అయ్యప్పస్వామి దీక్ష లొ వ్రత నియమాలు గురు ప్రార్థన

 _*?అయ్యప్ప చరితం -?*_

?☘️?️☘️?️☘️?️☘️?️☘️?️

అయ్యప్పస్వామి దివ్య చరితం తో పాటు ఆ స్వామి భక్తుల కోసం ఏర్పరిచిన అయ్యప్ప దీక్షా నియమాలను గూర్చి తప్పకుండా తెలుసుకుందాం. అయ్యప్పస్వామి అనుగ్రహంతో సర్వాభీష్టాలు నెరవేరి శాంతి తో సన్మార్గంలో జీవించి స్వామి సన్నిధిని చేరుకుంటారు ! ఏదీ అందరూ ముక్తకంఠాల తో ముందుగా గురుమూర్తి అయిన అయ్యప్పస్వామి వారిని స్తుతించండి ..

 

*‘‘పరమ పావనం స్వామి విశ్వ విశృతం వరగుణప్రదం స్వామి భక్తపాలకం గిరిగుహాప్రియం స్వామి నిత్య నిర్మలం హరహరాత్మజం స్వామి దేవ మాశ్రయేత్ !’’* అని అందరూ భక్తి పూర్వకంగా భజనలు చేస్తుంటే ఆ ప్రాంతమంతా భక్తిపూరిత ప్రశాంత వాతావరణంతో విలసిల్లినది

*ఆరవ అధ్యాయం*

**

* అయ్యప్పస్వామి దీక్ష – వ్రత నియమాలు గురు ప్రార్థన:*

*‘గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః*

*గురుర్ద్రేవో మహేశ్వరః*

*గురుసాక్షాత్ పరబ్రహ్మా*

*తస్మై శ్రీగురవే నమః’’* అంటూ గురు పరంపరకు మూలపురుషుడు , త్రిమూర్త్యాత్మకుడు అయిన దత్తాత్రేయ స్వామికి ముందుగా నమస్కరించారు .సూత మహర్షి ! ముని ముఖ్యులను కూడా స్మరించారు.

Read More  శబరిమల‌ అయ్యప్పస్వామి ఇరుముడి ప్రాశస్త్యం ఇరుముడి వివరణ

*‘‘జ్ఞాన విజ్ఞాన సిద్ధర్థ్యం భజేహం నారదమునిం*

*వ్యాసం వాల్మీకి వౌనీంద్రం వశిష్టం బ్రహ్మవాదినమ్!*

*సర్వశాస్త్రార్థ యోగ్యార్థం సర్వగ్రంథి విభేదనమ్*

*బ్రహ్మ విష్ణు శివం మూర్తింగురు రూపముపాస్మహే’’* అంటూ స్తుతించి చెప్పసాగారు.

*సద్గురువు ఆవశ్యకత*

పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లడానికి గురువు అనుజ్ఞ , దీక్ష , నియమాలు ఆవశ్యకత కావు ! కాని అయ్యప్పస్వామి దర్శనానికి ఆయన ఎక్కి వెళ్లిన పద్ధెనిమిది మెట్లమీద నుండి ఎక్కి వెళ్ల డానికి మాత్రం గురువు , వ్రతదీక్ష , మాల ధరణ మొదలైన ఇవ తప్పక అవసరమవతాయి.

*గురువు లలో చదువులు నేర్పే గురువులను కాకుండా బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన సద్గురువు వల్ల పొందే మంత్రోపదేశం అయ్యప్పస్వామి వ్రతదీక్షకులకు సత్ఫలితాలనిస్తుంది !* ప్రధాన అర్చకుల నుండి మంత్రోపదేశం పొంది దీక్ష స్వీకరించి మెట్లెక్కి వెళ్లిన స్వామి దర్శనం చేయటం వల్ల ఆ మనిషిలో దైవభక్తి , ఆధ్యాత్మిక చింతన పొందుతాయని ! సద్గుణాలు అలవడతాయి ! రాగద్వేషాలు విడిచి పెట్టి , అహంకారం , ఆడంబరం లేకుండా అందరి పట్ల దయాభావంతో సమానతలు దృక్పథంతో చూడ గలుగు తారు. భగవంతుడు పరబ్రహ్మ ! ఆ పరబ్రహ్మమును చేరడానికి సద్గురువు ఉపదేశం పొందటమ మార్గం అన్న వివేచన కలుగు తది ! అప్పయ్యస్వామి సన్నిధిలో పూజా కార్యక్రమాలు నిర్వర్తించే అర్చకస్వాములు , పది సంవత్సరాల వరుసగా దీక్ష స్వీకరించే పద్ధెనిమిది మెట్లక్కి స్వామి దర్శనం చేసుకువచ్చిన గురు స్వాములు ఇతరులకు దీక్ష ఇవ్వడానికి అర్హతను కలిగి వుంటారు ! వీరు మానసిక పరిపక్వత కలిగిన పరబ్రహ్మతత్వాన్ని ఆకళింపు చేసుకునే వుండగలరు !

Read More  శబరిమలలొని కాంతిమలలో జ్యోతి దర్శనం

మాలధారణ

దీక్ష స్వీకరించాలని సంకల్పంతో చేసుకున్న వళ్ళు ముందురోజు తాము ఎంచుకున్న గురు స్వామి వారిని దర్శించి తమకు దీక్ష ఇవ్వవలసిందిగా ప్రార్థించాలి ! ఆ సద్గురువు ఆశీర్వాదము చేసి మాలను  ధరింపజేయడానికి అంగీకరించి స్థల నిర్ణయం చేస్తారు .

*స్థల నిర్ణయం:*

గురువు ఆశ్రమము , ఇంట్లో పవిత్రంగా , ప్రత్యేకంగా వుంచుకునే పూజాగృహం , అయ్యప్పస్వామి దేవాలయం , ఇతర దేవీ దేవతల దేవాలయాలు దీక్షాస్వీకారానికి అనుకూలమైనవి !

*కాలవ్యవధి:*

వృశ్చిక మాసం (వృశ్చిక రాశిలో సూర్యుడు సంచరించే నెల రోజులు) మొదటి రోజునుండి 41 రోజుల కాలాన్ని మండల కాలంగా వ్యవహరిస్తారు ! ఈ 41 రోజులు దీక్షాకాలం వ్రతకాలాన్ని పరమ పవిత్రంగా గడపాలి !

*దీక్ష స్వీకారం:*

ముందు రోజు గురుస్వామిని కలుసుకుని ఆయన చెప్పిన స్థలానికి (సాధారణంగా అయ్యప్పస్వామి గుడిలో దీక్ష ఇచ్చి మాలధారణ జరుపుతారు) పగటిపూట గుడి మూయడానికి పూర్వం గురుస్వామి నిర్ణయించిన సమయానికి చేరుకోవాలి ! ఆ రోజు సూర్యోదయానికి ముందే లేచి నిత్యకృత్యాలు తీర్చుకుని చల్లని నీటితో తలస్నానం ఆచరించి శుభ్ర వస్త్రాలు ధరించాలి ! దీక్ష స్వీకరించేవారు నల్లనిరంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి !

Read More  అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర

*నల్లరంగు వస్తధ్రారణ ఆంతర్యం:*

తెలుపు , ఎరుపు , పసుపు రంగుల కలయికవల్ల నల్లరంగు ఏర్పడుతుంది ! వీటిలో సత్వగుణానికి తెలుపు రంగు , రజోగుణానికి ఎరుపు రంగు , తమోగుణానికి పసుపు రంగు ప్రతీకలు ! ఈ మూడు రంగుల కలయికతో ఏర్పడే నల్లని వస్త్రాలను ధరించటం వల్ల మనిషిలోని ఈ మూడు గుణాలను తగిన రీతిలో అదుపులో ఉంచుకోవాలని నలుపు రంగు గుర్తుచేస్తుంటుంది. నల్ల రంగు వస్త్రాలను ధరించి నుదుట విభూది , చందనము , కుంకుమ బొట్టు పెట్టుకోవాలి.

???????????

Sharing Is Caring:

Leave a Comment