జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే.. మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ.. మన కోసం తెరచిన తలుపును చూడకుండా వదిలేస్తాం..   హెలెన్ కెల్లర్

ఈ రోజు నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత.. నువ్వు చేసిన పనుల గురించి కాకుండా.. చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు. అందుకే నచ్చినవన్నీ చేసేయాలి :  మార్క్ ట్వెయిన్

తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో.. తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి : డేవిడ్ బ్రింక్ లీ

సక్సెస్ సాధించేందుకు ఓ మంచి ఫార్ములా అయితే.. నేను చెప్పలేను. కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చేలా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా : హెర్బర్ట్ బయార్డ్ స్వోప్

నువ్వు కేవలం ఒక్కసారే జీవిస్తావు. కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులు చేస్తే.. ఒక్కసారి జీవించినా చాలు : మే వెస్ట్

తనతో తాను ప్రతి రోజు ప్రేమలో పడే వ్యక్తికి.. శత్రువులే ఉండరు. : బెంజమిన్ ఫ్రాంక్లిన్

సంతోషంగా ఉండే వ్యక్తులంటే ఎక్కువ పొందేవాళ్లు కాదు.. ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవాళ్లు : జాక్సన్ బ్రౌన్

జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటే.. అసలు ప్రారంభించనిదే. అసలు ప్రారంభించని పనే అసాధ్యంగా కనిపిస్తుంది : ఆంథోనీ రాబిన్స్

ఈ రోజుతో మీ జీవితం పూర్తయిపోతే.. ఏ పనులను చేయకపోయినా ఫర్వాలేదని అనుకుంటారో.. అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి. : పాబ్లో పికాసో

గతాన్ని తలుచుకుని బాధపడే బదులు, భవిష్యత్తుని నిర్మించుకోవడానికి ప్రయత్నించండి. - స్టీవ్‌ జాబ్స్‌