అవిసె గింజల పొడి తయారీ విధానం

Health Tips

By Pamu Udaya

కావ‌ల్సిన ప‌దార్థాలు మూడు స్పూన్ల అవిసె గింజలు రెండు స్పూన్ల జీలకర్ర, ఒక స్పూన్ సోంపు గింజలు ఒక కప్పు కరివేపాకు

కావ‌ల్సిన ప‌దార్థాలు అర స్పూన్ పసుపు 1/4 స్పూన్ నల్ల ఉప్పు, పావు స్పూను కరక్కాయ పొడి పావు స్పూను ఇంగువ

తయారీ విధానం పొయ్యి మీద పాన్ పెట్టి మూడు స్పూన్ల అవిసె గింజలను  వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించి  పక్కన పెట్టుకోవాలి. 

ఆ తర్వాత అదే పాన్ లో రెండు స్పూన్ల జీలకర్ర, ఒక స్పూన్ సోంపు గింజలు వేసి వేయించాలి . 

మరల అదే పాన్ లో ఒక కప్పు కరివేపాకు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. 

ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో వేయించి పెట్టుకున్న అవిసె గింజలు, జీలకర్ర, సోంపు గింజలు మరియు  కరివేపాకు వేసుకోవాలి 

దానికి  అర స్పూన్ పసుపు, 1/4 స్పూన్ నల్ల ఉప్పు, పావు స్పూను కరక్కాయ పొడి, పావు స్పూను ఇంగువ వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. 

ఈ పొడిని  గాజు సీసాలో నిల్వ చేసుకుంటే దాదాపుగా 15 రోజులు పాటు నిల్వ ఉంటుంది.