మొటిమలు తగ్గాలంటే ఇలా చేయండి

టమాటను   కమలాపండు(సంత్రా), రసాన్ని సమపాళ్లలో కలపి ముఖానికి ఒక మాస్క్‌లా వేసుకోవాలి

కొద్ది సమయం అరిన తరువాత  నీటితో పూర్తిగా కడిగేయండి. ఇలా తరచూ  చేస్తే ముఖంపై ఉండే  మొటిమలు, నల్లమచ్చలు పోయి ముఖం ప్రకాశ వంతంగా   అవుతుంది.

ఎండబెట్టిన కమలాపండు(సంత్రా) తొనలుకు ,కొన్ని ఎల్లిపాయలను  తీసుకొని  వాటికి  సరిపడా నీళ్లు కలుపుతూ మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి

ఇది  ముఖానికి ఒక  స్క్రబ్‌లా  కూడా ఉపయోగించండి. – పుదీనా ఆకులను  తీసుకొని వాటిని  మెత్తగా ఫెస్ట్‌లా తయారు చేసుకొవాలి

ఆ పేస్ట్‌ను  ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తరువాత చల్లని నీటితో కూడా శుభ్రం గా  కడిగేయండి ఇలా  తరచు  చేస్తే మొటిమలు కూడా  తొందరగా మాయమైపోతాయి.

రోజ్‌వాటర్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి ముఖంపై అప్లై చేయాలి. 15-30 నిమిషాల తరువాత నీళ్లతో  శుభ్రంగా  కడిగేయాలి.

దోసకాయ ముక్కలను తీసుకొని దానికి  సరిపడా ఓట్‌మిల్, మూడు టీస్పూన్స్ తేనేను కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దానిని ముఖానికి  ఒక   మాస్క్‌లా అప్లై చేయాలి

అప్లై చేసిన పదిహేను    నిమిషాల తరువాత కడిగేస్తే మొటిమలు పోయి ముఖం ప్రకాశ వంతంగా  కూడా అవుతుంది.