడతాయి.  ఇది తిన్న వెంటనే శక్తిని ఇస్తుంది. వీటిలో సి విటమిన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. ఇంకా ఇందులోని ఐరన్, విటమిన్ సి, పాస్ఫరస్, మెగ్రీషియం అధికంగా ఉండి ఆరోగ్యానికి బాగా మేలు చేస్తుంది.  ఎన్నో ఖనిజాలు, విటమిన్లు మరియు అనామ్లజనకాలతో పాటు అత్యధిక పీచు పదార్ధాలతో సమృద్ధిగా ఉండే సీతాఫలం మన ఆరోగ్యానికి ఎనలేని మేలు చేస్తుంది.

అంతేకాదు ఎన్నో సౌందర్య గుణాలు కలిగిన పండ్ల జాబితాలో ఈ సీతాఫలం ముందు వరుసలో ఉంటుంది. భారతదేశంలో విరివిగా లభించే ఈ పండు ఆబాల గోపాలానికి ఎంతో ఇస్టమైనది.  ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్ మొదలగు రాష్ట్రాలలో ఎక్కువగా లభిస్తుంది. వెస్ట్ ఇండీస్ మొదలుకుని అమెరికాలోని ఉష్ణప్రాంతాలలో పుట్టి వ్యాపించిన ఈ పండులో ఎన్నో ఆరోగ్య ఉపయోగాలతో పాటు కొన్ని హానికరమైన గుణాలు కూడా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

 

సీతాఫలం వలన కలిగే ఉపయోగాలు దుష్ప్రభావాలు,Side Effects Of Custard Apple

 

సీతాఫలం వలన కలిగే ఉపయోగాలు దుష్ప్రభావాలు

 

సీతాఫలం వలన కలిగే ఉపయోగాలు :

  • కణాల క్షీణతకు కారణమయ్యే ఫ్రీ రాడికల్సును విటమిన్ సి సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. ఈ గుణానికి కేంద్రంగా నిలిచే సీతాఫలం . ఆసాంతం తీసుకుంటే సంవత్సర కాలం ఎన్నో రోగాల నుండి విముక్తిని కూడా  పొందవచ్చును.
  • అంతేకాదు ఈ విటమిన్ సి కంటి చూపుకు, జీర్ణ వ్యవస్థను క్రమబద్దీకరించడంలోనూ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అందుకే ఆరోగ్య నిపుణులు ఈ పండ్లను తప్పకుండా తీసుకోవాలని సూచిస్తుంటారు.
  • ఇక జుట్టు మరియు చర్మ సంరక్షణకు విటమిన్ ఏ పోషణలు కీలకం కాగా సీతాఫలంలో అధిక మోతాదులో ఇవి లభిస్తాయి. అందుకే ఈ పండును సిఫారసు చేయని సౌందర్య నిపుణుడు ఉండడంటే అతిశయోక్తి కాదు.
  • పొటాషియం మరియు మెగ్నీషియం ఎక్కువగా ఉన్న సీతాఫలం ఎన్నో గుండె జబ్బులను సమర్ధవంతంగా ఎదుర్కోగలదు.
  • ఇందులో ఉండే పొటాషియం కండరాలకు నూతనోత్తేజాన్ని కలిగించి ముభావం అనే భావనను దరిచేరనివ్వదు. ముఖ్యంగా భారతదేశంలో శీతాకాలంలో ఉండే బద్దకాన్ని పోగొట్టడానికి ఈ పండు ఎంతో  చాలా దోహదపడుతుంది.
  • ఇందులో ఉండే కాపర్ గుణాలు మలబద్దకాన్ని తొలగించడమే కాకుండా అతిసారం వంటి రోగాలను కూడా దరిచేరకుండా చేస్తాయి.
  • ఇక బక్కపలచగా ఉండి లావు కావాలని ప్రయత్నించేవారు. శీతాకాలం పొడుగునా రోజూ ఒక పండు తింటే మేలు చేకూరుతుంది.
  • ఇక ఈ పండులోని గింజలను పొడిగా చేసి మొక్కలకు పురుగుల మందుగానూ, జుట్టులో చుండ్రును పోగొట్టడానికి గానూ వినియోగిస్తుంటారు.
  • అంతేకాకుండా సీతాఫలం చెట్టు ఆకులను, బెరడును, గింజలను ఆయుర్వేద రంగం మరియు ఫార్మా రంగంలో విరివిగా కూడా  వినియోగిస్తారు.
  • వీటి ఆకుల రసాన్ని శరీరంపై గాయాలను నయం చేయడానికి వినియోగిస్తారు. ఇదే ఆకులను నీటిలో వేడి చేసి, ఆ నీరు తాగితే మధుమేహ సమస్యతో పాటు వృద్ధాప్యం దరిచేరదు.

సీతాఫలం వలన కలిగే ఉపయోగాలు దుష్ప్రభావాలు,Side Effects Of Custard Apple

 

సీతాఫలం వలన కలిగే అనర్ధాలు

  • బక్కపలచని వాళ్ళు బరువు పెరగడంలో సీతాఫలం దోహదపడుతుంది కానీ కొంతమందిలో అధిక బరువును కూడా పెంచుతుంది. కనుకనే సదరు వ్యక్తులు వీటిని అధిక మోతాదులో తీసుకోకుండా తగిన మోతాదులో తీసుకోవాలని వైద్యులు చాలా  సూచిస్తున్నారు.
  • ఇక వీటి తీయదనం కారణంగా పళ్ళ ప్రియులు వీటిని ఎక్కువగా తీసుకుంటే అజీర్తితో పాటు అతిసారం వంటి రోగాల బారిన పడే అవకాశం ఉంది.
  • వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, ఈ గుణం మన శరీరంలో అధికంగా చేరినపుడు కంటి చూపు సమస్యలతో పాటు మానసిక స్థితిలో మార్పు మరియు నిర్జలీకరణ స్థితికి కారణం కావచ్చని కొంతమంది ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు.
  • అంతేకాకుండా వీటిలో ఐరన్ కూడా ఎక్కువే, శరీరంలో ఇది ఎక్కువగా చేరితే కడుపునొప్పితో పాటు ఇతర పేగు సంబంధిత రోగాలకు దారితీయవచ్చు.
  • సీతాఫలం రెండు మూడు ఆకులను నీళ్లలో వేడిచేసుకుని ప్రతి రోజూ ఉదయం గోరువెచ్చగా తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.
  • సీతాఫలం వేరును పేస్టులా చేసుకుని ఒక గ్లాసు గోరువెచ్చని నీటికి పావు స్పూను పేస్టు కలుపుకుని తాగితే ఎంతటి తీవ్ర జ్వరమైనా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Tags: custard apple,custard apple benefits,benefits of custard apple,health benefits of custard apple,custard apple health benefits,custard apple nutrition,custard apple calories,custard apple fruit,custard apple side effects,side effects of custard apple,uses of custard apple,custard apple benefits and side effects,health benefits of custard apples,custard apple tree,benefits of eating custard apple,custard apple benefits in telugu
Sharing Is Caring:

Leave a Comment