జీవితంలో అసాధ్యం అంటూ ఏమీ ఉండదు, అందుకు మన ప్రయత్నమే ముఖ్యం - అరిస్టాటిల్‌

ఇతరులను ఆనందంగా ఉంచడంలోనే మనకు అసలైన ఆనందం దొరుకుతుంది - ఎమర్సన్‌

బాధే మనల్ని బలవంతులం అయ్యేలా చేస్తుంది, వైఫల్యమే విజయానికి కావాల్సిన వివేకాన్ని సమకూర్చుకునేలా చేస్తుంది - సిసిరో

జ్ఞానం వంశపారంపర్యంగా వచ్చేది కాదు, దాన్ని ఎవరికి వారు సంపాదించుకోవాల్సిందే - స్టీవ్‌ జాబ్స్‌

ప్రేమ, నిజాయతీ, పవిత్రతలతో ఉండే వారిని ఈ ప్రపంచంలో ఏ శక్తీ ఓడించలేదు - స్వామి వివేకానంద

దండించే అధికారం ఉన్నా దండించకపోవడమే నిజమైన సహనం - గాంధీజీ

మనకు ఉన్న సంపదతో సంతృప్తి పడటం ఉత్తమం, మనకున్న జ్ఞానం సరిపోతుందనుకోవడం అజ్ఞానం - సర్వేపల్లి రాధాకృష్ణన్‌

సంతృప్తి లేకపోవడమే దుఃఖాలన్నింటికీ కారణం - గౌతమ బుద్ధుడు

యుద్ధంలో వెయ్యి మందిని సంహరించేవాడి కన్నా తన మనస్సును తాను జయించగలిగినవాడే నిజమైన వీరుడు - గౌతమ బుద్ధుడు

ఏదీ దానంతట అది మన దగ్గరకు రాదు, శోధించి సాధించాల్సిందే - శ్రీశ్రీ

చివరి వరకూ పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు - చేగువేరా