ఆలయంలో ఇచ్చే కుంకుమ, విభూతి ఏమి చేయాలి

ఆలయంలో ఇచ్చే కుంకుమ, విభూతి ఏమి చేయాలి 

మనందరం ప్రతిరోజూ లేదా వారానికి ఒకసారి లేదా పండుగలు మరియు  పర్వదినాల్లో సమీప దేవాలయాలను దర్శిస్తాం. స్వామి వారిని లేదా అమ్మవార్లను దర్శిస్తాం.  గుడిలో దైవ దర్శనం అనంతరం అక్కడ ఏదైనా ప్రసాదంగా పులిహోరా మరియు  చక్రపొంగలి వంటివి ఇస్తే వెంటనే తినేయడమో లేక ఇంటికి తెచ్చుకుని తినడమో చేస్తాం.

అయితే ప్రసాదంగా కుంకుమ, విభూతి ఇస్తే చాలామంది వాటిని కొద్దిగా నుదుట పెట్టుకుని మిగిలిన దాన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తారు.  అలా  ఇచ్చిన కుంకుమ, విభూతిని  కొందరు ఆలయ గోడలపై లేదా ఎక్కడ పడితే అక్కడ పారేస్తారు.

ఆలయంలో ఇచ్చే కుంకుమ, విభూతి ఏమి చేయాలి

 

ఆలయాల్లో ఇచ్చే కుంకుమ, విభూతి ప్రసాదాలను నుదుట ధరించాక గోడలపై లేదా ఆలయంలోని ఏదైనా ప్రదేశంలో చల్లటం చేయకూడదని పెద్దలు చెబుతారు. ఆలయంలో స్వామి  లేదా అమ్మవార్లను విభూతి మరియు  కుంకుమలతో పూజించిన  ఆ తర్వాత వాటిని మనకు ప్రసాదంగా  కూడా ఇస్తారు.  విభూతి మరియు కుంకుమ ప్రసాదాలు ఇవ్వడం అనేది మనతో పాటు మన చుట్టూ ఉండే వారిని రక్షించటం కోసమే అని చెప్పుతారు .

Read More  పరబ్రహ్మ స్వరూపం

అలాంటి మహిమాన్వితమైన ప్రసాదాలను ఆలయాల్లోనే వదిలి వెళ్ళడం అనేది  దైవ అనుగ్రహాన్ని తిరస్కరించినట్లు కూడా  అవుతుంది. కాబట్టి  అలా ఇచ్చిన  కుంకుమ, విభూతి వంటి వాటిని కొద్దిగా నుదుట ధరించి, మిగిలిన వాటిని ఇంటికి తెచ్చుకోవాలి .  మన పూజా మందిరంలో ఉంచుకొని, ప్రతిరోజూ నుదుటన ధరిస్తే తప్పక శుభ ఫలితాలు చేకూరుతాయని శాస్త్రవచనం. మన ఇంటి చుట్టుప్రక్కల వారికి కూడా ఇస్తే చాలా  మంచిది.

Sharing Is Caring:

Leave a Comment